STOCKS

News


200 డీఎంఏ దిగువకు 60 శాతం షేర్లు

Wednesday 3rd October 2018
Markets_main1538560780.png-20826

దేశీయ మార్కెట్లు సెప్టెంబర్‌లో మంచి పతనం చవిచూశాయి. దీంతో నిఫ్టీ 50లో సగానికి పైగా స్టాకులు బలమైన 200 రోజుల డీఎంఏ స్థాయి దిగువకు దిగజారాయి. షేరు చార్టుల్లో 200 రోజుల డీఎంఏ స్థాయి బలమైన మద్దతుగా పరిగణిస్తారు. తాజా పతనంలో పలు బ్లూచిప్‌ కంపెనీలు ఈ కీలక స్థాయిని కోల్పోయాయి. ఇలా పతనమైన స్టాకుల్లో బజాజ్‌ ఆటో, యస్‌ బ్యాక్‌, కోల్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్‌, యూపీఎల్‌, టాటా స్టీల్‌, ఐషర్‌ మోటర్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, మారుతీ సుజుకీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లాంటి దిగ్గజాలున్నాయి. సాధారణంగా షేరు 200 రోజుల డీఎంఏ దిగువకు వస్తే ఓవర్‌సోల్డ్‌ ప్రాంతంలోకి వచ్చినట్లు టెక్నికల్‌ నిపుణులు విశ్లేషిస్తారు. ఈ స్థాయి దిగువకు వచ్చిన షేర్లు కనీసం కొద్దిపాటి పుల్‌బ్యాక్‌ చూపే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మధ్యకాలిక ఇన్వెస్టర్లు ఈ స్థాయి దిగువన కొనుగోళ్లను పరిశీలించవచ్చని నిపుణులు సలహా ఇస్తుంటారు.

200 రోజుల డీఎంఏ దిగువకు వచ్చిన కొన్ని షేర్లు...

ప్రస్తుతం 200 రోజుల డీఎంఏ స్థాయికి దిగువన ట్రేడవుతున్న లార్జ్‌ క్యాప్స్‌లో చాలా స్టాకులు బాటమ్‌అవుట్‌ చూపుతున్నాయని చార్ట్‌వ్యూ ఇండియా తెలిపింది. ఈ సమయంలో ఇలాంటి వాటిలో నాణ్యమైన వాటిని ఎంచుకోవాలని సలహా ఇచ్చింది. 200 రోజుల డీఎంఏ స్థాయిని కోల్పోవడమంటే ఆ షేరుకు దూరంగా ఉండమని కాదని, ముఖ్యంగా లార్జ్‌క్యాప్స్‌ విభాగంలో 200 రోజుల డీఎంఏ దిగువకు రావడమంటే బాటమ్‌ అవుట్‌ చెందటమని తెలిపింది. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2016 డిసెంబర్‌లో 200 డీఎంఏ దిగువకు వచ్చి వేగంగా రీబౌండ్‌ అయింది. గత మేలో మారుతీ షేరు సైతం ఇదే ధోరణి చూపింది. అయితే ఈ స్థాయి దిగువకు వచ్చిన ప్రతి షేరు బౌన్స్‌ బ్యాక్‌ చెందుతుందని చెప్పలేము. రంగాలవారీగా రీబౌన్స్‌లు ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్‌డీఎఫ్‌సీ కవలలు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లను పరిశీలించవచ్చని సిఫార్సు చేస్తున్నారు. 


 You may be interested

సెన్సెక్స్‌ 550 పాయింట్లు క్రాష్‌

Wednesday 3rd October 2018

నిఫ్టీ నష్టం 150 పాయింట్లు మార్కెట్‌ మరోసారి నిలువునా పతనమైంది. ఒకరోజు సెలవు అనంతరం బుధవారం మిశ్రమంగా ప్రారంభమైన సూచీలు చివరికి భారీ నష్టాలతో ముగిశాయి. ప్రపంచమార్కెట్లో ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోవడం, ఇటలీ బడ్జెట్‌ సంక్షోభం తెరపైకి రావడం, ఇంట్రాడేలో రూపాయి మళ్లీ జీవితకాల కనిష్టానికి చేరుకోవడం, ఈ వారంలో ఆర్‌బీఐ సమీక్షా సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత... తదితర కారణాలతో ​ట్రేడింగ్‌ ఆద్యంతం అ‍మ్మకాలు వెల్లువెత్తాయి.

రూపాయి రికవరీ: నష్టాల్లో ఐటీ షేర్లు

Wednesday 3rd October 2018

ముంబై:- రూపాయి మారకం రికవరీ కారణంగా బుధవారం మిడ్‌ సెషన్‌ సమయానికి ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరడంతో నేడు ఇండియన్‌ రూపాయి తన జీవిత కాలంలోనే తొలిసారిగా 73 మార్క్‌ దిగువకు పతనమైంది. నేటి ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి 73.34 వద్ద కొత్త కనిష్ట స్థాయిన్ని నమోదు చేసింది. రూపాయి పతననానికి అడ్డుకట్టు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంధన

Most from this category