STOCKS

News


ఈ షేర్లే నిఫ్టీని నడిపించాయ్‌

Wednesday 6th February 2019
Markets_main1549450094.png-24052

గతేడాది అక్టోబర్‌1 తర్వాత నిఫ్టీ ఈ బుధవారం 11,000 పాయింట్ల స్థాయిని అందుకుంది. అక్టోబర్‌ తర్వాత తీవ్ర పతనానంతరం ఈ ఏడాది జనవరి నుంచి మార్కెట్‌ క్రమేపీ పెరుగుతూ వచ్చింది. 50 షేర్లు భాగంగా కలిగిన నిఫ్టీ-50  గత అక్టోబర్‌ స్థాయిని అందుకోవడానికి కేవలం 15 షేర్లు మాత్రమే తోడ్పాటునందించాయి. అన్నింటికంటే అధికంగా 17.68 శాతం  యాక్సిస్‌ బ్యాంక్‌ ర్యాలీ జరపగా, 15.5 శాతంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ద్వితీయస్థానాన్ని ఆక్రమించింది. టైటాన్‌, ఇన్ఫోసిస్‌లు 14.5 శాతం పెరిగాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్‌, విప్రోలు 11.5 శాతం మేర ర్యాలీ జరిపాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌లు 8 శాతం చొప్పన పెరగ్గా, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ 7.8 శాతం ఎగిసింది. ఆసియన్‌ పెయిట్స్‌, యూపీఎల్‌, టెక్‌ మహింద్రాలు 5 శాతం వరకూ పెరిగాయి. కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌ 2 శాతం వరకూ లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ, హిందుస్థాన్‌ యూనీలీవర్‌లు 1 శాతం లోపు పెరిగాయి. నిఫ్టీలో మిగిలిన 35 షేర్లూ ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ నష్టాల్నే చవిచూసాయి. వీటిలో అత్యధికంగా ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 24.4 శాతం నష్టపోగా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 23.32 శాతం, వేదాంత 19.5 శాతం చొప్పున  క్షీణించాయి. మహింద్రా, గ్రాసిమ్‌, అల్రా‍్టటెక్‌ సిమెంట్‌, అదాని పోర్ట్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియాల నష్టాల శాతం కూడా రెండంకెల్లో వుంది. 



You may be interested

ఆల్‌టైం హైకి టెక్‌ మహీంద్రా

Wednesday 6th February 2019

ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా షేర్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ వెల్లడించిన క్యూ3 ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకున్నాయి. ఫలితంగా నేడు ఎన్‌ఎస్‌ఈలో షేరు గత ముగింపు(రూ.751.00)తో పోలిస్తే 4.50శాతం లాభంతో రూ.784.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్‌లో ఐటీ షేర్ల కొనుగోళ్ల సెంటిమెంట్‌ కారణంగా షేరు మరింత ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో 8.50శాతం లాభపడి రూ.814.50ల వద్ద

4నెలల గరిష్ట స్థాయి వద్ద ముగింపు

Wednesday 6th February 2019

ఐదోరోజూ లాభాల ముగింపే 11050పైన నిఫ్టీ ముగింపు 358 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలకు తోడు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లపై కోత ఉండచవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ప్రధాన రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సూచీలు 4నెలల గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. వరుసగా ఐదోరోజూ ర్యాలీ చేసిన సెన్సెక్స్‌ 358 పాయింట్లు లాభపడి 36,975 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లను

Most from this category