STOCKS

News


ఇవన్నీ వాల్యూస్టాకులేనా?!

Saturday 11th May 2019
Markets_main1557568658.png-25685

గత నెల గరిష్ఠాల నుంచి ప్రధాన సూచీలు దాదాపు 3 శాత పతనమయ్యాయి. నిఫ్టీ కీలక డీఎంఏలకు దిగువన ట్రేడవుతోంది. తాజా పతనానికి లార్జ్‌క్యాప్స్‌లో వచ్చిన అమ్మకాల ఒత్తిడే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పతనంతో నిఫ్టీ 50లో దాదాపు సగం కంపెనీలు తమతమ పదేళ్ల సరాసరి పీఈ కన్నా దిగువన ట్రేడవుతున్నాయి. కంపెనీ ఎర్నింగ్స్‌కు, స్టాకు ధరకు మధ్య సంబంధాన్ని పీఈ తెలుపుతుంది. పీఈ తక్కువున్న స్టాకులపై టెక్‌ నిపుణులు ఎక్కువ మక్కువ చూపుతారు. ప్రస్తుతం ఈ విధంగా అల్పపీఈల వద్ద ట్రేడవుతున్న స్టాకుల్లో ఐషర్‌ మోటర్స్‌, హీరోమోటోకార్‌‍్ప, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, కోల్‌ఇండియా, ఓఎన్‌జీసీ తదితరాలున్నాయని మోతీలాల్‌ఓస్వాల్‌ తెలిపింది. ఈ స్టాకులన్నీ మంచివేనని, బలమైన మూలాలున్న కంపెనీలవని ఛాయిస్‌ బ్రోకింగ్‌ ప్రతినిధి సుమిత్‌ బగాడియా చెప్పారు. దీర్ఘకాల ధృక్పథంతో వీటిని కొనుగోలు చేయవచ్చన్నారు. వీటిలో కొనుగోళ్లు చేయడానికి పిరమిడ్‌ వ్యూహం అవలంబించాలని సూచించారు. రంగాలవారీగా రికవరీ వస్తోందని, తదనుగుణంగా నాణ్యమైన స్టాకులను ఎంచుకోవాలని మోతీలాల్‌ఓస్వాల్‌ ప్రతినిధి గౌతమ్‌ తెలిపారు. పీఈ డిస్కౌంట్‌లో ఉందంటే అప్‌సైడ్‌కు అవకాశాలు ఎక్కువన్నారు. అయితే కేవలం పీఈ తక్కువగా ఉండడాన్ని మాత్రమే చూడకుండా ఇతర పారామీటర్లను కూడా పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని సలహా ఇచ్చారు. 
పీఈ డిస్కౌంట్‌లో ఉన్న స్టాకుల వివరాలు...



You may be interested

ఎలక‌్షన్‌ ఫలితాలపై మార్కెట్‌ మనసు మారిందా?

Saturday 11th May 2019

నెలారంభం వరకు ఎన్‌డీఏ మరలా గెలుస్తుందన్న అంచనాలతో పరుగులు తీసిన సూచీలు క్రమంగా పతనాభిముఖంగా పయనం ఆరంభించాయి. యూఎస్‌, చైనా వాణిజ్య ప్రతిష్టంభన బూచిగా చూపి సూచీలు దాదాపు 4 శాతం పతనమయ్యాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు చరమాంకానికి చేరాయి. దీంతో మదుపరులంతా మరింత అప్రమత్తమయ్యారు. మార్కెట్లో వచ్చిన ఈ మార్పు ఎన్నికల ఫలితాలపై మార్కెట్‌ మనసు మారిందనేందుకు సంకేతంగా పోల్‌పండితులు భావిస్తున్నారు. ఎన్‌డీఏకు సరిపడా మెజార్టీ రాదన్న భావనతోనే

11300పైన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 11th May 2019

విదేశీ మార్కెట్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచి శుక్రవారం రాత్రి 17.50 పాయింట్లు లాభపడి 11,301.00 పాయింట్ల  వద్ద ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు  శుక్రవారం ముగింపు 11307.20 తో పోలిస్తే 6 పాయింట్ల నష్టంతో ఉంది. ఇక శుక్రవారం సెన్సెక్స్‌ 96 పాయింట్లు నష్టపోయి 37,463 వద్ద నిఫ్టీ 23 పాయింట్లు తగ్గి 11,279 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా అమెరికా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం,

Most from this category