STOCKS

News


15 స్టాక్స్‌.. 40 శాతం రాబడికి ఛాన్స్‌!!

Wednesday 19th December 2018
Markets_main1545202219.png-23077

స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు టెక్నికల్‌ చార్ట్స్‌ ఆధారంగా వచ్చే ఏడాది 40 శాతం దాకా రాబడిని అందించగల 15 స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం.. 

సీమెన్స్‌: ఈ స్టాక్‌ 2015లో జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,559ని తాకింది. అప్పటి నుంచి డౌన్‌ట్రెండ్‌లోనే ఉంటూ వస్తోంది. 2018 అక్టోబర్‌లో రూ.850 వద్ద బాటమ్‌ ఔట్‌ అయ్యినట్లు కనిపించింది. రూ.950- 900 స్థాయిల్లో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.1,230. స్టాప్‌లాస్‌ రూ.850. దాదాపు 26 శాతం రిటర్న్‌ అంచనా వేయవచ్చు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: ఇటీవల కాలంలో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల వైపు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. లాంగ్‌టర్మ్‌ చార్ట్స్‌ పరంగా చూస్తే ఈ స్టాక్‌ రూ.210- 85 శ్రేణిలో కదలాడవచ్చు. రూ.91 వద్ద బాటమ్‌ ఔట్‌ అయ్యింది. రూ.85 వద్ద బలమైన మద్దతు కనిపిస్తోంది. రూ.150 టార్గెట్‌ ప్రైస్‌తో స్టాక్‌ను రూ.110- 90 శ్రేణిలో కొనొచ్చు. స్టాప్‌ లాస్‌ రూ.80. 34 శాతం రిటర్న్‌ అంచనా వేయవచ్చు. 

మహీంద్రా అండ్‌ మహీంద్రా: 2013 నుంచి ఈ స్టాక్‌ అప్‌ట్రెండ్‌లో ఉంటూ వస్తోంది. రూ.700 సమీపంలో బలమైన మద్దతు కనిపిస్తోంది. ఈ స్టాక్‌ రూ.700 పైన స్థిరపడితే రూ.933లకే చేరొచ్చు. ఇన్వెస్టర్లు రూ.730- 700 శ్రేణిలో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌ లాస్‌ రూ.685. 23 శాతం రాబడిని ఆశించొచ్చు. 

ఫెడరల్‌ బ్యాంక్‌: 2018లో ఈ స్టాక్‌ అండర్‌పర్ఫార్మ్‌ చేస్తోంది. గత కొతం కాలంగా ఈ స్టాక్‌ 200 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ పైన కదలాడుతోంది. ట్రెండ్‌లైన్‌ పైన బ్రేక్‌ఔట్‌ అయ్యింది. పాజిటివ్‌ డైవర్జెన్సీ గమనిస్తే రానున్న రోజుల్లో స్టాక్‌ ధర పెరగొచ్చని తెలుస్తోంది. రూ.85-90 శ్రేణిలో ఈ స్టాక్‌ను కొనొచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.114. స్టాప్‌ లాస్‌ రూ.70. దాదాపు 23 శాతం రాబడిని ఆశించొచ్చు.

కోల్గేట్‌ పామోలివ్‌: లాంగ్‌టర్మ్‌ చార్ట్స్‌లో ఈ స్టాక్‌ అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. స్వల్ప, దీర్ఘ కాల మూవింగ్‌ యావరేజ్‌లకు పైన ట్రేడవుతోంది. గత గరిష్ట స్థాయికి పైన బ్రేక్‌ఔట్‌ అయ్యింది. ఫాలోఅప్‌ బయ్యింగ్‌ను సూచిస్తోంది. రౌండింగ్‌ బాటమ్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచిన తర్వాత స్టాక్‌ బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. ఇది స్టాక్‌ ధరలో పెరుగుదలను సూచిస్తోంది. రూ.1,250- 1,300 శ్రేణిలో ఈ స్టాక్‌ను కొనొచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.1,500. స్టాప్‌లాస్‌ రూ.1,050. దాదాపు 15 శాతం రాబడిని అంచనా వేయవచ్చు.

