STOCKS

News


చాలా తక్కువలో ట్రేడవుతున్న హోల్డింగ్‌ కంపెనీలు

Tuesday 19th March 2019
Markets_main1552934752.png-24675

మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా దిగ్గజ కంపెనీల వ్యాల్యూషన్లు పడిపోయిన విషయాన్ని ఇన్వెస్టర్లు కళ్లారా చూశారు. స్టాండలోన్‌ కంపెనీలను విశ్లేషించడం సులువే. కానీ, ఎన్నో కంపెనీలకు పేరెంట్‌ కంపెనీగా ఉన్న స్టాక్‌ను విశ్లేషించడం అంత సులువేమీ కాదన్నది విశ్లేషకుల మాట. ఇక హోల్డింగ్‌ కంపెనీ షేరును కొన్నారంటే.. అందులో ఉన్న వ్యాపారాలన్నింటిపై ఇన్వెస్ట్‌ చేసినట్టే అవుతుంది. వీటిల్లో వ్యాపారాలన్నీ ఇన్వెస్టర్లను ఆకర్షించేవి కాకపోవచ్చు. నిజానికి హోల్డింగ్‌ కంపెనీల షేర్ల ధరలు తక్కువ వ్యాల్యూషన్‌కు కోట్‌ అవడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇక చాలా వరకు హోల్డింగ్‌ కంపెనీలు అనేవి ప్రమోటర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలుగానే ఉంటున్నాయి. కనుక ఇవి ప్రమోటర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తాయని, మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలను పట్టించుకోవన్నది అభిప్రాయం. అయితే, లిస్టెడ్‌ హోల్డింగ్‌ కంపెనీల్లో కొన్ని ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. 30-40 శాతం డిస్కౌంట్‌ ఉండడం సాధారణమేనని, మరింత తక్కువకు ట్రేడ్‌ అవుతుంటే వీటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఫండ్‌ మేనేజర్‌ ఎస్‌.కోహ్లి సూచించారు. 

 

బజాజ్‌ హోల్డింగ్స్‌
హోల్డింగ్స్‌ కంపెనీల్లో వాటాల విలువ (డిసెంబర్‌ నాటికి) రూ.68,215 కోట్లు. బజాజ్‌ హోల్డింగ్స్‌ మార్కెట్‌ వాటా మాత్రం ఇందులో సగమే ఉంది. మంచి వృద్ధికి అవకాశాలున్న సబ్సిడరీలు ఈ కంపెనీ పరిధిలో ఉన్నాయి. బజాజ్‌ ఆటోలో నేరుగాను, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ద్వారా పెట్టుబడులు కలిగి ఉంది. ‘‘కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ ఫైనాన్స్‌ విస్తరణ కేవలం 20 శాతంగానే ఉంది. బజాజ్‌ ఫైనాన్స్‌ ఈ విభాగంలో 70 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రగామిగా ఉంది. 2018-19 నుంచి 2020-21 వరకు బజాజ్‌ ఫైనాన్స్‌ లోన్‌బుక్‌ ఏటా 32 శాతం మేర వృద్ధి చెందనుంది’’అని జెఫరీస్‌ ఇండియా తన నివేదికలో పేర్కొంది. బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌లు చక్కని పనితీరును ప్రదర్శిస్తున్నాయని, కనుక నికర విలువకు 48 శాతం తక్కువ ట్రేడ్‌ కావడం సహేతుకంగా లేదని జెఫరీస్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది.   

 

గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌
సబ్సిడరీ కంపెనీల్లో వాటాల విలువ (డిసెంబర్‌ నాటికి) రూ.30,644 కోట్లు కాగా, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ ఇందులో సగం మేరే ఉండడం గమనార్హం. దాదాపు 45 శాతం డిస్కౌంట్‌కు ట్రేడ్‌ అవుతోంది. గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ లిస్టింగ్‌ తర్వాత హోల్డింగ్‌ కంపెనీగా మారిపోయింది. లిస్టెడ్‌ సబ్సిడరీల్లో ఇది ఎక్కువ విలువ తెచ్చిపెట్టింది. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌కు కెమికల్స్‌ విభాగం స్టాండలోన్‌ వ్యాపారంగా ఉంది. కనుక మార్కెట్‌ వర్గాలకు ఇదేమంత ఆకర్షణీయం కాదు. ఇక మరింత ఆకర్షణీయమైన అంశం గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌కు 100 శాతం హోల్డింగ్స్‌ ఉన్న అన్‌లిస్టెడ్‌ సబ్సిడరీలు కూడా ఉన్నాయి. కనుక వాస్తవ డిస్కౌంట్‌ ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నది అంచనా.

 

గ్రాసిమ్‌ హోల్డింగ్స్‌
హోల్డింగ్స్‌ విలువ  (డిసెంబర్‌ నాటికి) రూ.85,000 కోట్లు. గ్రాసిమ్‌ మార్కెట్‌ క్యాప్‌ 55,000 కోట్లు. వీఎస్‌ఎఫ్‌ (బయోడీగ్రేడబుల్‌ ఫైబర్‌)కు డిమాండ్‌ బలంగానే ఉంది. గ్రాసిమ్‌కు ఇది స్టాండలోన్‌ వ్యాపారం. వేగంగా వృద్ధి చెందుతున్న ఈ వ్యాపారం విలువే రూ.14,000 కోట్లు చేస్తుంది. చాలా వరకు సబ్సిడరీ కంపెనీలు కూడా మంచి పనితీరు చూపుతున్నాయి. నష్టాలతో కూడిన ఐడియా ఒక్కటే తలనొప్పిగా మారింది. అయితే, ఐడియాలో గ్రాసిమ్‌ వాటా 11.55 శాతానికి దిగొచ్చింది.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు అప్‌

Tuesday 19th March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్పనష్టాలతో ట్రేడవుతున్నప్పటికీ,  వరుసగా ఆరురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు మంగళవారం సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40 గంటలకు 11,524 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,494  పాయింట్ల వద్ద

మార్కెట్లలో అనిశ్చితే ఒక అవకాశం: యూనియన్‌ ఏఎంసీ

Tuesday 19th March 2019

స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని స్నేహితునిగా మలుచుకోవాలని, దీర్ఘకాలం దృష్టితో ముందడుగు వేయాలని యూనియన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వినయ్‌ పహారియా సూచించారు. పెట్టుబడుల కేటాయింపులను గుర్తించి అందుకు కట్టబడి ఉండాలని చెప్పారు. వినియోగదారుల విచక్షణారహిత వినియోగంపై ఆధారపడిన కంపెనీలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో కన్జ్యూమర్‌ స్టాపుల్‌ అంత ఆకర్షణీయంగా లేదన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన

Most from this category