STOCKS

News


2019లో ఎన్నో అవకాశాలు

Wednesday 2nd January 2019
Markets_main1546367456.png-23351

కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం... ఈ ఏడాది అయినా లాభాలు తీసుకోకపోతామా...? అనే ఆశ ఇన్వెస్టర్లలో సహజంగానే ఉంటుంది. అయితే, ఎక్కువ మంది అనలిస్టులు ఈ ఏడాది లాభాలకే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ధరలు భారీగా తగ్గడంతో ఆకర్షణీయంగా ఉన్నందున కొనుగోలుకు అవకాశంగానూ భావిస్తున్నారు. ప్రముఖ ఇన్వెస్టర్‌, సంవితి క్యాపిటల్‌ సహ వ్యవస్థాపకుడు ప్రభాకర్‌ కుద్వా మాట్లాడుతూ... ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు ఈ దశలో రిస్క్‌ తీసుకునే వారికి మంచి రాబడులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. 

 

‘‘ఆస్తుల నాణ్యత సమస్య, వడ్డీ రేట్లు కఠినంగా మారడం వంటి సవాళ్లతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఫలితాలపై ఒత్తిడి ఉంది. అయితే, ఎక్కువ భాగం మొం‍డి బకాయిలను ఇప్పటికే అవి గుర్తించేసినందున వీటికి సంబంధించిన పరిశీలన జాబితా తగ్గిపోనుంది. దీంతో వాటి లాభాల్లో వేగవంతమైన పెరుగుదలకు అవకాశం ఉంది. ఎన్‌సీఎల్‌టీ పరిష్కారాలతో రద్దు చేసిన రుణాలకు సంబంధించి తిరిగి వసూలయ్యే వాటిని... ఇకపై ప్రొవిజన్ల అవసరాలకు వినియోగించనున్నాయి. కనుక పెద్ద కార్పొరేట్‌, పీఎస్‌యూ బ్యాంకులను ఎంచుకోవచ్చు. అయితే, దీర్ఘకాలం కోసం పోర్ట్‌ఫోలియోలోకి వీటిని పరిశీలించరాదు. నిర్మాణాత్మకంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల ఫండమెంటల్స్‌ ఎప్పుడూ సమస్యల్లోనే ఉంటాయి. రాజకీయ అవసరాల కోసం వాటిని ఎప్పటికప్పుడు వినియోగించుకుంటుంటారు’’ అని ప్రభాకర్‌ తెలిపారు. అయితే, సాధారణ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతుల రుణాల మాఫీ వీటికి ప్రతికూలం అవుతుందని, పెట్టుబడి పెట్టే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన రిస్క్‌గా దీన్ని పేర్కొన్నారు. 

 

పెట్టుబడుల కేటాయింపు...
ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీ నెక్ట్స్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌కు పెట్టుబడుల కేటాయింపులను పెంచుకోవచ్చని ప్రభాకర్‌ సూచించారు. ఎన్నికల సంవత్సరం కావడంతో కొంత నగదును అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికలు దగ్గరపడే సమయంలో, ఎన్నికల తర్వాత ఫలితాలకు అనుగుణంగా మార్కెట్‌ అవకాశాలను బట్టి ఈ నగదును పెట్టుబడిగా వినియోగించుకోవాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లను కూడా పరిశీలించాలని సూచించారు. ఏదైనా కరెక్షన్‌ చోటు చేసుకుంటే చేతిలో ఉన్న నగదు ఉపయోగపడుతుందన్నారు. నిఫ్టీ50కి వెలుపల వృద్ధికి అవకాశం ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం, కొంత నగదును కలిగి ఉండడం వంటివి కొత్త సంవత్సరంలో అనుసరించాల్సిన విధానంగా సూచించారు. You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 2nd January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఇవి ఆటోరంగ కంపెనీలు నిన్న డిసెంబ‌ర్ నెల‌కు సంబంధించిన వాహన విక్రయాల గ‌ణాంకాలు ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో నేడు ఆయా కంపెనీ షేర్ల ట్రేడింగ్‌పై గ‌ణాంకాలు ప్రభావాన్ని చూప‌వ‌చ్చు.   ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌:- కంపెనీ ఛైర్మన్‌గా వీకే శ‌ర్మ రాజీనామా చేశారు. గ్లెన్‌మార్క్ ఫార్మా:- తన యాక్టివ్ ఫార్మాస్యూటిక‌ల్ ఇంగ్రిడియెంట్(ఏపీఐ) వ్యాపారాన్ని అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్ సైన్సెస్ లిమిటెడ్‌కు విజ‌య‌వంతంగా మార్చింది. చంబ‌ల్ ఫెర్టిలైజ‌ర్స్

అధిక రాబడులను ఆఫర్‌ చేస్తున్న ఎన్‌సీడీలు

Tuesday 1st January 2019

ముడి చమురు ధరలు తిరిగి తక్కువ స్థాయిలకు చేరాయి. ద్రవ్యోల్బణం సౌకర్య స్థాయి 4 శాతం మార్క్‌నకు దిగువకు చేరింది. దీంతో రానున్న రోజుల్లో తక్కువ వడ్డీ రేట్లకు అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, అధిక వడ్డీ రేటు ఆశించే వారి ముందు రెండు నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ (ఎన్‌సీడీ) ఇష్యూలు ఉన్నాయి. అవి కూడా పేరున్న సంస్థలు మహీంద్రా

Most from this category