STOCKS

News


మీ పెట్టుబడి రెట్టింపు కావాలా... వెరీ సింపుల్‌!

Friday 28th December 2018
Markets_main1545935944.png-23267

స్టాక్‌ మార్కెట్లో తమ పెట్టుబడి రెట్టింపు కావాలన్నదే ఎక్కువ మంది ఇన్వెస్టర్ల ఆకాంక్షగా కనిపిస్తుంది. తక్కువ వ్యవధిలోనే తమ పెట్టుబడి రెండింతలు కావాలన్న దృష్టితోనే స్టాక్స్‌ కొనుగోలు చేస్తుంటారు. కానీ, కొన్న తర్వాత ఆ స్టాక్‌ గమనం అనుకున్న విధంగా లేకపోయినా, రివర్స్‌లో నష్టపోతున్నా నిర్ణయాలు సరిగ్గా ఉండవు. దాంతో రెట్టింపు లాభం సంగతి దేవుడు ఎరుగు, అసలు లాభం బుక్‌ చేసుకునే వారు కొద్ది మందే ఉంటారు. ఈ నేపథ్యంలో తమ పెట్టుబడి రెట్టింపు అయ్యేందుకు మంచి సూత్రాలను ‘విలియం ఓనీల్‌ ఇండియా’ రీసెర్చ్‌ డైరెక్టర్‌ విపిన్‌ ఖరే తెలిపారు.

 

ఒక పెద్ద సమస్య ఏంటంటే... ఇన్వెస్టర్లు తమ స్టాక్స్‌ విక్రయించేందుకు గడువును నిర్ణయించుకోకపోవడం. ఎప్పుడు, ఏ స్టాక్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం తేలికే. కానీ, అమ్మకానికి వచ్చే సరికి భావోద్వేగాలు నిర్ణయాలను చుట్టుముడతాయి. స్టాక్స్‌లో డబ్బులు సంపాదించుకోవాలంటే... అందుకు ముందుగా మీ పెట్టుబడిని కాపాడుకోవాలి. అప్పుడే మీ పెట్టుబడికి మరో రోజు మిగిలి ఉంటుంది. స్టాక్‌ కొన్న తర్వాత 7-8 శాతం మించి పడిపోతే దాన్ని విక్రయించేయాలి. ఈ సూత్రం నష్టాలను పరిమితం చేస్తుంది. కొంచెం నష్టాలు కాస్తా భారీ నష్టాలుగా మారకుండా జాగ్రత్త పడినట్టు కూడా అవుతుంది. 7-8 శాతం పడిపోతేనే ఎందుకు అమ్మాలి? అంటే... 130 ఏళ్ల స్టాక్‌ మార్కెట్‌ చరిత్రపై అధ్యయనం ద్వారా రూపొందించిన నిబంధన ఇది. మంచి స్టాక్‌ సైతం కొన్ని సందర్భాల్లో కొనుగోలుకు సహేతుక ధరను బ్రేక్‌ చేసి కిందకు రావచ్చు. అయితే, అలాంటి సందర్భాల్లో అవి 8 శాతానికి మించి దాదాపు పడిపోవు. ఒకవేళ స్టాక్‌ 8 శాతం కంటే ఎక్కువగా నష్టపోతే మీరు కొన్న ధర సరైనది కాకపోవడం లేదా కంపెనీ, పరిశ్రమ, సాధారణ మార్కెట్‌ అంశాలు కారణం కావచ్చు. ఒకవేళ మీరు 8 శాతం పడిపోయిందని అమ్మేసిన తర్వాత... అది కాస్తా తిరిగి పెరగడం ప్రారంభిస్తే పొరపాటు చేశానని భావించకూడదు. మీ పెట్టుబడి కాపాడుకున్నానని అనుకోవాలి. ఈ స్వల్ప నష్టాన్ని మీ పెట్టుబడి రక్షణ కోసం చెల్లిస్తున్న బీమా ప్రీమియంగా భావించాలి. అదే స్టాక్‌ బలాన్ని చూపిస్తే తిరిగి మరలా కొనుగోలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో నష్టాలను 3-5 శాతం మధ్య కూడా పరిమితం చేసుకోవచ్చు.  

 

లాభాల స్వీకరణ
ఇక 20-25 శాతం లాభాలను బుక్‌ చేసుకోవాలి. ఒక స్టాక్‌లో లాభం వస్తే ఆ లాభం శాతాన్ని 72తో భాగించాలి. అప్పుడు మీ పెట్టుబడి రెట్టింపు అవ్వడానికి ఎన్ని రెట్లు కాంపౌండ్‌ అవ్వాలన్నది తెలుస్తుంది. ఉదాహరణకు మూడు స్టాక్స్‌లో 24 శాతాలు చొప్పున లాభం సంపాదించారనుకుంటే, లాభాలను ప్రతీసారి తిరిగి ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఒకే స్టాక్‌లో 100 శాతం లాభం సంపాదించడం కంటే, భిన్న స్టాక్స్‌లో పెట్టుబడులపై 20-25 శాతం చొప్పున లాభాలు ఆర్జించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ చిన్న మొత్తాలు మొత్తం మీద పెద్ద లాభంగా మారతాయి. మీరు కొనుగోలు చేసిన ధర నుంచి మూడు వారాల్లోనే స్టాక్‌ 20 శాతం పెరిగిందంటే, కనీసం ఎనిమిది వారాల పాటు అలాగే కొనసాగించాలి. దీంతో మరో 20 శాతం పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. దీంతో మీరు కొన్న తర్వాత ఎనిమిది వారాలు పూర్తయిన అనంతరం స్టాక్‌ను విక్రయించడం లేదా కొనసాగించడం చేసుకోవచ్చు. లాభాలు గణనీయంగా వచ్చి, మార్కెట్‌ బాగుంటే మరికొంత కాలం వేచి చూడొచ్చు. 
 You may be interested

పన్ను ఆదా కోసం... ఈ ఐదు ఫండ్స్‌

Friday 28th December 2018

మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారి ముందున్న మెరుగైన సాధనాల్లో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) కూడా ఒకటి. సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపునకు ఈఎల్‌ఎస్‌ఎస్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలంటూ వెల్త్‌ మేనేజర్లు ఎక్కువగా సూచిస్తుంటారు. ఎందుకంటే పన్ను ఆదా కోసం ఉపయోగపడే సాధనాల్లో తక్కువ లాకిన్‌ పీరియడ్‌ మూడేళ్లు కలిగి ఉన్న

రెండో రోజూ లాభాలే

Thursday 27th December 2018

మార్కెట్‌ డిసెంబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ముగింపును లాభంతో ముగించింది. అధిక వెయిటేజ్‌ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్ల ర్యాలీ అండతో సూచీలు వరుసగా రెండోరోజూ లాభాల్లోనే ముగిశాయి. యూరప్‌, ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల ట్రెండ్‌ ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురిగొల్పింది. అయితే బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి లోనవ్వడంతో నిఫ్టీ 10800 మార్కును నిలబెట్టుకోవడంలో విఫలమైంది. చివరకు సెన్సెక్స్‌ 157 పాయిం‍ట్ల

Most from this category