STOCKS

News


ఈపీఎస్‌ వృద్ధి ఉన్న 15 షేర్లు..!

Thursday 12th July 2018
Markets_main1531376109.png-18241

  • నిఫ్టీ 50లోని 15 షేర్లలో 40 శాతం ఈపీఎస్‌ వృద్ధి అంచనా

ముంబై: అంచనాలను మించిన లాభాలతో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ను ప్రారంభించింది. గడిచిన మూడేళ్లపాటు ఫ్లాట్‌ ఎర్నింగ్స్‌ వృద్ధిరేటును కనబరిచిన ఈ ఐటీ దిగ్గజం.. మెరుగైన ఆర్థిక ఫలితాలతో కొత్త ఆర్థిక సంవత్సరంలోనికి అడుగుపెడుతునట్లు ప్రకటించింది. క్యూ1లో ఈ సంస్థ నికర లాభం 23 శాతం వృద్ధి చెందిన నేపథ్యంలో వచ్చే రెండేళ్లు కూడా ఇదే జోరును ప్రదర్శించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. సెన్సెక్స్‌ జీవితకాల గరిష్టస్థాయికి చేరుకోవడం, నిఫ్టీ 11,000 పాయింట్లను అధిగమించడం లాంటి సానుకూల వాతావరణంలో నిఫ్టీ సునాయాసంగా జీవితకాల గరిష్టస్థాయి అయిన 11,171 పాయింట్లను దాటుకుని ర్యాలీ చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. 2018లో ఇప్పటివరకు 4 శాతం రాబడిని ఇచ్చిన సూచీలు వచ్చే 1-2 నెలల్లో మరింత ముందుకు చేరుకునే అవకాశం ఉండగా ఇందుకు లార్జ్‌క్యాప్‌ షేర్లలో రికవరీ ఊతంగా నిలవనుందని భావిస్తున్నారు. నిఫ్టీ 50 సూచీలోని 15 కంపెనీలు వచ్చే 12 నెలలకాలంలో 40 శాతం ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌ (ఈపీఎస్‌) వృద్ధిని నమోదుచేసేందుకు అవకాశం ఉందని రాయిటర్స్ అంచనావేస్తోంది. యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, భారతి ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు వచ్చే 12 నెలలకాలంలో కనీసం 40 శాతానికి మించి ఈపీఎస్‌ వృద్ధిరేటును ప్రకటించే అవకాశం ఉండగా.. వీటిలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఏకంగా 1715 శాతం, కోల్‌ ఇండియా 133 శాతం, టాటా మోటార్స్ 115 శాతం, టాటా స్టీల్ 103 శాతం ఈపీఎస్‌లో వృద్ధిని ప్రకటించవచ్చని రాయిటర్స్‌ అంచనావేసింది. 

కంపెనీ సాధించిన లాభాలను షేర్‌ హోల్డర్లకు పంచడమే ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌ కాగా.. షేరు ధర, ఈపీఎస్‌ కలిసి ఒక జట్టుగా ప్రయాణం చేస్తాయని సామ్కో సెక్యూరిటీస్‌ వ్యవస్థాపక సీఈఓ జీమెత్‌మోదీ వివరించారు. ఫండమెంటల్‌గా బుల్‌ మార్కెట్‌లో ఈపీఎస్‌ చాలా ప్రధానమన్నారు. బజాజ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌లు స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నట్లు వెల్లడించారు. ఒక కంపెనీ 15 శాతానికి మించి ఈపీఎస్‌ సాధిస్తే అది కచ్చితంగా బెస్ట్‌ బెట్‌ అవుతుందని వివరించిన కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్ కాపిటల్‌ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రితీష్‌ అషర్.. రాయిటర్స్ సూచించిన షేర్లలో ప్రస్తుత స్థాయిల వద్ద ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆకర్షణీయ రాబడిని పొందవచ్చని సూచించారు. You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాప్‌ @100 బిలియన్‌ డాలర్లు

Thursday 12th July 2018

వరుసగా 5రోజూ ర్యాలీ చేస్తున్న రిలయన్స్‌ షేర్లు సరికొత్త  హైని నమోదు చేసిన షేర్లు ముంబై:- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గురువారం 100 బిలియన్‌ డాలర్లు మార్కును చేరుకుంది. దేశంలోనే టీసీఎస్‌ తరువాత 100 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకున్న రెండో కంపెనీగా రిలయన్స్‌ కంపెనీ రికార్డు సృష్టించింది. నేటి బీఎస్‌ఈ ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 5శాతం లాభపడటంతో కంపెనీ విలువ 6.87లక్షల కోట్లకు అంటే 100 బిలియన్‌ డాలర్ల పైకి చేరుకుంది.

27వేల ఎగువకు బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 12th July 2018

ఇంట్రాడేలో 350 పాయింట్ల లాభం ముంబై:- సూచీలు సరికొత్త రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌​పరుగులు పెడుతోంది. నిఫ్టీ బ్యాంకు గురువారం 26,937  వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఈ సూచీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు 2నుంచి 1శాతం ర్యాలీ అండతో ఇంట్రాడేలో 27000 మార్కును అధిగమించింది. అదే ఊపుతో 350 పాయింట్లు లాభపడి లాభపడి 27,164 ఇంట్రాడే

Most from this category