STOCKS

News


దీర్ఘకాలానికి మూడు షేర్లు

Monday 1st October 2018
Markets_main1538374605.png-20746

లాంగ్‌ టర్మ్‌ ఇన్వెస్టర్లు ఎల్‌అండ్‌టీకి చెందిన మూడు అనుబంధసంస్థల షేర్లపై దృష్టి పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 
1. ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌: క్యు1లో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. స్థిర కరెన్సీ రెవెన్యూలో 5.1 శాతం వృద్ధి నమోదయింది. ఎబిటాలో సైతం మంచి మెరుగుదల కనిపించింది. నికరలాభం దాదాపు 25 శాతం వృద్ధి చెందింది. బీఎఫ్‌ఎస్‌, మీడియా విభాగంలో రెండంకెల వృద్ధి కనిపించింది. ప్రస్తుతం 27 పీఈ వద్ద ట్రేడవుతోంది. గత ఆర్థిక సంవత్సరం మంచి డివిడెండ్‌ను ప్రకటించింది. కొత్త ఏడాది రెవెన్యూ గైడెన్స్‌పై భారీ అంచనాలున్నాయి.
2. ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌: గత త్రైమాసికంలో నికరలాభం దాదాపు రెట్టింపు కాగా, రెవెన్యూలో 40 శాతం పెరుగుదల నమోదయింది. డాలర్‌ లెక్కల్లో చాలా మంచి వృద్ధి కనిపించింది. ఎబిటాలో 170 బీపీఎస్‌ మెరుగుదల ఉంది. కంపెనీ తాజాగా మిలియన్ల డాలర్ల విలువ చేసే ఐదు డీల్స్‌ను గెలుచుకుంది. ఆర్‌అండ్‌డీ వ్యయాలు పెంచుకోవడం ద్వారా నూతన ఆవిష్కరణలపై శ్రద్ధ వహిస్తోంది. ప్రస్తుతం 29 పీఈ వద్ద ట్రేడవుతోంది. గతేడాది 800 శాతం డివిడెండ్‌ ఇచ్చింది.
3. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌: తొలి త్రైమాసికంలో ఎన్‌ఐఐ 48 శాతం దూసుకుపోయింది. నికర లాభంలో 71 శాతం పెరుగుదల కనిపించింది. లోన్‌ బుక్‌ 24 శాతం పెరిగి 86571 కోట్ల రూపాయలకు చేరింది. అన్ని రకాల ఫైనాన్సింగ్‌ వ్యాపారాల్లో మంచి వృద్ధి నమోదయింది. ఎంఎఫ్‌ వ్యాపార ఏయూఎం 60 శాతం పెరిగి 71118 కోట్ల రూపాయలకు చేరింది. ప్రస్తుతం 15.4 పీఈ వద్ద ట్రేడవుతోంది. గత క్యూఐపీ ధర కన్నా చాలా తక్కువకు ట్రేడవుతూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 



You may be interested

సెన్సెక్స్‌ 250 పాయింట్లు క్రాష్‌

Monday 1st October 2018

36,000 దిగువకు సెన్సెక్స్‌ 11,821ను తాకిని నిఫ్టీ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సోమవారం కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌ ఉదయం 12 గంటల సమయానికి నష్టాల్లో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా పడిపోయింది. ఉదయం 11:58 సమయంలో సెన్సెక్స్‌ 215 పాయింట్ల నష్టంతో 36,011 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 10,833 వద్ద ట్రేడవుతోంది.  సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 36,291 పాయింట్ల గరిష్ట

ఫండ్లా... లేక షేర్లా?

Monday 1st October 2018

(సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను పొందుదామనే అభిలాష నేటి తరం వారిలో ఎక్కువగానే కనిపిస్తోంది. స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్లపై వీరిలో అవగాహన కూడా నానాటికీ పెరుగుతోంది. అయితే, ఎక్కువ మందికి ఈ విషయంలో ఎదురయ్యే సాధారణ ప్రశ్న ఏమిటంటే... నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలా లేక మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలా?.  ఈ ప్రశ్నకు సమాధానం ఎలా ఉన్నా... చాలా మంది

Most from this category