STOCKS

News


మధ్య కాలానికి మూడు జెమ్స్‌

Sunday 27th January 2019
Markets_main1548611649.png-23828

గడిచిన రెండు వారాల్లో ఓ శ్రేణి పరిధిలో చలించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఫిబ్రవరి 1 బడ్జెట్‌ తర్వాత ఈ శ్రేణిని బ్రేక్ చేస్తుందని ఈక్విటీ99 వ్యవస్థాపకులు సుమీత్‌ బిల్‌గయాన్‌ అంచనా వ్యక్తం చేశారు. గడచిన 10-15 రోజుల్లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్కువగా అమ్మకాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. కొన్ని రంగాల పనితీరు క్యూ3లో బాగుండగా, ఆటో, సిమెంట్‌ రంగాల కంపెనీల పనితీరు అంచనాల కంటే తక్కువగా ఉన్నట్టు తెలిపారు. గత వారం మారుతి బలహీన ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వారం చివర్లో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ సమర్పించనున్నందున మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. స్టాప్‌లాస్‌ లేకుండా ట్రేడ్‌ చేయడం మంచిది కాదని సూచించారు. నిఫ్టీకి 10,800, 10,740 బలమైన మద్దతు స్థాయిలుగా, 10,940-11,035 కీలకమైన నిరోధాలుగా పనిచేస్తాయన్నారు. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి మంచి రాబడులను ఇచ్చే మూడు స్టాక్స్‌ను ఆయన సిఫారసు చేశారు.

 

రాడికో ఖైతాన్‌
ఇండియన్‌ స్పిరిట్స్‌ మార్కెట్లో దేశీయంగా ఒకానొక అతిపెద్ద సంస్థ. 8పీఎం విస్కీ, మ్యాజిక్‌ మూమెంట్స్‌ వోడ్కా వంటి బ్రాండ్లు ఉన్నాయి. మూడు డిస్టిలరీలు, ఒక జాయింట్‌ వెంచర్‌ రూపంలో మొత్తం 157 మిలియన్‌ లీటర్ల తయారీ సామర్థ్యం, 33 బాట్లింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ప్రీమియం వోడ్కా మార్కెట్లో మ్యాజిక్‌ మూమెంట్స్‌తో లీడర్‌గా ఉంది. మూడో త్రైమాసికానికి మంచి ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలానికి అమ్మకాలు 32 శాతం పెరిగి రూ.6,079 కోట్లుగాను, లాభం 67 శాతం వృద్ధితో రూ.149 కోట్లుగాను ఉన్నాయి. ప్రస్తుతం 31పీఈతో ట్రేడ్‌ అవుతోంది. ప్రీమియం ఉత్పత్తులతో వృద్ధిని పెంచుకోవడం కంపెనీ వ్యూహం. మధ్య కాలం నుంచి దీర్ఘకాలం కోసం క్రమంగా కొనుగోలు చేసుకోవాలని మా సూచన.

 

పీఎఫ్‌సీ
విద్యుత్‌ రంగానికి ఫైనాన్స్‌ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విద్యుత్‌ ప్రాజెక్టుల అభివృద్ధికి, నిధుల పరంగా, ఇతరత్రా సాయం అందిస్తుంటుంది. ప్రధానంగా థర్మల్‌, జల విద్యుత్‌ ప్రాజెక్టులకు రుణాలను ఇస్తుంటుంది. ప్రాజెక్టుల పునర్నిర్మాణం, ఆధునికీకరణకు కూడా రుణాలు మంజూరు చేస్తోంది. బయో, పవన విద్యుత్‌ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులకూ రుణాల విభాగంలోకి తన కార్యకలాపాలను విస్తరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. ఈ కంపెనీ రుణ పుస్తకం రూ.2,96,648 కోట్లుగా ఉంది. ఇందులో 90 శాతం రుణాలకు చెల్లింపులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఎటువంటి రుణ ఒత్తిళ్లు లేవు. ఈ స్టాక్‌ 5.5 పీఈతో ట్రేడవుతోంది. డివిడెండ్‌ పంపిణీ 7 శాతంగా ఉంది. క్రమం తప్పకుండా మధ్య నుంచి దీర్ఘకాలం కోసం కొనుగోలు చేసుకోవచ్చు.

 

కావేరి సీడ్‌ కంపెనీ
విత్తనాల మార్కెట్లో వేగంగా వృద్ధి సాధిస్తున్న కంపెనీ. దేశవ్యాప్తంగా 15,000 మంది పంపిణీదారులు, డీలర్లను కలిగి ఉంది. క్రాప్‌ జెమ్‌ప్లాస్మ్‌లో అతిపెద్ద కంపెనీ. పత్తి, మొక్కజొన్న, రైస్‌, జొన్నలు, సజ్జలు, టమాటా, బెండ, బీరకాయ తదితర విత్తనాలతో కంపెనీ పోర్ట్‌ఫోలియో బలంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు అమ్మకాలు రూ.657 కోట్లుగా ఉంటే, లాభం రూ.222 కోట్లుగా ఉంది. ఈపీఎస్‌ రూ.34.51. 12.63 కోట్ల ఈక్విటీపై రూ.1,021 కోట్ల రిజర్వ్‌లు ఉన్నాయి. ఈ స్టాక్‌ కేవలం 17.8 పీఈ వద్ద ట్రేడవుతోంది. రూ.427 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా మధ్యకాలం నుంచి దీర్ఘకాలం కోసం క్రమంగా కొనుగోలు చేసుకోవచ్చు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 28 పాయింట్లు అప్‌

Monday 28th January 2019

ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 28 పాయింట్లు పెరిగింది. భారత్‌లోని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ట్రేడయ్యే ఈ సూచి సోమవారం ఉదయం 8.50 గంటలకు 28 పాయింట్ల పెరుగుదలతో 10,812 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10786 పాయింట్ల వద్ద ముగిసింది గత శుక్రవారం అమెరికా సూచీలు లాభాలతో ముగియగా,   తాజాగా ఆసియాలో జపాన్‌ మినహా ప్రధాన సూచీలన్నీ స్వల్పలాభాలతో

2018-19లో రూ.1,600 కోట్ల లాభం: నాల్కో 

Sunday 27th January 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.1,2000 కోట్ల ఆదాయంపై రూ.1,600 కోట్ల లాభాన్ని నమోదు చేయగలని నాల్కో పేర్కొంది. ‘‘‘‘మా టర్నోవర్‌ను ప్రస్తుతమున్న రూ.10,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచుకోవాలనే విషయమై కార్పొరేట్‌ ప్రణాళికతో ఉన్నాం. ఈ ఏడాదికి (ఆర్థిక సంవత్సరానికి) రూ.12,000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయగలం’’ అని నాల్కో సీఎండీ తపన్‌కుమార్‌ చంద్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.1,600 కోట్ల లాభాన్ని నమోదు

Most from this category