STOCKS

News


మార్కెట్‌ పడ్డా.. ఈ షేర్లలో రిటర్న్స్‌కు ఛాన్స్‌!!

Monday 10th September 2018
Markets_main1536565981.png-20128

మార్కెట్లు సోమవారం ఢమాల్‌ అంటున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ బాగా పడిపోతున్నాయి. రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి పడిపోవడం ఇందుకు కారణం. వాణిజ్య ఉద్రిక్తతలు, క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్‌ ఉండొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి సమయాల్లో ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనే ప్రశ్న మదిలో మెదిలో ఉంటుంది. మీ ప్రశ్నకు సమాధానమే ఈ స్టాక్స్‌. పలు బ్రోకరేజ్‌ సంస్థలు వచ్చే మూడు వారాల్లో లాభాలందించే 12 స్టాక్స్‌ను సిఫార్సు చేశాయి. అవేంటో చూద్దాం.. 

చార్ట్‌వ్యూఇండియా.ఇన్‌ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ (టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ) మజ్హర్‌ మహ్మద్‌
స్టాక్‌: ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: 297
స్టాప్‌ లాస్‌: రూ.267
ఇటీవల కాలంలో ఈ స్టాక్స్‌ రూ.245 నుంచి రూ.304 ర్యాలీ చేసింది. రూ.304 జీవిత కాల గరిష్ట స్థాయి. స్టాక్‌ తర్వాత రూ.245-304 ర్యాలీలో 80 శాతంమేర కరెక‌్షన్‌కు గురైంది. అలాగే ఇది వరుసగా మూడు పాజిటివ్‌ క్లోజింగ్స్‌ను ఏర్పరచింది. అందువల్ల ఇందులో లాంగ్‌ పొజిషన్స్‌కు మంచి అవకాశముంది. రూ.270 వద్ద షార్ట్‌టర్మ్‌ బాటమ్‌ ఉంది. పొజిషనల్‌ ట్రేడర్లు రూ.267 స్టాప్‌లాస్‌తో రూ.297 టార్గెట్‌ ప్రైస్‌ వద్ద ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

స్టాక్‌: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.410
స్టాప్‌ లాస్‌: రూ.360
వీక్లి చార్ట్‌లో గత మూడు వారాలుగా ఈ స్టాక్‌ దాదాపు రూ.375 స్థాయిలోనే క్లోజవుతోంది. అంటే ఈ స్థాయిలో బాటమ్‌ను సూచిస్తోంది. రూ.358 కనిష్ట స్థాయిని తాకిన తర్వాత గత రెండు సెషన్లలో స్టాక్‌ ధర కదలికలను గమనిస్తే.. ఇది పుల్‌బ్యాక్‌ మోడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. రూ.414 టార్గెట్‌వైపు కదిలే అవకాశముంది. రూ.385 స్థాయిలో కొంత అమ్మకాల ఒత్తిడి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒకవేళ కొంత అప్‌స్వింగ్‌ కనిపిస్తే అప్పుడు బుల్స్‌ పట్టు కొనసాగిస్తాయి.  

స్టాక్‌: వెల్‌స్పన్‌ ఇండియా
రేటింగ్‌: కొనొచ్చు 
టార్గెట్‌ ప్రైస్‌: రూ.89
స్టాప్‌ లాస్‌: రూ.70
ఈ స్టాక్‌ 2016 జూన్‌లో రూ.120 జీవిత కాల గరిష్ట స్థాయికి తాకింది. తర్వాత కన్సాలిడేట్‌ అవుతూ వచ్చింది. ఇటీవల కాలంలో రూ.72 స్థాయికి కూడా పడిపోయింది. ఈ స్థాయికి పైన కొనసాగితే రూ.89 టార్గెట్‌కు చేరుకునే అవకాశముంది. 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ వినయ్‌ రజని
స్టాక్స్‌: ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.640
స్టాప్‌ లాస్‌: రూ.585
ఈ స్టాక్‌ శుక్రవారం ట్రేడింగ్‌లో మంచి వ్యాల్యూమ్స్‌తో 3 శాతానికిపైగా పెరిగింది. ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి 11 శాతంమేర కరెక‌్షన్‌ అయిన తర్వాత స్టాక్‌ మళ్లీ అప్‌ట్రెండ్‌ను దక్కించుకుంది. అన్ని కీలక మూవింగ్‌ యావరేజ్‌లకు పైన ట్రేడ్‌ అవుతోంది. వీక్లి, మంత్లీ చార్ట్స్‌లో ఇండికేటర్లు, అస్కిలేటర్లు కూడా బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచిస్తున్నాయి.   

