STOCKS

News


‍నిఫ్టీ ప్యాక్‌లో ఇవి చౌకగా..!

Friday 10th May 2019
Markets_main1557511637.png-25669

నిఫ్టీ-50 ఇటీవల రికార్డు గరిష్ట స్థాయి 11,856 వరకు వెళ్లింది. అప్పటి నుంచి దిద్దుబాటులోకి వెళ్లింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేస్తుండడంతో సూచీల ర్యాలీ రివర్స్‌ అయింది. గరిష్ట స్థాయిల నుంచి ఇండెక్స్‌ ఇప్పటికే 5 శాతం దిద్దుబాటుకు గరైంది. ఐదు రోజులు, 50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ను కూడా ఇండెక్స్‌ బ్రేక్‌ చేఇంది. అమ్మకాలు ఎక్కువగా లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే, ఇప్పటికీ నిఫ్టీ-50లో సగం మేర 25 కంపెనీలు చౌకగా మారిపోయాయి!. అంటే వాటి పదేళ్ల సగటు పీఈ కంటే తక్కువలో ట్రేడ్‌ అవుతున్నాయి.  

 

ఐచర్‌ మోటార్స్‌ పదేళ్ల సగటు పీఈ 23 దగ్గరే ఉంది. హీరో మోటోకార్ప్‌ 19 శాతం తక్కువలో ట్రేడ్‌ అవుతోంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, యస్‌ బ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఎల్‌అండ్‌టీ, గ్రాసిమ్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, వేదాంత, బీపీసీఎల్‌, గెయిల్‌, ఐవోసీ, ఓఎన్‌జీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ ఉన్నాయి. వీటిల్లో పదేళ్ల సగటు పీఈతో చాలా తక్కువ వ్యాల్యూషన్‌లో ఓఎన్‌జీసీ (42 శాతం), కోల్‌ ఇండియా (38 శాతం), ఎన్‌టీపీసీ (30 శాతం), పవర్‌ గ్రిడ్‌(31 శాతం), టాటా స్టీల్‌ (49 శాతం), భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ (19 శాతం), బీపీసీఎల్‌ (20 శాతం), యాక్సిస్‌ బ్యాంకు (36 శౠతం), ఎస్‌బీఐ (28 శాతం), ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ (29 శాతం) ఉన్నట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. 

 

సైక్లికల్‌ కంపెనీలపై దృష్టి సారించొచ్చని, మెటల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌కు దూరంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ‘‘ఇక్కడ పేర్కొన్నవన్నీ కూడా బ్లూచిప్‌ కంపెనీలే. బలమైన ఫండమెంటల్స్‌, డివిడెండ్‌ చరిత్ర ఉన్నవి కూడా. దీర్ఘకాల కోణంలో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు’’ అని చాయిస్‌ బ్రోకింగ్‌ ఈడీ సుమీత్‌ బగాడియా తెలిపారు. సాధారణంగా తక్కువ వ్యాల్యూషన్లకు చేరిన కంపెనీల షేర్లు పెరిగేందుకు అవకాశం ఉందని భావిస్తుంటారు. చారిత్రక సగటు వ్యాల్యూషన్ల కంటే తక్కువకు చేరిన వాటిని మంచి పెట్టుబడి అవకాశాలుగానే చూస్తుంటారు. అయితే, ఇతర అంశాలను కూడా బేరీజు వేసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘ప్రతీ కంపెనీకి సంబంధించి విడిగా భిన్నమైన పెట్టుబడి విధానం ఉంటుంది. అయితే, వ్యాల్యూషన్‌ అన్నది కేవలం ఒక్క అంశమే. వీటిల్లో కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌లో పెట్టుబడిని మేం ఇష్టపడతాం’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇనిస్టిట్యూషనల్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌతం దుగ్గద్‌ పేర్కొన్నారు. 

 

‘‘టాటా స్టీల్‌ కంపెనీ ప్రపంచ వృద్ధి కారణంగా సమస్యలను ఎదుర్కొంటోంది. బ్యాలన్స్‌ షీటును రుణ రహితంగా మార్చుకునే ప్రయత్నాల వల్ల ఈ స్టాక్‌ను ప్రస్తుత ధరల్లో కొనుగోలు చేయడానికి ఇష్టపడతా. కోల్‌ ఇండియా మంచి డివిడెండ్‌ ప్లే అవుతుంది. సన్‌ఫార్మాను ఇంకొంచెంత తక్కువ స్థాయిల్లో కొనుగోలుకు పరిశీలించొచ్చు’’ అని ఐడీబీఐ క్యాపిటల్‌కు చెందిన ఏకే ప్రభాకర్‌ పేర్కొన్నారు. అంతర్గత అంశాల వల్ల కాకుండా, వెలుపలి అంశాలతో తగ్గిన స్టాక్స్‌ పట్ల దృష్టా సారించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.You may be interested

ఎస్‌బీఐ లాభం రూ.838 కోట్లు

Saturday 11th May 2019

తగ్గిన మొండి భారం  మెరుగైన రుణ నాణ్యత  రానున్నవి మంచి రోజులే ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌  న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.838 కోట్ల నికర లాభం(స్డాండ్‌అలోన్‌) సాధించింది. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ వ్యయాలు కూడా ఒక శాతం తగ్గడంతో ఈ స్థాయిలో నికర లాభం వచ్చిందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక

ఈ కంపెనీల్లో పెరిగిన ప్రమోటర్ల తనఖా

Friday 10th May 2019

బీఎస్‌ఈ-500 కంపెనీల ప్రమోటర్ల తనఖా వాటాలు డిసెంబర్‌ నాటితో పోలిస్తే మార్చి త్రైమాసికంలో కొంత తగ్గాయి. బీఎస్‌ఈ 500 కంపెనీలకు సంబంధించి ప్రమోటర్ల వాటాల తనఖా డిసెంబర్‌ నాటికి 2.98 శాతంగా ఉండగా, మార్చి క్వార్టర్‌లో 2.83 శాతానికి తగ్గింది. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ నివేదిక ప్రకారం ప్రమోటర్లు తనఖాలో ఉంచిన వాటాల విలువ రూ.1.95 లక్షల కోట్లు. అయితే, వీటిల్లో ఓ 30 కంపెనీలకు సంబంధించి మాత్రం పరిస్థితి

Most from this category