News


ఈ షేర్లలో ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌

Tuesday 9th October 2018
Markets_main1539082022.png-20983

సోమవారం ముగింపు ప్రకారం 15 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో టైటాన్‌, తల్వాకర్స్‌, భన్సాలీ ఇంజనీరింగ్‌, ఏస్టర్‌, గుజరాత్‌ పిప్‌వావ్‌, వైస్రాయ్‌ హోటల్స్‌, తైజారియా, మొరార్జి, టేక్‌ సొల్యూషన్స్‌, గోకుల్‌ ఆగ్రో తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడ్డ షేర్లివే...
మరోవైపు పలు షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో మెటల్స్‌ దిగ్గజాలు వేదాంత, హిండాల్కో, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌, అస్త్రమైక్రోవేవ్‌, టీడీ పవర్‌ సిస్టమ్స్‌, సైయంట్‌, వికాస్‌, ఇండియన్‌ టెర్రైన్‌, క్లిట్చ్‌ డ్రగ్స్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. 
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. You may be interested

టీసీఎస్‌ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Tuesday 9th October 2018

భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌ తన క్యు2 ఫలితాలను గురువారం ప్రకటించనుంది. దీంతో దేశీయ కార్పొరేట్‌ ప్రపంచంలో ఫలితాల సందడి షురూ కానుంది. భారీగా పతనమైన మార్కెట్లకు ఫలితాలు కొత్త ఆశలు ఇస్తాయని ఇన్వెస్టర్లు ఆశగా ఉన్నారు. టీసీఎస్‌ ఫలితాల విషయానికి వస్తే రూపీ క్షీణతతో కంపెనీ ఎబిటా మార్జిన్లు భారీగా మెరుగుపడి ఉంటాయని మెజార్టీ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి.  కంపెనీ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు.. - ఐడీబీఐ క్యాపిటల్‌: టీసీఎస్‌ నికరలాభంలో

మరింత పతనం మిగిలే ఉంది!

Tuesday 9th October 2018

నోమురా హెచ్చరిక భారత స్టాక్‌ మార్కెట్లలో మరో 5- 10 శాతం పతనం సంభవించే అవకాశాలను తోసిపుచ్చలేమని  ప్రముఖ బ్రోకరేజ్‌ దిగ్గజం నోమురా అభిప్రాయపడింది. దేశీయ మార్కెట్ల వాల్యూషన్లు ఇంకా ఖరీదుగానే ఉన్నాయని తెలిపింది. తాజా పతనంలో వాల్యూషన్లు కరిగిపోయినా, ఇంకా మరింత దిగిరావాల్సిఉందని పేర్కొంది. ఆగస్టులో 18.8 శాతమున్న వాల్యూషన్లు పతనానంతరం అక్టోబర్‌ నాటికి 16 శాతానికి దిగివచ్చాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి నిఫ్టీ 11892 పాయింట్లకు, సెప్టెంబర్‌

Most from this category