News


125 స్టాకుల్లో బుల్లిష్‌ ఎంఏసీడీ క్రాసోవర్‌

Tuesday 2nd April 2019
Markets_main1554195475.png-24929

దేశీయ సూచీల్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయని టెక్నికల్‌ చార్టులు చూపుతున్నాయి. సోమవారం ముగింపు ప్రకారం 125 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జిందాల్‌స్టీల్‌, అపోలోటైర్స్‌, జేకే టైర్స్‌, యూకో బ్యాంక్‌, ఐఓబీ, లుపిన్‌, మార్క్‌సన్స్‌ ఫార్మా, పీఎన్‌బీ హౌసింగ్‌, గృహ్‌ ఫైనాన్స్‌, ఐఎఫ్‌సీఐ, టీవీఎస్‌ మోటర్స్‌, హిందుస్థాన్‌జింక్‌, రైన్‌ ఇండస్ట్రీస్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 27 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ఎన్‌టీపీసీ, ఐఓసీ, ఐటీసీ, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఆర్‌ఈసీ, బాటా, వోల్టాస్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, రెప్కో హోమ్స్‌షేర్లలో ఎంఏసీడీ నెగిటివ్‌ సంకేతాలు ఇస్తోంది. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. You may be interested

ఎఫ్‌ఐఐలు మక్కువ చూపుతున్న షేర్లివే!

Tuesday 2nd April 2019

మార్చినెల్లో విదేశీ మదుపరులు దేశీ మార్కెట్లో నిధుల వెల్లువ పారించారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎఫ్‌ఐఐలు 1.50 లక్షల కోట్ల రూపాయల నికర కొనుగోళ్లు, 1.16 లక్షల కోట్ల రూపాయల నికర అమ్మకాలు జరిపారు. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చిల్లో ఎఫ్‌ఐఐలు విపరీతంగా కొనుగోళ్లు జరిపాయి. దీంతో సూచీలు ఒక్కమారుగా ర్యాలీ జరిపి రికార్డులను చేరుకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో రేట్‌కట్‌ నిర్ణయాలు వస్తే భారత ఈక్విటీల్లోకి మరింతగా

కొనసాగుతున్న రిలయన్స్‌ ర్యాలీ

Tuesday 2nd April 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల ర్యాలీ మంగళవారం కొనసాగింది. నేడు బీఎస్‌ఈలో రూ.1396.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇంధన రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఈ షేరు లాభాల బాట పట్టింది. ఫలితంగా ఇంట్రాడేలో 0.85శాతం పెరిగి రూ.1402.70ల స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం గం.1:15ని.లకు షేరు గత ముగింపు ధరతో పోలిస్తే 0.25శాతం లాభంతో రూ. 1396ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ షేరు నిన్నటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో

Most from this category