News


ఎఫ్‌డీఏ నిర్ణయంతో ఈ ఫార్మా కంపెనీలకు ప్లస్‌

Wednesday 28th November 2018
Markets_main1543344717.png-22421

అమెరికాలోని మోర్గాన్‌టౌన్‌లోని మైలాన్‌ ప్లాంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖ జారీ చేయడం మూడు భారత ఫార్మా కంపెనీలకు కలిసొస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. మైలాన్‌ కేంద్రంలో ఉత్పత్తి తగ్గడం వల్ల సన్‌ఫార్మా, అరబిందో ఫార్మా, క్యాడిలా హెల్త్‌కేర్‌ కంపెనీలు లాభపడతాయని విశ్లేషించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఇక్కడ ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించి, ఫామ్‌ 483 జారీ చేసింది. ఇందులో 13 అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వీటిపట్ల కంపెనీ స్పందన సరిగా లేకపోవడంతో హెచ్చరిక లేఖ జారీ చేసింది. సరైన దిద్దుబాటు, నిరోధక చర్యలు కంపెనీ నుంచి లోపించాయని కూడా పేర్కొంది. ఉత్తమ నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించినట్టు ఈ లేఖ సారాంశం. ఈ ప్లాంట్‌లో మైలాన్‌ 300 వరకు ఓరల్‌ సాలిడ్స్‌ డోసేజ్‌లను తయారు చేస్తోందని, మైలాన్‌కు ఇది అతిపెద్ద ఓరల్‌ సాలిడ్స్‌ కేంద్రమని మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. 

 

‘‘ఫామ్‌ 483, హెచ్చరిక లేఖలు జారీ చేయడం అంటే మైలాన్‌ తయారీ కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేయడం అని కాదు. అయినప్పటికీ, ఈ అంశం తీవ్రత దృష్ట్యా... అతిపెద్ద తయారీ కేంద్రంలో ఎఫ్‌డీఏ అభ్యంతరాల మేరకు నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉండడంతో ఉత్పత్తి తగ్గుతుంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ తన నివేదికలో పేర్కొంది. మోర్గాన్‌టౌన్‌ కేంద్రంలో ఉత్పత్తి తగ్గడం అన్నది పోటీ కంపెనీలకు కలిసొచ్చే పరిణామంగా అభిప్రాయపడింది. మైలాన్‌ 300 ఉత్పత్తులకు ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకుని చూస్తే... సన్‌ఫార్మాకు 79 మిలియన్‌ డాలర్ల మేర, అరబిందో ఫార్మాకు 40 మిలియన్‌ డాలర్ల మేర, క్యాడిలా హెల్త్‌కేర్‌కు 35 మిలియన్‌ డాలర్ల మేర ప్రయోజనం కలుగుతుందని అంచనా వేసింది. మైలాన్‌ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రం ప్రణాళిక గురించి పేర్కొనకపోవడం వల్ల భారత ఫార్మా కంపెనీలకు ఊహించని ఆకస్మిక అవకాశాలు వచ్చినట్టు పేర్కొంది. You may be interested

మీ పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన ‘బీమా’లు

Wednesday 28th November 2018

సౌకర్యవంతంగా జీవించేందుకు కావాల్సిన సంపద కోసం చాలా మంది ఎంతో కష్టించి పనిచేస్తుంటారు. కానీ, జీవితంలో అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు. ఆర్థికం భారం పడొచ్చు. తెలియకుండా వచ్చి పడే ఉపద్రవాల నుంచి కుటుంబానికి, సంపద రక్షణ కోసం బీమాను ప్రతి ఒక్కరూ పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ వ్యక్తి తన జీవితంలో చేర్చుకోవాల్సిన బీమా ఉత్పత్తుల వివరాలు ఇవి.   జీవిత బీమా ఓ వ్యక్తి కేవలం తన భద్రత,

75% వరకు రాబడికి 7 సిఫార్సులు

Tuesday 27th November 2018

వచ్చే 6-18 నెలల కాలంలో మంచి రాబడిని ఇవ్వగలిగిన 7 షేర్లను పలు ప్రముఖ బ్రోకింగ్‌ కంపెనీలు సిఫార్సుచేస్తున్నాయి. దీర్ఘకాల పెట్టుబడి లక్ష్యంతో ఈ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా 75 శాతం వరకు రాబడిని పొందవచ్చని సూచిస్తున్నాయి.  ఆర్తి డ్రగ్స్ | బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠీ | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.745 | రాబడి అంచనా: 36 శాతం కంపెనీ సామర్ధ్య పెంపు, నూతన ఉత్పత్తుల

Most from this category