STOCKS

News


ఈ షేర్లలో ‘శాంతా ర్యాలీ’

Tuesday 18th December 2018
Markets_main1545114343.png-23040

బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచిన ఎంఏసీడీ ఇండికేటర్‌
మార్కెట్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. తాజా పరుగు  చూస్తుంటే సూచీల్లో శాంతా ర్యాలీ ఆరంభమైనట్లుందని అంచనా వేస్తున్నారు. సోమవారం ముగింపు ప్రకారం 121 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో వొడాఫోన్‌ ఐడియా, సెయిల్‌, టాటా స్టీల్‌, జేఎంటీ ఆటో, లింక్‌ పెన్‌, టీవీఎస్‌ శ్రీచక్ర, కళ్యాణి స్టీల్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, హడ్కో, బామెర్‌లౌరీ, జస్ట్‌డయిల్‌, ప్రకాష్‌ఇండస్ట్రీస్‌, గాబ్రియేల్‌ ఇండియా, సాస్కెట్‌ టెక్‌, లెమన్‌ట్రీ, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 


బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడ్డ షేర్లివే...
మరోవైపు 11 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో మహీంద్రా లాజిస్టిక్స్‌, యాక్సెల్యాకాలె, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, పీఐ ఇండీస్ట్రీస్‌, వీఐపీ, మనక్సియా స్టీల్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. 
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. You may be interested

లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Tuesday 18th December 2018

మార్కెట్‌ మంగళవారం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఇంట్రాడేలో పలు ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1శాతం ర్యాలీ చేసింది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్‌ నియామకం ప్రభుత్వరంగ బ్యాంకులకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్‌బీఐ అనుసరిస్తున్న కఠినవైఖరిని సడలించడంతో పాటు, మొండి బకాయిలతో కష్టాల్లో ఉన్న బ్యాంకులకు మూలధనం

ఎగిసిన పసిడి ధర

Tuesday 18th December 2018

అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన భయాలు పసిడి ధరను పరుగులు పెట్టించాయి. ఫలితంగా నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో పసిడి ధర 11డాలర్లు ర్యాలీ చేసింది. గత రెండువారాల్లో ఒకేరోజులో పసిడి ఇంతస్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. రాత్రి అమెరికా మార్కెట్లో వడ్డీరేట్ల పెంపు భయాలతో పాటు ఆర్థిక వృద్ధి నెమ్మదించదనే కారణంతో అక్కడి స్టాక్‌మార్కెట్లు 19నెలల కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో అక్కడి మార్కెట్లో పసిడి ధర ఇంట్రాడేలో 1,252.20 గరిష్టాన్ని

Most from this category