News


అంచనాలను మించిన ఫలితాలు... వీటిని కొనొచ్చా..?

Wednesday 27th February 2019
Markets_main1551207232.png-24343

డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాలను గమనిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. నిఫ్టీ-50 సూచీలోని 50 కంపెనీల్లో 16 కంపెనీలు (32 శాతం) అంచనాలకు మించిన ఫలితాలను ప్రకటించాయి. 15 కంపెనీలు (30 శాతం) ప్రకటించిన ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఉంటే, మరో 10 కంపెనీల ఫలితాలు మిశ్రమంగా, 9 కంపెనీల ఫలితాలు అంచనాలకు దిగువన ఉన్నాయని సెంట్రమ్‌ వెల్త్‌ రీసెర్చ్‌ నివేదిక చెబుతోంది. 

 

‘‘మూడో త్రైమాసికంలో (డిసెంబర్‌ క్వార్టర్‌) కంపెనీలకు సూక్ష్మ ఆర్థిక అంశాల పరంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. రూపాయి బలహీనత, చమురు ధరల పెరుగుదల, బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగిపోవడం వంటివి ఇందులో ఉన్నాయి. దీనికి లిక్విడిటీ సమస్యలు, ఇతర అనిశ్చిత పరిస్థితులు కూడా తోడయ్యాయి. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో కంపెనీలు ప్రకటించిన ఫలితాలు క్రమంగా రివకరీ అవుతున్నట్టు సంకేతమిస్తున్నాయి’’ అని సెంట్రమ్‌ నివేదిక తెలిపింది. అయితే, ఇదే తరహా ఫలితాలు కొసాగుతాయా అన్నది దృష్టి సారించాలని ఇన్వెస్టర్లకు సూచించింది. నిఫ్టీ-50 సూచీలో అంచనాలకు మించిన ఫలితాలను ప్రకటించిన కంపెనీల్లో... జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, గెయిల్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఓఎన్‌జీసీ తదితర కంపెనీలు ఉన్నాయి. 

 

వార్షికంగా లాభాల్లో 9 శాతం నుంచి 286 శాతం మధ్య ఇవి వృద్ధిని చూపించాయి. అత్యధికంగా సన్‌ఫార్మా లాభం వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 286 శాతం పెరిగి రూ.1,242 కోట్లుగా నమోదైంది. ఆ తర్వాత డాక్టర్‌ రెడ్డీస్‌ నికర లాభం 65 శాతం, ఓఎన్‌జీసీ 65 శాతం, కోల్‌ ఇండియా 50 శాతం, జీఎంటర్‌టైన్‌మెంట్‌ లాభం 50 శాతం చొప్పున వృద్ధి చెందాయి. అమ్మకాల్లోనూ ఇవి 56 శాతం వరకు వృద్ధిని చూపించాయి. అమ్మకాల ఆదాయంలో అత్యధికంగా రిలయన్స్‌ కంపెనీలో 56 శాతం పెరుగుదల ఉంది. 



You may be interested

ఫార్మా రంగంలో ‘స్టార్స్‌’!

Wednesday 27th February 2019

గత రెండు సంవత్సరాలుగా ఫార్మా రంగం షేర్లు (ఒకటి రెండు మినహాయించి) ఇన్వెస్టర్లకు పెద్దగా లాభాలు ఇచ్చింది లేదు. యూఎస్‌ఎఫ్‌డీఏ నియంత్రణ సమస్యలు, అమెరికా మార్కెట్లో జనరిక్‌ ధరల విషయంలో తీవ్ర పోటీ పరిస్థితులు వాటికి ప్రతికూలంగా పనిచేశాయి. కాకపోతే ఈ ధరల ఒత్తిళ్లు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో తిరిగి భారత కంపెనీలు తమ మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నాయి. దేశీయ ఫార్మా కంపెనీలకు 2019లో వృద్ధి అవకాశాల

తీవ్ర హెచ్చుతగ్గులు-నష్టాలతో ముగింపు

Tuesday 26th February 2019

సరిహద్దుల్లో భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధ ఉద్రిక్త నేపథ్యంలో మంగళవారం దేశీయ మార్కెట్‌ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 239 పాయింట్ల నష్టంతో 35974 వద్ద, నిఫ్టీ 45పాయింట్ల నష్టంతో 10835 వద్ద ముగిసింది. బ్యాంక్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంజీసీ, రియల్టీ షేర్లు అ‍మ్మకాల ఒత్తిడికి లోనవగా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మరోవైపు అటో, ఫార్మా, మెటల్‌, మీడియా షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత వైమానిక దళం

Most from this category