STOCKS

News


ఫలితాలు చూసి నిపుణులు మెచ్చిన షేర్లు ఇవే..!

Friday 9th November 2018
Markets_main1541750266.png-21822

గడిచిన నెలరోజుల్లో దేశీ సూచీలు 2 శాతానికి మించి లాభాలను సాధించాయి. ప్రత్యేకించి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాల వెల్లడి తరువాత సూచీలు భారీ లాభాలను నమోదుచేశాయి. అయితే, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 8 శాతం వరకు లాభపడిన నేపథ్యంలో ప్రధాన ఇండెక్స్‌లు ఫ్రెంట్‌లైన్‌ స్టాక్స్‌ను అవుట్‌పెర్ఫార్మ్‌ చేశాయి. మరోవైపు ఆకర్షణీయమైన విలువ, స్థిర ఆదాయాలు ప్రకటించిన పలు కంపెనీలు ప్రధాన సూచీలను మించి లాభపడ్డాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు మిశ్రమంగా ఉండగా.. కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి ఉన్న కారణంగా 2019 ఆర్థిక సంవత్సర నిఫ్టీ ఈపీఎస్‌ డౌన్‌గ్రేడ్‌ కావచ్చని పలువురు మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. ప్రస్తుత ఎర్నింగ్స్‌ గ్రోత్‌ పథం పరిమిత స్థాయిలోనే ఉందని, ఆదాయాలు పునరుద్ధరణకు మరో త్రైమాసికం సమయం పడుతుందని అంచనావేస్తున్నట్లు ఎడిల్‌వీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు. ఇదే సమయంలో బ్యాంకులు, ఫైనాన్షియల్‌ కంపెనీలు ఆకర్షణీయ క్యూ2 ఫలితాలను ప్రకటించాయని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు ప్రోత్సాహక పనితీరును కనబర్చినట్లు విశ్లేషించారు. డాలరుతో రూపాయి విలువ పతనం కావడం వల్ల విదేశీ వ్యాపారంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలకు ఈ క్వార్టర్‌ కలిసివచ్చిందన్నారు. ఇండస్ట్రియల్‌ రంగాలు మంచి పనితీరును కనబర్చాయని నార్నోలియా ఫైనాన్షియల్స్‌ అడ్వైజర్స్‌ వినీత శర్మ అన్నారు. బీమా రంగ కంపెనీలు అంచనాలు మించగా.. యాజమాన్య వ్యాఖ్యల ప్రకారం వృద్ధిరేటు ఇదే విధంగా కొనసాగేందుకు అవకాశం ఉన్నట్లు విశ్లేషించారు. ఆటోమొబైల్‌, మెటల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఉండగా.. ఎఫ్‌ఎంసీజీ అంచనాలను అందుకోలేకపోయిందన్నారు. అయినప్పటికీ గ్రామీణ ప్రాంత వృద్ధి నేపథ్యంలో ఇప్పటికీ ఈ రంగ షేర్లు ఆకర్షణీయంగానే ఉన్నట్లు విశ్లేషించారు. పవర్‌, ఇంధనం, సరుకు రవాణ ఖర్చులు పెరగడం.. సామర్థ్య వినియోగం తగ్గడం వంటి కారణాల వల్ల ఈ క్వార్టర్‌లో సిమెంట్‌ రంగ కంపెనీల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. ఫలితాల తరువాత 2019 ఆర్థిక సంవత్సర నిఫ్టీ ఈపీఎస్‌ 15 నుంచి 12 శాతానికి పడిపోతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి మిశ్రమ ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన నాణ్యమైన షేర్లను మాత్రమే కొనుగోలు చేయడం బెటరని సూచించారు. ఈ ఫలితాల ఆధారంగా పలు బ్రోకింగ్‌ సంస్థలు మొత్తంగా 15 షేర్లు ఏడాదికాలంలో 50 శాతం వరకు రాబడిని అందించగలవని సూచిస్తున్నారు. అవేంటంటే.. 

వచ్చే ఏడాది కాలంలో 10-50 శాతం వరకు రాబడిని అందించగిలిన 15 షేర్లు..

కోట మహీంద్రా బ్యాంక్
ఇంతకుముందు ఈ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చిన సీఎల్‌ఎస్‌ఈ ఫలితాల అనంతరం రేటింగ్‌ను సవరించింది. అవుట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ ఇచ్చి టార్గెట్‌ ధర రూ.1,420 వద్ద నిర్ణయించినట్లు తెలిపింది. ప్రస్తుత స్థాయి నుంచి వచ్చే ఏడాది కాలంలో 25 శాతం వరకు రాబడిని అందించగలదని విశ్లేషించింది. 

మారికో
నూట్రల్‌ నుంచి అవుట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసినట్లు మాక్వైరీ ప్రకటించింది. రూ.376 టార్గెట్‌ ధరను ఇచ్చింది.

ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్‌
నూట్రల్‌ నుంచి అవుట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌కు సవరించినట్లు క్రెడిట్‌ సూసీ తెలిపింది. రూ.165 టార్గెట్‌ ధరను ఇచ్చింది. 2019-20 ఎర్నింగ్స్‌ అంచనా 6-12 శాతంగా వెల్లడించింది.

