STOCKS

News


మిడ్‌టర్మ్‌ కోసం డజన్‌ సిఫార్సులు

Monday 18th March 2019
Markets_main1552897369.png-24668

మిడ్‌టర్మ్‌ కోసం డజన్‌ సిఫార్సులువచ్చే రెండు మూడు వారాల సమయంలో మంచి రాబడినందించే షేర్లను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
ప్రభుదాస్‌ లీలాధర్‌ సిఫార్సులు:
1. భెల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 75. స్టాప్‌లాస్‌ రూ. 63. ఇటీవలే రూ.71 నుంచి రూ. 66 వరకు పతనమైంది. తాజాగా ట్రెండ్‌ రివర్సల్‌ చూపుతోంది. ప్రస్తుతం 34 వారాల మూవింగ్‌ యావరేజ్‌ స్థాయికి పైన క్లోజయి బలంగా కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ సైతం పాజిటివ్‌ సంకేతాలు ఇస్తోంది.
2. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 400. స్టాప్‌లాస్‌ రూ. 340. ఇటీవలి పతనం అనంతరం రూ. 365 వద్ద కన్సాలిడేట్‌ అయింది. ఇక్కడ నుంచి మంచి వాల్యూంలతో కూడిన అప్‌మూవ్‌ ఆరంభించింది. ఇండికేటర్లు పాజిటివ్‌ సిగ్నల్స్‌ చూపుతున్నాయి.
యస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు:
1. శ్రీరామ్‌ సిటి యూనియన్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2060. స్టాప్‌లాస్‌ రూ. 1700. వీక్లీ చార్టుల్లో ఐదు తరంగాల పతనం పూర్తి చేసుకొని అప్‌మూవ్‌కు రెడీ అయింది. బేరిష్‌ పాటర్న్‌ పూర్తయి బుల్లిష్‌ బుల్డప్‌ జరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డైటీ చార్టుల్లో డబ్ల్యు ఆకార పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ఆర్‌ఎస్‌ఐ 40కిపైన కొనసాగుతూ బుల్‌రన్‌కు మద్దతునిస్తోంది.
2. పవర్‌గ్రిడ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 210. స్టాప్‌లాస్‌ రూ. 187. వీక్లీ చార్టుల్లో త్రిభుజాకార పాటర్న్‌ నుంచి అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ సాధించింది. రూ. 195కు పైన స్థిరంగా కొనసాగితే మరింత ముందుకు దూసుకుపోతుంది. డైలీ చార్టుల్లో కూడా ఫ్లాగ్‌ పాటర్న్‌ నుంచి బయటపడినట్లు చూపుతోంది. 
చార్ట్‌వ్యూఇండియా సిఫార్సులు:
1. ఫెడరల్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 97. స్టాప్‌లాస్‌ రూ. 87. బ్యాంకునిఫ్టీ ఆల్‌టైమ్‌ హైకి చేరిన వేళ ఈ కౌంటర్‌ కూడా పాజిటివ్‌గా కనిపిస్తోంది. వరుస పాజిటివ్‌ క్లోజింగ్‌ల అనంతరం కొంత స్తబ్దుగా మారి తిరిగి అప్‌మూవ్‌కు రెడీఅవుతోంది.
2. రేమండ్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 885. స్టాప్‌లాస్‌ రూ. 799. రెండు సెషన్లుగా కన్సాలిడేట్‌ అవుతోంది. రూ. 835కు పైన స్థిరంగా క్లోజయితే తిరిగి పరుగు మొదలవుతుంది.
ఎపిక్‌ రిసెర్చ్‌ సిఫార్సులు: 
1. ఓఎన్‌జీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 165. స్టాప్‌లాస్‌ రూ. 150. డైలీ చార్టుల్లో బుల్లిష్‌ కంటిన్యూషన్‌ పాటర్న్‌ను ఛేదించింది. చార్టుల్లో ఏర్పడిన హామర్‌ పాటర్న్‌ ట్రెండ్‌ రివర్సల్‌ను చూపుతోంది.
2. టొరెంట్‌ పవర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 270. స్టాప్‌లాస్‌ రూ. 248. డైలీ చార్టుల్లో ఫ్లాగ్‌ పాటర్న్‌ కనిపిస్తోంది. తాజా కన్సాలిడేషన్‌ మరో పరుగుకు అవకాశమిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా ఉంది.
ఛాయిస్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు: 
1. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 62. స్టాప్‌లాస్‌ రూ. 47. వీక్లీ చార్టుల్లో కప్‌ అండ్‌ హాండిల్‌ పాటర్న్‌ నుంచి అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. డైలీ చార్టుల్లో సైతం ఫ్లాగ్‌ ఫార్మేషన్‌ నుంచి బయటపడింది.
2. ఎంఅండ్‌ఎం: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 733. స్టాప్‌లాస్‌ రూ. 675. చార్టుల్లో బుల్లిష్‌ హరామీ పాటర్న్‌ ఏర్పరిచింది. ఇది ట్రెండ్‌రివర్సల్‌కు సంకేతం. డైలీ చార్టుల్లో అధోముఖ వాలు రేఖను పైవైపుగా ఛేదించింది. స్టాకు తన 200 రోజుల డీఎంఏకు పైన కదలాడుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సులు: 
1. కోటక్‌ మహీంద్రా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 140. స్టా్‌ప్‌లాస్‌ రూ. 1270. ప్రస్తుత మార్కెట్‌లో చాలా బలమైన షేర్లలో ఒకటి. ఇటీవలే కన్సాలిడేషన్‌ రేంజ్‌ను దాటి బయటకువచ్చి టెక్నికల్‌గా పాజిటివ్‌ సంకేతాలు ఇస్తోంది. 
2. సుందరమ్‌ ఫాస్టనర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 610. స్టాప్‌లాస్‌ రూ. 520. గతవారం కనిష్ఠాల నుంచి ర్యాలీజరిపింది. ఇటీవలే కన్సాలిడేషన్‌ పరిమితులను దాటుకొని బయటపడింది. ప్రస్తుతం 13, 50 రోజుల డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతోంది. 



You may be interested

గ్లోబల్‌ బుల్‌ మార్కెట్‌ మధ్యలో ఉన్నాం!

Monday 18th March 2019

అతుల్‌ సూరి అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పాజిటివ్‌ మూడ్‌ కారణంగా దేశీయ మార్కెట్లో ర్యాలీ ఆరంభమైందని మారథాన్‌ ట్రెండ్స్‌ సీఈఓ అతుల్‌ సూరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా భారీ బుల్‌ ర్యాలీ మధ్యలో ఉన్నామన్నారు. భారత్‌ ఇప్పుడే ఈ ర్యాలీలో కాలుమోపిందని చెప్పారు. ప్రీఎన్నికల ర్యాలీని చూస్తే ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న ఆశలు సూచీలను ముందుకు నడిపిస్తున్నట్లు కనిపిస్తోందని, కానీ నిజానికి అంతర్జాతీయ లిక్విడిటీ ప్రవాహమే ఈ ర్యాలీకి మూల

తగ్గిన పసిడి ధర

Monday 18th March 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్ల మేర నష్టపోయింది. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంక్‌ సమీక్షా సమావేశాలు ఈవారంలో మంగళ, బుధ వారాల్లో జరగున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగనం కారణంగా ఈసారి ఫెడ్‌ కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వడ్డీరేట్ల పెంపు లేకపోతే బాండ్‌, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుంది. నేడు ఆసియాలో పలు

Most from this category