స్టాక్‌: లుపిన్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,020
స్టాప్‌ లాస్‌: 925
వీక్లి చార్ట్‌లో ఈ స్టాక్‌ బుల్లిస్‌ ఇన్‌వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్జర్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. మంచి వ్యాల్యూమ్స్‌తో స్టాక్‌ ధర 4.5 శాతంమే పెరిగింది. అస్కిలేటర్‌, ఇండికేటర్‌ బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఫార్మా రంగం మంచి పనితీరు కనబరుస్తోంది. ప్రస్తుతం ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చు. 2017 నవంర్‌ 6 నుంచి గరిష్ట స్థాయిలో స్టాక్‌ ధర క్లోజయ్యింది. 

స్టాక్‌: టాటా కెమికల్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.798
స్టాప్‌ లాస్‌: 734
ఈ స్టాక్‌ ఆగస్ట్‌లో కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిలను నమోదు చేసింది. రూ.745 కీలకమైన నిరోధ స్థాయిని అధిగమించింది. చిన్న కరెక‌్షన్‌ తర్వాత మళ్లీ బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగించింది. అన్ని కీలకమైన మూవింగ్‌ యావరేజ్‌లకు పైన ట్రేడవుతోంది. వీక్లి, మంత్లీ చార్ట్స్‌లో ఇండికేటర్లు, అస్కిలేటర్లు బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచిస్తున్నాయి.

ప్రభుదాస్‌ లీలాధర్‌ సీనియర్‌ టెక్నిలకల్‌ అనలిస్ట్‌ వైశాలి పరేఖ్‌
స్టాక్‌: మహీంద్రా అండ్‌ మహీంద్రా
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,060
స్టాప్‌ లాస్‌: రూ.930
డైలీ చార్ట్‌లో రూ.915 స్థాయిలో ఈ స్టాక్‌ హైయర్‌ బాటమ్‌ను ఏర్పరచింది. పాజిటివ్‌ బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇది రానున్న రోజుల్లో పెరుగుదలను సూచిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ బై సిగ్నల్‌ ఇస్తోంది. 

స్టాక్‌: బజాజ్‌ ఫైనాన్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.3,000
స్టాప్‌ లాస్‌: రూ.2,650
రూ.2,994 గరిష్ట స్థాయి నుంచి రూ.2,670కి పడిపోయిన తర్వాత ఈ స్టాక్‌ డైలీ చార్ట్‌లో హైయర్‌ బాటమ్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. ఇది బౌన్స్‌బ్యాక్‌ను సూచిస్తోంది. రూ.3,000 స్థాయికి చేరొచ్చు. ఆర్‌ఎస్ఐ కూడా బై సిగ్నల్‌ ఇస్తోంది. 

స్టాక్‌: వాటెక్‌ వాబాగ్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.450
స్టాప్‌ లాస్‌: రూ.374
ఈ స్టాక్‌ రూ.390 స్థాయిల్లో కొంత కాలం కన్సాలిడేట్‌ అవ్వొచ్చు. ఇది 34 వారాల మూవింగ్‌ యావరేజ్‌, 50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌లకు పై స్థాయిలో ఉంది. పాజిటివ్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. రేంజ్‌బాండ్‌కు పైన బ్రేక్‌ ఔట్‌ అయ్యే అవకాశముంది. ర్యాలీ జరపొచ్చు. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా ఉంది. 

