STOCKS

News


ఈ 15 షేర్లూ...బడ్జెట్‌ బెట్స్‌!

Friday 25th January 2019
Markets_main1548396336.png-23798

అనలిస్టుల సూచన
మధ్యంతర బడ్జెట్‌తో ప్రయోజనం పొందే 15 స్టాకులను వివిధ బ్రోకరేజ్‌ సంస్థలకు చెందిన అనలిస్టులు సూచిస్తున్నారు.
5నాన్స్‌ డాట్‌కామ్‌ సూచనలు
1. టీవీఎస్‌మోటర్స్‌: వ్యవసాయదారులకు యూబీఐ అమలుతో కంపెనీకి లాంగ్‌టర్మ్‌లో లబ్ది కలుగుతుంది. క్యు3లో కంపెనీ మంచి లాభాలను ప్రకటించింది. నెలవారీ విక్రయాలు కూడా బాగున్నాయి.
2. డాబర్‌ ఇండియా: కంపెనీ ఆదాయాల్లో దాదాపు సగం వాటా గ్రామీణ ప్రాంతాల మార్కెట్‌దే ఉంది. ఈ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధిపై ఎక్కువ ఫోకస్‌ పెట్టనున్నందున కంపెనీకి కలిసివస్తుంది. డిమాండ్‌లో రికవరీ, ఉత్పాదకాల వ్యయాలు తగ్గుముఖం పట్టడం కూడా పాజిటివ్‌ అంశాలే.
3. ఎస్కార్ట్స్‌: ట్రాక్టర్‌ విక్రయాల్లో దాదాపు 28 శాతం వృద్ది నమోదు చేసింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తోంది. సాగు, రూరల్‌ రంగాలకు ప్రాధాన్యమిచ్చే బడ్జెట్‌తో కంపెనీకి మేలు చేకూరుతుంది.
4. కజారియా సిరామిక్స్‌: మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేయడం కలిసివచ్చే అంశం. క్యు3 లాభంలో రెండంకెల వృద్ధి నమోదు చేసింది.
5. మదర్‌సన్‌సుమి సిస్టమ్స్‌: దేశీయ డిమాండ్‌లో రికవరీ కారణంగా కంపెనీకి లాంగ్‌టర్మ్‌లో లాభం కలుగుతుంది. 
ఛాయిస్‌ బ్రోకింగ్‌ సూచనలు
1. అపోలోటైర్స్‌: ముడిపదార్ధాల వ్యయాలు తగ్గుముఖం పట్టడంతో ప్రయోజనం పొందనుంది. యూరప్‌ మార్కెట్‌లో కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి.
2. ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌: తాజా పతనం కొత్తగా ఎంటరయ్యేందుకు మంచి అవకాశం. స్థిరమైన ఆదాయ వృద్ది, అల్ప మొండిపద్దులు బ్యాంకును ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.
3. మహీంద్రా సీఐఈ: లుథియానా ప్లాంట్‌ సామర్ధ్య విస్తరణతో బలమైన వృద్ది అవకాశాలు కలగనున్నాయి. ఆర్డర్‌బుక్‌ బాగుంది.
4. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌: పత్తిఉత్పత్తి స్థిరంగా ఉండడంతో దేశీయ వ్యాపారం పుంజుకోనుంది. కంపెనీ అనుబంధ విభాగం అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ మంచి పనితీరు కనబరుస్తోంది.
5. అదానీ పోర్ట్స్‌: దేశవ్యాప్తంగా పది ఓడరేవులు కంపెనీ నిర్వహణలో ఉన్నాయి. జలరవాణా ఊపందుకోవడం కలిసివచ్చే అంశం.
క్యాపిటల్‌ ఎయిమ్‌ సూచనలు
1. యూపీఎల్‌: ప్రభుత్వం ఎరువల కంపెనీలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందన్న ఊహాగానాలున్నాయి. ఇదే నిజమైతే కంపెనీ షేరు దూసుకుపోతుంది. 
2. ఏసీసీ: ఇన్‌ఫ్రాపై ప్రభుత్వ వ్యయం పెంచితే సిమెంట్‌కు డిమాండ్‌ ఊపందుకోనుంది. 
3. ఆర్‌ఈసీ: బడ్జెట్‌ తరుణంలో షేరు చార్టుల్లో బలమైన పాజిటివ్‌ ట్రెండ్‌ కనిపిస్తోంది. దేశమంతా విద్యుదీకరణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు కంపెనీకి ప్రయోజనం చేకూరుస్తాయి.
4. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌: చార్టుల్లో త్రిభుజాకార పాటర్న్‌ ఏర్పరిచింది. ఈ పాటర్న్‌ నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌కు రెడీగా ఉంది.
5. ఎన్‌ఐఐటీ టెక్‌: టెక్నాలజీపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్‌ పెడుతుందన్న అంచనాలు ఈ రంగంలో స్టాకులకు మేలు చేస్తాయి. ఎన్‌ఐఐటీ తాజాగా మిడ్‌టర్మ్‌ నిరోధాన్ని మంచి వాల్యూంలతో దాటేసింది. You may be interested

ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాల వివరాలు

Friday 25th January 2019

పీఎన్‌బీ హౌసింగ్‌ లాభం 32 శాతం అప్‌ న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో (అక్టోబర్‌-డిసెంబర్‌) 32 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.229 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్వార్టర్‌లో రూ.303 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.2,078 కోట్లకు పెరిగింది. గతేడాది క్యూ3లో నమోదైన రూ.1,416 కోట్లతో పోలిస్తే 46 శాతం వృద్ధి

ఈ - కామ​ర్స్‌ రంగంపై అంతర్జాతీయ ఒప్పందం

Friday 25th January 2019

- పిలుపునిచ్చిన డబ్ల్యూటీఓ చీఫ్‌ - మరింత క్లిష్టంగా వాణిజ్య సవాళ్లు: ఐరాస - కృత్రిమ మేధపై నియంత్రణ: సత్య నాదెళ్ల దావోస్‌: వేగంగా మారుతున్న ప్రపంచంతో పాటు మారకపోతే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థలు, డబ్ల్యూటీఓ వంటి సంస్థలు కనుమరుగు కాక తప్పదని డబ్ల్యూటీఓ చీఫ్‌ రొబెర్టో అజెవెడో హెచ్చరించారు. దీనిని నివారించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. జోరుగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్‌ కోసం అంతర్జాతీయ బహుళపక్ష ఒప్పందం అవసరమన్నారు. ఇక్కడి అంతర్జాతీయ

Most from this category