STOCKS

News


200 స్టాక్స్‌ 40 శాతం లోపు పతనం

Wednesday 26th September 2018
Markets_main1537902034.png-20566

సెన్సెక్స్‌ గత నెలలో రికార్డు స్థాయిలో ర్యాలీ చేయగా, గత 17 సెషన్లలో 2,684 పాయింట్లు, 7 శాతం నష్టపోయింది. ఆగస్ట్‌ 29 నుంచి చూస్తే రూ.10 లక్షల మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయింది. కానీ, ఇదే సమయంలో కొన్ని స్టాక్స్‌లో మాత్రం పతనం భారీగానే ఉంది. బీఎస్‌ఈ 500 సూచీలో సుమారు 200కు పైగా స్టాక్స్‌ 10-40 శాతం మధ్యలో ధరల పతనాన్ని చవిచూశాయి. 

 

రూపాయి పతనం, పెరిగే చమురు ధరలు, బాండ్‌ ఈల్డ్స్‌, ఎన్‌బీఎఫ్‌సీల డిఫాల్ట్‌లపై ఆందోళనలు అన్నీ కలసి మార్కెట్ల నష్టాల పాలు చేశాయి. ఎఫ్‌ఐఐలు నిరాటంకంగా అమ్మకాలు చేస్తూనే ఉన్నారు. బేర్స్‌ పట్టుతో బీఎస్‌ఈ 500 సూచీలో భారీగా పతనమైన స్టాక్స్‌లో ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు కూడా ఉన్నాయి. దివాన్‌ హౌసింగ్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, యస్‌ బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, అదానీ పవర్‌, జైప్రకాష్‌ అసోసియేట్స్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, రిలయన్స్‌ నిప్పన్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, ఎడెల్వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియన్‌ బ్యాంకు, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, రిలయన్స్‌ పవర్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, యూనియన్‌ బ్యాంకు, సన్‌ టీవీ, కెనరా బ్యాంకు అధికంగా నష్టాలను చవిచూశాయి. 

 

ఇక బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ సూచీ పరిధిలో 405 స్టాక్స్‌ 10-50 శాతం మధ్యలో నష్టాలను చవిచూశాయి. రోల్టా ఇండియా, సునీల్‌ హైటెక్‌ ఇంజనీర్స్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, రుచిసోయా, గ్రావిటా ఇండియా, యూనిటెక్‌, హెచ్‌డీఐఎల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎస్కార్ట్స్‌, క్వాలిటీ, నిట్కో, విజయా బ్యాంకు వీటిలో ఉన్నాయి. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలపై పొజిషన్లకు దూరంగా ఉండాలి. అలాగే, తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసుకోవాలి. కనీసం 15-20 శాతం మేర లిక్విడ్‌ ఫండ్స్‌లో లేదా నగదు రూపంలో ఉంచుకోవాలి. భారీగా నష్టపోయిన వాటిలో విలువ ఆధారిత కొనుగోళ్లను చూడొచ్చు. దేశ ఆర్థిక ఆరోగ్యం క్షీణిస్తుండడంతో చాలా వరకు ప్రభుత్వరంగ స్టాక్స్‌ 40-60 శాతం మధ్య పతనమయ్యాయి. సాధారణ ఎన్నికలు రానున్నందున, పీఎస్‌యూ, క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాక్స్‌ను 12-18 నెలల దృష్టితో కొనుగోలు చేయవచ్చు’’ అని స్టీవర్ట్‌ అండ్‌ మ్యాక్‌రిచ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ అజయ్‌ జైస్వాల్‌ తెలిపారు.You may be interested

ఫెడ్‌ రేట్లు పెంచితే మన మార్కెట్లపై పడే ప్రభావం?

Wednesday 26th September 2018

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం తన రేట్ల పెంపుపై ప్రకటన చేయనుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) రెండు రోజుల సమావేశం మంగళవారం మొదలు కాగా, బుధవారంతో ముగుస్తుంది. ఈ ఏడాది ముచ్చటగా మూడోసారి కనీసం 25 బేసిస్‌ పాయింట్ల పేర రేట్లను పెంచే అవకాశం ఉందని అత్యధికుల అంచనా. ఇదే జరిగితే వడ్డీ రట్లు 1.75-2 శాతం నుంచి 2-2.25 శాతానికి చేరతాయి.    ‘‘ఫెడ్‌ 25 బేసిస్‌ పాయింట్ల

11080 పైన క్లోజయితే 11171 పాయింట్లకు నిఫ్టీ

Tuesday 25th September 2018

మంగళవారం దేశీయ సూచీలు లాభనష్టాల నడుమ ఊగిసలాడి చివర్లో మంచి లాభాలతో క్లోజయ్యాయి. నిఫ్టీ 10880 పాయింట్లను తాకి చివరకు 11070 పాయింట్ల వద్ద క్లోజయింది. చివరి గంటలో సూచీల్లో మంచి బలమైన రికవరీ కనిపించింది. చార్టుల్లో పియర్సింగ్‌ లైన్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. ఐదు సెషన్ల తర్వాత సూచీలు తొలిసారి లాభపడ్డాయి. బుధవారం నిఫ్టీ తన పరుగు కొనసాగించాలంటే 11080 పాయింట్లపైన బలంగా నిలదొక్కుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో

Most from this category