STOCKS

News


ఈ స్టాక్స్‌పై ప్రమోటర్లు, ఎఫ్‌పీఐలు, డీఐఐల మక్కువ

Friday 26th April 2019
Markets_main1556217187.png-25348

రిటైల్‌ ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్‌ను ఎంచుకోవాలన్న మీమాంసతో ఉంటే, అటువంటి వారు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి. ఓ కంపెనీలో ప్రమోటర్లు వాటా పెంచుకుంటే అది సానుకూల సంకేతమే అవుతుంది. అలాగే, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(డీఐఐలు) సైతం ఓ కంపెనీలో వాటాలు పెంచుకుంటున్నారంటే ఆ కంపెనీ భవిష్యత్తు వ్యాపార వృద్ధి అవకాశాలపై స్పష్టమైన అవగాహనతో ఆ పని చేస్తున్నట్టుగానే భావించాలి. అలా చూసినప్పుడు 12 స్టాక్స్‌లో ప్రమోటర్లతోపాటు డీఐఐలు, ఎఫ్‌పీఐలు కూడా వాటాలు పెంచుకుంటున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా అందరూ వాటాలు పెంచుకుంటున్నారంటే అది ఆయా కంపెనీలకు సంబంధించి భవిష్యత్తు సానుకూలతను తెలియజేసేదిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

 

2018 డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే 2019 మార్చి త్రైమాసికంలో ప్రమోటర్లు, డీఐఐలు, ఎఫ్‌పీఐల వాటాలు పెరిగిన కంపెనీల్లో జస్ట్‌ డయల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జేఎం ఫైనాన్షియల్‌, నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌, హిందుస్తాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, నవభారత్‌ వెంచర్స్‌, రామకృష్ణ ఫోర్జింగ్స్‌, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌, సెలాన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ టెక్నాలజీ, ప్లాస్టిబ్లెండ్స్‌ ఇండియా ఉన్నాయి. అయితే, వాటాల పెరుగుదల స్వల్పంగానే ఉండడం గమనించాల్సిన అంశం. ఆర్‌ఐఎల్‌లో ప్రమోటర్ల వాటా 47.19 శాతం నుంచి 47.27 శాతానికి పెరిగింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా 4.24 శాతం నుంచి 4.48 శాతానికి, విదేశీ ఇన్వెస్టర్ల వాటా 24.02 శాతం నుంచి 24.39 శాతానికి పెరిగాయి. ‘‘ప్రమోటర్లు వాటాలు పెంచుకోవడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఇనిస్టిట్యూషన్స్‌ కూడా వాటాలు పెంచుకుంటున్నాయంటే అది మరింత నమ్మకాన్ని పెంచేదే’’ అని మార్కెట్‌ అనలిస్ట్‌ అంబరీస్‌ బలిగ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రమోటర్లు, ఇనిస్టిట్యూషన్స్‌ వాటా పెంచుకుంటున్నాయన్న ఒక్క అంశాన్నే చూసి ఇన్వెస్ట్‌ చేయకుండా, ఆయా కంపెనీల ఆర్థిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తు‍న్నారు.You may be interested

ఎఫ్‌అండ్‌వో నుంచి 34 బయటకు... వీటి పట్ల జాగ్రత్త!

Friday 26th April 2019

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ మార్కెట్‌ నుంచి జూన్‌ సిరీస్‌ తర్వాత 34 కంపెనీలు కనిపించవు. ఈ కంపెనీల సెక్యూరిటీలను ఎఫ్అండ్‌వో నుంచి తొలగించాలని నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని చాలా మంది నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ కంపెనీల స్టాక్స్‌కు దూరంగా ఉండాలని కూడా వారు సూచిస్తున్నారు.    ఎఫ్‌అండ్‌వో నుంచి కనుమరుగయ్యే వాటిల్లో అలహాబాద్‌ బ్యాంకు,  అజంతా ఫార్మా, బీఈఎంఎల్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, సియట్‌, సీజీ పవర్‌ అండ్‌

మళ్లీ అమ్మకాలు...సెన్సెక్స్‌ 323 పాయింట్లు డౌన్‌

Thursday 25th April 2019

  11650 దిగువున ముగిసిన నిఫ్టీ క్రితం రోజు కదంతొక్కిన స్టాక్‌ సూచీలు గురువారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 323 పాయింట్లు నష్టపోయి 38,730.86 వద్ద, నిఫ్టీ 84.35 పాయింట్లు కోల్పోయి 11,642 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడిచమురు ధర ఈ ఏడాదిలో తొలిసారి 75డాలర్ల పైకి చేరడం, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 37 పైసలు కరిగిపోవడంతో పాటు చివరి గంట అమ్మకాలు వెల్లువెత్తి మార్కెట్‌

Most from this category