బెర్జర్‌ పెయింట్స్‌: ప్రస్తుత ఏడాది మధ్య కాలంలో ఈ స్టాక్‌ రూ.349 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి తాకింది. అక్కడి నుంచి ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా పడిపోయింది. తర్వాత మళ్లీ రూ.300 స్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ స్టాక్‌ బుల్లిష్‌ ఫ్లాగ్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. బ్రేక్ఔట్‌ను రెడీగా ఉంది. అందువల్ల ఈ స్టాక్‌ను రూ.315-325 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. రూ.390 టార్గెట్‌ ప్రైస్‌. స్టాప్‌ లాస్‌ రూ.270. దాదాపు 20 శాతం రిటర్న్‌ పొందొచ్చు.

కమ్మిన్స్‌ ఇండియా: ప్రస్తుతం ఈ స్టాక్‌ రూ.635 సమీపంలో డబుల్‌ బాటమ్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. వీక్లి చార్ట్స్‌లో డబ్ల్యూ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. ఇది స్టాక్‌ ధరలో అప్‌సైడ్‌ను సూచిస్తోంది. రూ.790- 805 శ్రేణిలో ఈ స్టాక్‌ను కొనొచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.945. స్టాప్‌ లాస్‌ రూ.705. దాదాపు 13 శాతం రిటర్న్‌ ఆశించొచ్చు.

టీవీఎస్‌ మోటార్‌: 52 వారాల గరిష్ట స్థాయి రూ.794 నుంచి చూస్తే ఈ స్టాక్‌ దాదాపు 25 శాతం మేర పడిపోయింది. అయినా కూడా వీక్లి చార్ట్స్‌లో ఈ స్టాక్‌ 200 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌కు పైనే కదలాడుతోంది. గత 8 వారాలుగా రూ.515- 570 శ్రేణిలో కన్సాలిడేట్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ స్టాక్‌ సిమెట్రికల్‌ ట్రైయాంగిల్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. అలాగే అధిక వ్యాల్యూమ్స్‌లో స్టాక్‌ ధర పెరిగింది. ఇది అప్‌సైడ్‌ను సూచిస్తోంది. రూ.560- 570 శ్రేణలో ఈ స్టాక్‌ను కొనొచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.656. స్టాప్‌లాస్‌ రూ.500. దాదాపు 14 శాతం రిటర్న్‌ అంచనా వేయవచ్చు. 

యూపీఎల్‌: లాంగ్‌టర్మ్‌ మూవింగ్‌ యావరేజ్‌లో పాజిటివ్‌ క్రాసోవర్‌ అఏది బుల్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. లాంగ్‌సైడ్‌ పొజిషన్ల తీసుకోవడానికి ఇది సరైన సమయం. టార్గెట్‌ ప్రైస్‌ రూ.950. స్టాప్‌ లాస్‌ రూ.700. దాదాపు 23 శాతం రిటర్న్‌ పొందొచ్చు. 

రేమాండ్‌: డిక్లైనింగ్‌ చానల్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. రూ.1,140 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనొచ్చు. స్టాప్‌ లాస్‌ రూ.720. దాదాపు 33 శాతం రిటర్న్‌ ఆశించొచ్చు. 

యస్‌ బ్యాంక్‌: జీవిత కాల గరిష్ట స్థాయిల నుంచి పతనమైంది. 8 ఏళ్ల కనిష్ట స్థాయిలకు క్షీణించింది. గత కొంత కాలంగా ఈ స్టాక్‌ రేంజ్‌ బౌండ్‌లో కదలాగుతూ వస్తోంది. బాటమ్‌ ఔట్‌కు సిద్ధమౌతోదనే సంకేతాలు ఉన్నాయి. రూ.144 స్థాయిలో కొనొచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.254. దాదాపు 40 శాతం రిటర్న్‌ అంచనా వేయవచ్చు. 

