STOCKS

News


ఈ స్టాకుల్లో ఏంఏసీడీ బుల్లిష్‌

Tuesday 10th July 2018
Markets_main1531210645.png-18167

ఈ వారం సూచీలు తిరిగి బుల్‌ మూడ్‌లోకి మారాయి. అంతర్జాతీయంగా పాజిటివ్‌ సంకేతాలు దేశీయ సూచీలను ముందుకు నడిపించాయి. ఈ నేపథ్యంలో సోమవారం ముగింపు చార్టుల్లో 132 కంపెనీల షేర్లు పాజిటివ్‌ సంకేతాలు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ స్టాకుల్లో ఎంఏసిడి ఇండికేటర్‌ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఈ విధంగా ఎంఏసిడి సూచిక పాజిటివ్‌గా మారిన స్టాకుల్లో ఎల్‌ అండ్‌టీ, బీఓబీ, జిందాల్‌స్టీల్‌ అండ్‌ పవర్‌ఱ, హెక్సావేర్‌ టెక్నాలజీ, యాక్సిస్‌ బ్యాంక్‌, కర్నాటక బ్యాంక్‌, అపోలోటైర్స్‌, ఓబీసీ, ఎంఅండ్‌ఎం, డీసీబీ బ్యాంక్‌, టాటాపవర్‌, గుజరాత్‌నర్మదా వ్యాలీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, మార్కసాన్స్‌ ఫార్మా, యూపీఎల్‌, జీఎస్‌ఎఫ్‌సీ, బీఎఫ్‌ యుటిలిటీస్‌, మహానగర్‌ గ్యాస్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, పూర్వాంకర, జమన్నా ఆటో తదితర కంపెనీలున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఇప్పటికే వీటిలో కొన్ని షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే నమ్ముకోకుండా ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  మరోవైపు సోమవారం చార్టుల్లో ఇన్ఫోసిస్‌, అపోలో హాస్పిటల్స్‌, జ్యోతీ ల్యాబ్స్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, ఐనాక్స్‌ విండ్‌, ఏఎంజే లాండ్‌హోల్డింగ్స్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ సహా 13 కంపెనీల స్టాకుల్లో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. నిఫ్టీ 10850 పాయింట్లను కాపాడుకున్నంత వరకు అప్‌మూవ్‌కే అవకాశాలుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 You may be interested

మూడోరోజూ ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల ర్యాలీ

Tuesday 10th July 2018

ముంబై:- వరుసగా మూడోరోజూ ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు పటిష్టమైన ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగషేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ సూచి మంగళవారం ఇంట్రాడేలో 2శాతానికి పైగా లాభపడింది. మధ్యాహ్నం గం.2:00 ని.లకు నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.36శాతం లాభపడి 2,854 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలోని మొత్తం 12 షేర్లకు గానూ ఒక్క ఐడీబీఐ షేరు తప్ప.., మిగతా అన్ని షేర్లు అన్ని

24 శాతం పెరిగిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం

Tuesday 10th July 2018

ముంబై: ప్రైవేట్‌ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.1,036 కోట్ల నికర లాభం సాధించామని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది.  గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఆర్జించిన నికర లాభం రూ.837 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ రమేశ్‌ సోబ్తి చెప్పారు.

Most from this category