యస్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆదిత్య అగర్వాల్‌
స్టాక్‌: అల్కెమ్‌ ల్యాబొరేటరీస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,315-2,410
స్టాప్‌ లాస్‌: రూ.2,120
వీక్లి చార్ట్‌లో ఈ స్టాక్‌ రూ.2,215 వద్ద ఉన్న సిమెట్రియల్‌ ట్రైయాంగిల్‌ ప్యాట్రన్‌ నెక్‌లైన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌కు సిద్ధంగా ఉంది. ఈ నిరోధ స్థాయికి పైన మంచి వ్యాల్యూమ్స్‌తో స్థిరమైన ట్రేడ్‌ ఉంటే స్టాక్‌ ధర రూ.2,315-2,410 స్థాయిలకు చేరొచ్చు. ఆర్‌ఎస్‌ఐ పైకి టర్న్‌ తీసుకుంది. 

స్టాక్‌: మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.315-335
స్టాప్‌ లాస్‌: రూ.260
డైలీ చార్ట్‌లో ఈ స్టాక్‌ అసెండింగ్‌ ట్రైయాంగిల్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. ఆర్‌ఎస్‌ఐ అప్‌ టర్న్‌ తీసుకుంది. రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో అప్‌ట్రెండ్‌ ఉండొచ్చు.

స్టాక్‌: బంధన్‌ బ్యాంక్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.705-735
స్టాప్‌ లాస్‌: రూ.617
డైలీ చార్ట్‌లో ఈ స్టాక్‌ రూ.680 వద్ద ఉన్న ట్రెండ్‌లైన్‌ రెసిస్టెన్స్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అవ్వడానికి సిద్ధంగా ఉంది. రూ.680కి పైన స్థిరమైన ట్రేడిండ్‌ ఉంటే అప్పుడు ఇది రూ.705-735 స్థాయికి వెళ్లొచ్చు. ఆర్‌ఎస్‌ఐ అప్‌ టర్న్‌ తీసుకుంది. రానున్న రోజుల్లో అప్‌ట్రెండ్‌ ఉంటుంది. You may be interested

లాభాల్లో ఐటీ ఇండెక్స్‌

Monday 10th September 2018

మిగిలిన ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే..! ముంబై:- రూపాయి భారీ పతనంతో మిడ్‌ సెషన్‌ సమయానికి మార్కెట్‌ నష్టపోయింది. ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి 72.49 వద్ద కొత్త కనిష్ట స్థాయికి క్షీణించింది. ఫలితంగా సెన్సెక్స్‌ 400 పాయింట్ల నష్టపోయి 38 వేల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 130 పాయింట్ల నష్టపోయి 11450 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి దెబ్బకి అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఒక్క ఐటీ

యాక్సిస్‌ బ్యాంక్‌... ఆల్‌టైమ్‌ హై

Monday 10th September 2018

ముంబై:- కొత్త ఛైర్మన్‌గా అమితాబ్ చౌదరి నియామకం ఖరారు కావడంతో యాక్సిస్ బ్యాంకు షేరు సోమవారం ఆల్‌టైం హైని తాకింది. నేడు బీఎస్‌ఈలో యాక్సి్‌స్‌ బ్యాంకు షేరు రూ.645.15ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుత ఎండీ, సీఈవో శిఖా శర్మ స్థానంలో అమితాబ్ చౌదరిని నియమిస్తున్నట్లు శనివారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్నట్టు యాక్సిస్‌ బ్యాంకు ప్రకటించింది. ఈ వార్తల నేపథ్యంలో నేటి ఇంట్రాడే షేరు ఏకంగా 5శాతం లాభపడి

Most from this category