STOCKS

News


పీఈ మల్టిపుల్‌ డీరేటింగ్‌ జరగొచ్చు..!

Friday 30th November 2018
Markets_main1543574519.png-22533

చైనా ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధించడంలో విఫలమైతే అభివృద్ధి చెందున్న దేశాల మార్కెట్లకు రిస్క్‌ తప్పదని ఎమర్జింగ్‌ ఈక్విటీ మార్కెట్‌ ఫండ్‌ ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ అడ్రియన్ మోవట్‌ వ్యాఖ్యానించారు. భారత మార్కెట్లలో ఫార్వార్డ్‌ మల్టీపుల్స్‌ ప్రస్తుతం అధికస్థాయిలో ఉన్నాయన్న ఆయన ప్రస్తుత ఏడాదిలో పీఈ మల్టిపుల్‌ డీరేటింగ్‌కు జరగవచ్చని అంచనావేశారు. ఎమర్జింగ్‌ మార్కెట్ల కరెన్సీల విలువలు రికవరీ బాట పడతాయని, వచ్చే ఏడాదిలో ఇది ప్రధాన అంశంగా ఉండనుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా స్టాక్‌ మార్కెట్‌.... యూరోపియన్‌, ఎమర్జింగ్‌ మార్కెట్లను అవుట్‌పెర్ఫార్మ్‌ చేస్తుండడం అతిపెద్ద సవాలుగా ఉందన్నారు. అమెరికా, యూరప్‌లలోని వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం డాలర్‌కు సానుకూలంగా ఉందని విశ్లేషించారు. తానైతే ఎమర్జింగ్‌ మార్కెట్ల కంటే అత్యంత ఎక్కువగా యూఎస్‌ మార్కెట్‌ పట్ల బుల్లిష్‌గా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు చైనా జీడీపీ 6 శాతం నమోదుకాకపోవచ్చని విశ్లేషించారు. You may be interested

ఒక్కసారి మార్కెట్‌ను వీడితే అంతే!: శంకర్‌ శర్మ

Saturday 1st December 2018

గత రెండు నెలల్లో ఈక్విటీల్లో అమ్మకాల ఒరవడి కొనసాగుతున్న తరుణంలో తన బ్యాంకు బ్యాలన్స్‌కు భారీ చిల్లు పడిందని, అటువంటి సందర్భాల్లో స్టాక్‌ మార్కెట్‌ను విడిచిపెడదామన్న ఆలోచన ప్రతీ ఒక్కరికీ వస్తుందని, తనకు సైతం వచ్చిందని ఏస్‌ ఇన్వెస్టర్‌, మార్కెట్‌ నిపుణుడు శంకర్‌ శర్మ అన్నారు. అయితే, కఠిన సందర్భాలు వచ్చి, పోతుండడం సహజమేనన్నారు. ఒక్కసారి మార్కెట్‌ను వీడితే తిరిగి రావడానికి మార్గం ఉండదన్నారు. ముంబైలో జరిగిన ఈటీ మార్కెట్స్‌

పెట్టుబడులకు భారత్‌ గొప్ప మార్కెట్‌

Friday 30th November 2018

మూడు నుంచి ఐదేళ్లు లేదా దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెం‍ట్లకు భారత్‌ గొప్ప మార్కెట్‌ అని ఐఐఎఫ్‌ఎల్‌ చైర్మన్‌, ఫౌండర్‌ నిర్మల్‌ జైన్‌ తెలిపారు. చాలా మంది ఇన్వెస్టర్లు భారత్‌ మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించారని పేర్కొన్నారు. వ్యాల్యుయేషన్స్‌, స్థిరత్వం వంటి వాటి రూపంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  ఇండియన్‌ మార్కెట్లు 2014 నుంచి మంచి పనితీరు కనబరుస్తున్నాయని నిర్మల్‌

Most from this category