STOCKS

News


ర్యాలీకి రెడీగా ఉన్న 277 షేర్లు

Tuesday 16th October 2018
Markets_main1539672876.png-21200

దేశీయ సూచీలు పుల్‌బ్యాక్‌ ర్యాలీ మూడ్‌లో ఉన్నాయి. దీంతో పలు షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. సోమవారం ముగింపు ప్రకారం 277 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారినకంపెనీల్లో ఆర్‌కామ్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, వొడాఫోన్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, టాటాపవర్‌, ట్రైడెంట్‌, పీఎఫ్‌సీ, ఎన్‌సీసీ, మదర్‌సన్‌సుమి, హెచ్‌డీఎఫ్‌సీ, జస్ట్‌డయిల్‌, ఎక్సైడ్‌, ఎడెల్‌వీజ్‌, డిష్‌టీవీ, ఆర్‌సీఎఫ్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. You may be interested

హానర్‌ 8ఎక్స్‌.. ప్రత్యేకతలివే..

Tuesday 16th October 2018

 చైనా టెలికం దిగ్గజం హువావే సబ్‌ బ్రాండ్‌ హానర్‌ తాజాగా 8ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులోని ప్రత్యేకతలు ఏంటివో ఒకసారి చూద్దాం..  ► 6.5 అంగుళాల స్క్రీన్‌ ► ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే (91 శాతం స్క్రీన్‌-టు-బాడీ రేషియో) ► ఫోన్‌ వెనుక భాగంలో 2.5 డీ గ్లాస్‌ బాడీ ► హిసిలికాన్‌ కిరిన్‌ 710 ప్రాసెసర్‌ ► జీపీయూ టర్బో ఫీచర్‌ ► బ్లాక్‌, బ్లూ, రెడ్‌ రంగుల్లో లభ్యం ► 24 నుంచి అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు ► ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1 ఓఎస్‌ ► 20 ఎంపీ+

ఈ మూడు రంగాల స్టాక్స్‌తో జాగ్రత్త!

Tuesday 16th October 2018

దేశీ వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించిన కంపెనీల స్టాక్స్‌, వినియోగ ఆధారిత స్టాక్స్‌, రిటైల్‌ లెండింగ్‌కు ప్రాధాన్యమిస్తున్న ఫైనాన్షియల్‌ సంస్థల స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు నిర్మల్‌ బ్యాంగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ గిరీశ్‌ పాయ్‌. వీటిల్లో వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో వీటిపై ఒత్తిడి పెరగొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత మార్కెట్‌ కరెక‌్షన్‌లో ఆటో స్టాక్స్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మారుతీ సుజుకీ ఎర్నింగ్స్‌ వృద్ధి

Most from this category