STOCKS

News


ఐటీకి ‘అప్‌గ్రేడ్‌’ అవ్వొచ్చా?

Tuesday 11th September 2018
Markets_main1536651230.png-20165

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఇతర రంగాలకన్నా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం ఉత్తమమైన పనితీరు కనబరుస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.67 రికార్డ్‌ స్థాయికి పతనం కావడం బాగా కలిసొచ్చింది. గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ మెక్వైరీ.. రూపాయి పతనం వల్ల ఐటీ వృద్ధి పుంజుకోవచ్చని అంచనా వేస్తోంది. పరిశ్రమలోని ట్రెండ్స్‌ కూడా వృద్ధి వేగాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మెక్వైరీ పలు కంపెనీల రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. విప్రో, హెక్జావేర్‌లకు ఔట్‌పర్ఫార్మ్‌ రేటింగ్‌ ఇచ్చింది. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ను.. లార్జ్‌క్యాప్‌ విభాగంలో హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. 
బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 40 శాతానికిపైగా ర్యాలీ చేసింది. మైండ్‌ట్రీ, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌ వరుసగా 90 శాతం, 84 శాతంమేర ఎగశాయి. జెన్‌సర్‌ టెక్నాలజీస్‌, ఎంఫసిస్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, మాస్టెక్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు 40-82 శాతం శ్రేణిలో పెరిగాయి. ఈ ఏడాది రూపాయి 12 శాతానికిపైగా పతనమైంది. 
2018లో బీఎస్‌ఈ టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌, బ్యాంక్‌ ఇండెక్స్‌లు 7-24 శాతంమేర పెరిగాయి. ఇక మిగతా ఇండెక్స్‌లు నష్టాల్లో ఉన్నాయి. 
రూపాయి పతనం వల్ల ఐటీ కంపెనీలు ప్రయోజనం పొందుతాయని, అయితే ఇది ఏ మేరకు ఉంటుందనే అంశం ఆయా కంపెనీల హెడ్జెస్‌పై ఆధారపడి ఉంటుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమలో సమీప కాలంలో కరెన్సీ ఆధారిత ఎర్నింగ్స్‌ అప్‌గ్రేడ్‌ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్థికవేత్తలు డాలర్‌/రూపాయి మారక విలువను 68.5-70 నుంచి 70-72కు సవరించిన నేపథ్యంలో కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఇప్పటికే 2019-21 ఆర్థిక సంవత్సరాల ఎర్నింగ్స్‌ ఈపీఎస్‌ను 0-7 శాతం అప్‌గ్రేడ్‌ చేసింది. ‘క్రాస్‌కరెన్సీ ఒడిదుడుకుల నేపథ్యంలో డాలర్‌ రెవెన్యూ వృద్ధి అంచనాలను తగ్గించాం. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, మైండ్‌ట్రీ సంస్థలు తగినంత క్యాష్‌ఫ్లో హెడ్జెస్‌ను కలిగి లేవు. అందువల్ల ఇవి రూపాయి పతనం వల్ల వెంటనే ఫలితం పొందుతాయి. ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, టెక్‌ మహీంద్రా, ఎంఫసిస్‌ కంపెనీలు ఎక్కువగా హెడ్జెస్‌ను కలిగి ఉన్నాయి. అందువల్ల సమీప కాలంలో వీటిల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉండకపోవచ్చు. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, మైండ్‌ట్రీ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు’ అని వివరించింది. 
రూపాయి పతనం వల్ల ఐటీ రంగ కంపెనీలకు లబ్ది కలుగుతుందని బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేర్కొంది. కరెన్సీ ఒడిదుడుకుల వల్ల ఏ కంపెనీ ఎర్నింగ్స్‌ ప్రభావితమౌతాయనే అంశం పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. రెవెన్యూలో డాలర్‌ సహా ఇతర కరెన్సీల వాటా ఎంతుంది, అలాగే ఆన్‌సైట్‌/ఆఫ్‌షోర్‌ వాటా ఎంత, హెడ్జెస్‌ ఎలా ఉన్నాయి వంటి వాటి వల్ల రెవెన్యూపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. వీటి ఆధారంగా చూస్తే టైర్‌-1 ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్‌ ఉత్తమ ఎంపిక అని, టెక్‌ మహీంద్రా చివరి ఎంపిక అని పేర్కొంది. టైర్‌-2 ఐటీ కంపెనీల్లో మైండ్‌ట్రీ ఎక్కువ లాభపడుతుందని, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ తక్కువ లబ్ది పొందుతుందని తెలిపింది.  



You may be interested

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ అప్‌

Tuesday 11th September 2018

ఎస్‌బీఐ 2.50శాతం ర్యాలీ  ముంబై:- ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలుస్తోంది. క్రితం ట్రేడింగ్‌లో భారీగా పతనమైన షేర్ల చౌక ధరలకు లభిస్తుండంతో ఈ రంగ షేర్లలో కొనుగోళ్లు జరుపుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగషేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 2శాతం‍ లాభపడింది. ఈ సూచీలోని మొత్తం 12 షేర్లకు గానూ 11 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా,

ర్యాలీలో వైదొలగండి..

Tuesday 11th September 2018

ఆరు వారాలుగా లాభాల్లో ముగుస్తూ వచ్చిన మార్కెట్‌ సోమవారం ఒక శాతంమేర పడిపోయింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేస్తున్నారు. దేశీ గణాంకాలు ప్రోత్సాహకరంగా లేకపోవడం, అంతర్జాతీయ పరిస్థితులు ఇందుకు కారణం. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనమౌతునే ఉండటం సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లతోపాటు సెక్టోరల్‌ ఇండెక్స్‌లు కూడా పడిపోతున్నాయి. మొత్తం మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. రెలిగేర్‌ సెక్యూరిటీస్‌ రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ ఒక ఆంగ్ల చానల్‌కు

Most from this category