News


ఈ స్టాక్స్‌లో సత్తా ఉంది: యాంబిట్‌ క్యాపిటల్‌

Friday 1st March 2019
Markets_main1551463625.png-24394

గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ కంపెనీల విలువలు భారీగా దిగొచ్చాయి. నిఫ్టీ 9 శాతం తగ్గితే, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 25 శాతం పతనమైంది. ఈ నేపథ్యంలో టాప్‌ డౌన్‌ క్వాలిటేటివ్‌, క్వాంటిటేటివ్‌ పారామీటర్ల ఆధారంగా యాంబిట్‌ క్యాపిటల్‌ అధిక నాణ్యత కలిగిన మిడ్‌క్యాప్‌ కంపెనీలతో ఓ జాబితా రూపొందించింది. బలమైన వ్యాపార మూలాలతో, చారిత్రకంగా చూస్తే ఆకర్షణీయమైన విలువల వద్ద ఇవి ఉన్నట్టు యాంబిట్‌ క్యాపిటల్‌ తెలిపింది. 

 

ఆర్‌వోసీఈ 15 శాతం, క్యాష్‌ ఫ్లో తీరు బలంగా ఉండడం, వృద్ధి అవకాశాలు తదితర అంశాల ఆధారంగా స్టాక్స్‌ను వడగట్టి మరీ 16 కంపెనీలతో జాబితాను తయారు చేసింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల ఆర్‌వోసీఈ 24 శాతం పైనే ఉంది. జాన్సన్‌ హిటాచీ, జీఎన్‌ఎఫ్‌సీ, హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌, వెంకీస్‌, జేకే పేపర్‌, వెస్ట్‌కోస్ట్‌ పేపర్‌, ల్యుమాక్స్‌ ఇండస్ట్రీస్‌, మైథాన్‌ అలాయ్స్‌, జీలెర్న్‌, పీపీఏపీ ఆటోమోటివ్‌, యాక్షన్‌ కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ అగర్వాల్‌ ఇండస్ట్రీస్‌, ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా, కేఎంసీ స్పెషాలిటీ, విరించి, బ్లాక్‌రోజ్‌ ఇండస్ట్రీస్‌ ఈ జాబితాలో ఉన్నాయి. 

 

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 3 బిలియన్‌ డాలర్ల (రూ.21,000 కోట్లు) లోపు ఉన్న కంపెనీలే ఇవన్నీ. ఆరు అంచెల విధానంలో వీటిని ఎంపిక చేసినట్టు యాంబిట్‌ క్యాపిటల్‌ తెలిపింది. హాక్‌ స్కోరు ఆధారంగా నాణ్యతను గుర్తించడం, చౌక వ్యాల్యూషన్లలో ట్రేడ్‌ అవడం, ఆరోగ్యకరమైన క్యాష్‌ ఫ్లో, పియోట్రాస్కి ఎఫ్‌ స్కోరు, పన్నుకు ముందస్తు ఆర్‌ఓసీఈ కనీసం 15 శాతం ఉండడం వంటి అంశాల ఆధారంగా ఎంపిక జరిగినట్టు పేర్కొంది. బలమైన అకౌంటింగ్‌ నాణ్యత కలిగిన సంస్థలు దీర్ఘకాలంలో బలహీన అకౌంటింగ్‌ నాణ్యత కలిగిన వాటితో పోలిస్తే మంచి పనితీరు చూపించినట్టు యాంబిట్‌ క్యాపిటల్‌ తెలిపింది. గత 2 సంవత్సరాల వ్యాల్యూషన్ల సగటు కంటే 20 శాతం తక్కువకు ఇవి ట్రేడ్‌ అవుతున్నట్టు తెలిపింది. You may be interested

రూ.10వేలు పదేళ్లలో రూ.కోటిన్నర

Friday 1st March 2019

స్టాక్‌ మార్కెట్లో లాభాలు దీర్ఘకాలంలో కోటీశ్వరులను చేస్తాయనేదాన్ని ఇప్పటి వరకు ఎన్నో కంపెనీలు నిరూపించాయి. ఆ జాబితాలోనిదే వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ కూడా. పోటీపరమైన అనుకూలత (ఆ విభాగంలో సంబంధిత కంపెనీకి గట్టి పోటీలేకపోవడం) ఉన్న కంపెనీలను మోట్‌గా చెబుతారు. స్థిరంగా ఫలితాల్లో వృద్ధిని చూపిస్తే వీటిని కొనుగోలు చేసుకోవచ్చన్నది విశ్లేషకుల సూచన. వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీకి ఇవే అర్హతలు ఉన్నాయి.   వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టాక్‌ 2009లో ఓ బుల్లి కంపెనీ. పెద్దగా

భారతీ ఎయిర్‌టెల్‌ రూ.32,000 కోట్ల సమీకరణ

Friday 1st March 2019

రైట్స్‌ ఇష్యూ, బాండ్ల జారీకి నిర్ణయం న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు సిద్ధమైంది. రైట్స్‌ ఇష్యూ, బాండ్ల జారీ ద్వారా రూ.32,000 కోట్ల సమీకరణకు భారతీ ఎయిర్‌టెల్‌ బోర్డు నిర్ణయించింది. దీంతో  టెలికం మార్కెట్లో జియో పోటీని ఎదుర్కొనేందుకు కంపెనీకి మరింత బలం చేకూరనుంది. మరో పోటీ కంపెనీ వొడాఫోన్‌ ఐడియా సైతం ఇటీవలే రూ.18,250 కోట్ల నిధుల సమీకరణతో భారీ రైట్స్‌ ఇష్యూకు వెళ్లాలని నిర్ణయించిన

Most from this category