యునైటెడ్ స్పిరిట్స్
మోర్గాన్ స్టాన్లీ ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ ఇచ్చింది. వచ్చే ఏడాదికాలంలో టార్గెట్‌ ధర రూ.700. అమ్మకాలు పెరుగుతుండడం, వ్యయం తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో టార్గెట్‌ ధరను రూ.650 నుంచి పెంచినట్లు తెలిపింది.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్
అక్యూమిలేట్‌కు ఎమ్కే రీసెర్చ్‌ షేరును అప్‌డేట్‌ చేసింది. ఉత్పత్తి తమ అంచనాను మించి ఉండడం కారణంగా టార్గెట్‌ ధరను రూ.352 నుంచి రూ.402 వద్దకు పెంచినట్లు తెలిపింది. 

భారతీ ఎయిర్‌టెల్
రెండవ అతిపెద్ద టెలికం సేవల సంస్థగా ఉన్న ఎయిర్‌టెల్‌ రేటింగ్‌ను హోల్డ్‌ నుంచి ‘బై’ కు సవరించినట్లు డాయిచీ బ్యాంక్‌ తెలిపింది. రూ.425 టార్గెట్‌ ధరను ఇచ్చింది. దేశీ సేవలతో పాటు ఆఫ్రికా వ్యాపారం కూడా మెరుగుపడడం ఆధారంగా ఈ రేటింగ్‌ ఇచ్చినట్లు తెలిపింది.

అదానీ పోర్ట్స్
నూట్రల్‌ నుంచి అవుట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసినట్లు మాక్వైరీ ప్రకటించింది. రూ.358 టార్గెట్‌ ధరను ఇచ్చింది. 2019-21 కాలంలో ఎర్నింగ్స్‌ వృద్ధి 0-5 శాతం వరకు ఉండవచ్చని, వచ్చే ఏడాది ద్వితియార్థం నుంచి వృద్ధి మెరుగుపడవచ్చని భావిస్తోంది.

మైండ్‌ట్రీ
ఈ ఐటీ సంస్థకు జేపీ మోర్గాన్‌ ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ ఇచ్చింది. రూ.1,050 టార్గెట్‌గా తెలిపింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
యాడ్‌ నుంచి లాంగ్‌కు సవరించినట్లు ఈక్విరస్‌ తెలిపింది. రూ.2,340 టార్గెట్‌ ధరను ఇచ్చింది.

ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్
నూట్రల్‌ నుంచి అవుట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌కు సవరించినట్లు క్రెడిట్‌ సూసీ తెలిపింది. రూ.1,375 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ఎర్నింగ్స్‌ అంచనా 11-12 శాతంగా వెల్లడించింది. 

హేక్సావేర్‌ టెక్నాలజీస్
హోల్డ్‌ నుంచి బై రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసినట్లు మేబ్యాంక్ వెల్లడించింది. రూ.470 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ఫండమెంటల్స్‌ మెరుగుపడడం ఆధారంగా రేటింగ్‌ పెంచినట్లు తెలిపింది.

కాల్గేట్ పామోలివ్
ఇంతకుముందు ఈ షేరుకు సెల్‌ రేటింగ్‌ ఇచ్చిన సీఎల్‌ఎస్‌ఈ ఫలితాల అనంతరం రేటింగ్‌ను సవరించింది. రూ.1,265 టార్గెట్‌ ధరతో బై రేటింగ్‌ ఇచ్చింది.

సెయిల్
రెడ్యూస్‌ నుంచి బై రేటింగ్‌కు సవరించినట్లు ఎడిల్‌వీస్‌ ప్రకటించింది. రూ.87 వద్ద టార్గెట్‌ ధరను ఇచ్చింది.

గ్రీవ్స్ కాటన్
కొటక్ సెక్యూరిటీస్ ఈ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చింది. రూ.146 వద్ద టార్గెట్‌ ధరను ప్రకటించింది.

సొనటా సాఫ్ట్‌వేర్
ఆనంద్ రాఠీ ఈ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చింది. రూ.370 వద్ద టార్గెట్‌ ధరను ప్రకటించింది. 

ఇవి కేవలం పలు బ్రోకింగ్‌ సంస్థల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.
 You may be interested

పరిస్థితులు మారుతున్నాయ్‌.. కొనడానికి రెడీనా?

Friday 9th November 2018

క్రూడ్‌ ధరలు దిగిరావడం, లిక్విడిటీ సమస్యలు తగ్గడం వంటి సానుకూలతల నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోలుకు అవకాశాలున్నాయని ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌) నిశ్చల్‌ మహేశ్వరి తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో కొనుగోలుదారుడిగానే ఉంటాను. కేవలం ముడిచమురు ధరలు మాత్రమే కాదు.. దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. డాలర్‌ కూడా బలహీనపడుతోంది. ఇది మరొక

ఐటీ షేర్లకు రూపాయి ఝలక్‌

Friday 9th November 2018

డాలర్‌ మారకంలో రూపాయి అనూహ్య రివకరీ ఇంట్రాడేలో ఐటీ షేర్లకు ఝలక్‌ ఇచ్చింది. నేడు ముడి చమురు ధరలు తగ్గడం, బాండ్‌ ఈల్డ్‌ పెరగడం తదితర అంశాలు రూపాయి ర్యాలీకి కారణమయ్యాయి. రూపాయి బలపడంతో డాలర్ల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ఐటీ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈ ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(14674.45)తో పోలిస్తే

Most from this category