STOCKS

News


ఈ కౌంటర్లలో నెగిటివ్‌ సంకేతాలు

Tuesday 26th March 2019
Markets_main1553591056.png-24804

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు వాడే ఎంఏసీడీ ఇండికేటర్‌ ఆధారంగా షేరు కదలికలను పరిశీలిస్తుంటారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లు బేరిష్‌
సోమవారం ముగింపు ప్రకారం 226 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో యస్‌బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌, వొడాఫోన్‌ ఐడియా, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, టాటాగ్లోబల్‌ బెవరేజెస్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, ఐఎఫ్‌సీఐ, ఉజ్జీవన్‌ ఫైనన్షియల్‌, అశోక్‌లేలాండ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జీమీడియా, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, జైన్‌ ఇరిగేషన్‌, వోల్టాస్‌, హడ్కో, కోల్గోట్‌పామోలివ్‌, అవంతి ఫీడ్స్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 6 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో జెట్‌ ఎయిర్‌వేస్‌, పీఎఫ్‌సీ, కోరమాండల్‌, అపార్‌ ఇండస్ట్రీస్‌, సైబర్‌ మీడియా, ఇండోథాయ్‌ సెక్యూరిటీస్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  
మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  
 



You may be interested

మిడ్‌క్యాప్స్‌పై ఫోకస్‌ పెంచండి

Tuesday 26th March 2019

మాక్కై‍్వరీ సలహా ఈ ఏడాది ఆరంభం నుంచి లార్జ్‌క్యాప్స్‌లో అప్‌మూవ్‌ కొనసాగుతూ వస్తోంది. తాజా ర్యాలీలో సైతం పెద్ద స్టాకులే ఎక్కువ సందడి చేశాయి. అయితే ఇకపై మిడ్‌క్యాప్స్‌ హవా ఆరంభం కానుందని, అందువల్ల ఇన్వెస్టర్లు తమ దృష్టిని చిన్న, మధ్యతరహా స్టాకులవైపు మరలించాలని సలహా ఇస్తోంది. ఎకనమిక్‌ గ్రోత్‌లో రికవరీ, సాధారణ ఎన్నికలపై ఆశలతో దేశీయ మార్కెట్లో నిధుల ప్రవాహం కొనసాగుతుందని అభిప్రాయపడింది. ఈ ఏడాది ఇండియా ఈక్విటీ మార్కెట్లో

రాణిస్తున్న రియల్టీ షేర్లు

Tuesday 26th March 2019

లాభాల మార్కెట్‌లో రియల్టీ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ నేడు ట్రేడింగ్‌లో 1.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లోని మొత్తం 10 షేర్లకు గానూ 6 షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, 4షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ షేరు 8.50శాతం పెరిగింది.  రూ.3,000 కోట్ల రుణభారం తగ్గించుకునేందుకు సోమవారం క్యూఐపీ(క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌)ను ఆరంభించిన సంగతి తెలిసిందే. అలాగే

Most from this category