పవర్‌ ఫైనాన్స్‌ కార్ప్‌: ఈ స్టాక్‌ గత పదేళ్లుగా రేంజ్‌ బౌండ్‌లోనే ఉంటూ వస్తోంది. కనిష్ట స్థాయిల్లో రూ.70కి, గరిష్ట స్థాయిల్లో రూ.160ని తాకింది. స్టాక్‌కు రూ.65 వద్ద కీలక మద్దతు ఉంది. రూ.70- 80 శ్రేణిలో ఈ స్టాక్‌ను కొనొచ్చు. రూ.135 టార్గెట్‌ ప్రైస్‌. దాదాపు 47 శాతం రిటర్న్‌ పొందొచ్చు. 

యునైటెడ్‌ స్పిరిట్స్‌: ఈ స్టాక్‌ను రూ.775 టార్గెట్‌ ప్రైస్‌తో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌ లాస్‌ రూ.520. దాదాపు 21 శాతం రాబడిని ఆశించొచ్చు.   

ఏసియన్‌ పెయింట్స్‌: క్రూడ్‌ ధరలు తక్కువగా ఉండటం, ఎఫ్‌ఐఐ ఇన్వెస్ట్‌మెంట్ల పెరుగుదల అంచనాలు కారణం స్టాక్‌ ధరలో పెరుగుదల ఉండొచ్చు. రూ.1,635 టార్గెట్‌ ప్రైస్‌. స్టాప్‌ లాస్‌ రూ.1,110. దాదాపు 22 శాతం రిటర్న్‌ ఆశించొచ్చు. 

నెస్లె ఇండియా: 2015 నుంచి కన్సాలిడేట్‌ అవుతూ వస్తోన్న ఈ స్టాక్‌ 2017లో బ్రేక్‌ఔట్‌ అయ్యింది. తర్వాత తగ్గినా కూడా మళ్లీ రికవరీ అయ్యింది. రూ.13,550 టార్గెట్‌ ప్రైస్‌. స్టాప్‌ లాస్‌ రూ.9,075. దాదాపు 21 శాతం రిటర్న్‌ అంచనా వేయవచ్చు. 



You may be interested

స్టుడ్స్‌ యాక్సెసరీస్ ఐపీఓకు సెబీ ఓకే

Wednesday 19th December 2018

ఐపీఓ విలువ రూ.100 కోట్లు ద్విచక్ర వాహన విడిభాగాల తయారీ సంస్థ స్టుడ్స్‌ యాక్సెసరీస్ ఐపీఓ ప్రక్రియకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి ఆమోదం తెలిపింది. నిధుల సమీకరణ నిమిత్తం ఐపీఓకు అనుమతినివ్వాలంటూ ఈ ఏడాది ఆగస్ట్‌లో సెబికి ముసాయిదా పత్రాలను సమర్పించింది. పత్రాలను పరిశీనల అనంతరం ఈ వారంలో ప్రారంభంలో స్టుడ్స్‌ యాక్సెసరీస్‌ ఐపీఓకు అనుమతిచ్చినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ ఇష్యూలో కంపెనీ

ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు జూమ్‌

Wednesday 19th December 2018

ఆర్‌బీఐ బాండ్ల కొనుగోలు సిద్ధమైన నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభాల బాటపట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలోటును తీర్చేందుకు వచ్చే నెలలో బాం‍డ్ల బైబ్యాక్‌ కార్యక్రమం ద్వారా రూ.50వేల కోట్ల నిధులను అందుబాటులోకి తెస్తామని ఆర్‌బీఐ మంగళవారం​ప్రకటించింది. ఇప్పటికే ఈ డిసెంబర్‌లో ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్ల ద్వారా రూ.40వేల

Most from this category