STOCKS

News


స్వల్పకాలానికి డజను సిఫార్సులు

Monday 7th January 2019
Markets_main1546842542.png-23446

వచ్చే 2, 3 వారాల్లో మంచి రాబడినిచ్చే 12 స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
యస్‌ సెక్యూరిటీస్‌:
1. డా. లాల్‌ పాత్‌ ల్యాబ్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1040. స్టాప్‌లాస్‌ రూ. 900. బుల్లిష్‌ ఫ్లాగ్‌ పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌కు రెడీగా ఉంది. రూ. 945కు పైన స్థిరంగా కొనసాగితే అప్‌మూవ్‌ ఉంటుంది. దిగువన గత ర్యాలీకి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి వద్ద మద్దతు పొందింది. ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ పాజిటివ్‌గా ఉంది.
2. ఇన్ఫోఎడ్జ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1750. స్టాప్‌లాస్‌ రూ. 1470. వీక్లీ చార్టుల్లో కీలక స్థాయిలకు చేరువలో ఉంది. రూ. 1650- 1690 రేంజ్‌ను ఛేదించగలిగితే త్వరలో రూ. 1750 వరకు ర్యాలీ జరపవచ్చు. దిగువన రూ. 1570, 1490 వద్ద మద్దతు దొరుకుతుంది. ఆర్‌ఎస్‌ఐ 40 స్థాయికి పైన ఉండి బుల్లిష్‌గా కనిపిస్తోంది. 
ఛాయిస్‌ బ్రోకింగ్‌:
1. కజారియా సిరామిక్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 580. స్టాప్‌లాస్‌ రూ. 470. డైలీ చార్టుల్లో బహుళ నిరోధాలను దాటి బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం 200 రోజుల డీఎంఏ స్థాయికి పైన ట్రేడవుతూ బలంగా కనిపిస్తోంది.
2. ఐడీఎఫ్‌సీ బ్యాంకు: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 51.50. స్టాప్‌లాస్‌ రూ. 42. వీక్లీ చార్టుల్లో సాసర్‌బాటమ్‌ ఏర్పరిచి తాజాగా బుల్లిష్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. రోజూవారీ చార్టుల్లో బలంగా కనిపిస్తోంది.
ఏవీపీ రిసెర్చ్‌:
1. అపోలో హాస్పిటల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1380. స్టాప్‌లాస్‌ రూ. 1240. త్రిభుజాకార పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ ఇచ్చింది. వేవ్‌ థియరీలో వేవ్‌2 ముగించుకొని వేవ్‌3 ఆరంభించింది. ఎంఏసీడీ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి.
2. యస్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 200. స్టాప్‌లాస్‌ రూ. 185. సౌష్ఠవాకార త్రిభుజాకృతి పాటర్న్‌ నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. వేవ్‌ థియరీ ప్రకారం వేవ్‌ 3 ఆరంభమైంది. 
ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌:
1. సీమెన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1150. స్టాప్‌లాస్‌ రూ. 1010. మూడేళ్ల లాంగ్‌టర్మ్‌ ఛానెల్‌ దిగువ అవధిని సమీపించింది. అక్కడ నుంచి బలమైన వాల్యూంలతో పైకి ఎగిసింది. ఈ అప్‌మూవ్‌కు డెలివరీ పర్సెంటేజ్‌లు అధికంగా ఉండడం మద్దతుగా నిలుస్తోంది.
2 ఐటీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 293. స్టాప్‌లాస్‌ రూ. 276. గత అప్‌మూవ్‌కు 80 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిలను సమీపించేందుకు దాదాపు 18 నెలల సమయం పట్టింది. దీన్నిబట్టి తాజా డౌన్‌ట్రెండ్‌ మూవ్‌లో బలం సన్నగిల్లిందని తెలుస్తోంది.
ప్రభుదాస్‌ లీలాధర్‌:
1. జేఎస్‌పీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 167. స్టాప్‌లాస్‌ రూ. 144. ఇటీవలి గరిష్ఠం రూ.172 నుంచి రూ. 145 వరకు పతనమైంది. దిగువన రూ. 145 వద్ద మద్దతు పొందుతోంది. చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచి అప్‌మూవ్‌ అవకాశాలు చూపుతోంది. 
2. ఎంఅండ్‌ఎం: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 785. స్టాప్‌లాస్‌ రూ. 705.  చార్టుల్లో రూ. 710 వద్ద హయ్యర్‌ బాటమ్‌ను ఏర్పరిచి బలమైన మద్దతు పొందుతోంది. ప్రస్తుతం రిస్కురివార్డు ఆకర్షణీయంగా ఉన్నాయి. 
ఎంఎస్‌టీఏ:
1. సీసీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 405. స్టాప్‌లాస్‌ రూ. 360. గత ఏడాది ఆరంభంలో రూ. 740 వరకు ఎగబాకి అనంతరం కరెక‌్షన్‌కు గురైంది. ప్రస్తుతం అధోముఖ ట్రెండ్‌ వాలురేఖను పైవైపుగా ఛేదించే యత్నాల్లో ఉంది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు అప్‌మూవ్‌కు మద్దతుగా ఉన్నాయి. 
2. ఎస్‌బీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 320. స్టాప్‌లాస్‌ రూ. 285. గతేడాది మొత్తం కన్సాలిడేషన్‌లో ఉండిపోయింది. తాజాగా వీక్లీ చార్టుల్లో త్రిభుజాకార పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌కు యత్నిస్తోంది. పీఎస్‌యూ బ్యాంకుల్లో మంచి ప్రదర్శన చూపుతోంది. ఇండికేటర్లు త్వరలో అప్‌మూవ్‌ ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నాయి. 

 



You may be interested

ఏడాది మారింది... మరి మీరు?

Monday 7th January 2019

- కాలానికి అనుగుణంగా పెట్టుబడులు - స్టాక్‌ మార్కెట్లలో పెరిగిన అస్థిరతలు - సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేయడమే మెరుగు - లార్జ్‌క్యాప్‌కు ప్రత్యామ్నాయం మల్టీక్యాప్‌ ఫండ్స్‌ - మూలధన లాభాల పన్ను పడకుండానూ మార్గం - ఎఫ్‌ఎంపీ, ఎన్‌పీఎస్‌, షార్ట్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌... ఎన్నో ఆప్షన్లు (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) గతేడాది చాలా పెట్టుబడి సాధనాలు సగటు కంటే తక్కువ రాబడులే ఇచ్చాయి. ఇటీవలి కాలంలో ఎక్కువ అస్థిరతలు చూసింది గతేడాదిలోనే. అయితే, 2019లో పరిస్థితులు ఆశాజనకంగానే

టైటాన్‌పై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Monday 7th January 2019

వివిధ విభాగాల నుంచి రెవెన్యూ గైడెన్స్‌ బాగుంటుందన్న అంచనాలిచ్చిన టైటాన్‌పై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో టైటాన్‌ షేరు దాదాపు 4 శాతం లాభపడింది. మోర్గాన్‌స్టాన్లీ: రేటింగ్‌ ఓవర్‌వెయిట్‌. టార్గెట్‌ రూ. 1250. క్యు3పై కంపెనీ మేనేజ్‌మెంట్‌ అంచనాలు బలంగా ఉన్నాయి. జువెలరీ విభాగంలో అనూహ్యమైన ఆపరేటింగ్‌ మార్జిన్‌ అప్‌మూవ్‌ ఉండొచ్చు. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 22 శాతం రెవెన్యూ గ్రోత్‌ ఉంటుందని మేనేజ్‌మెంట్‌ అంచనా వేసింది. వాచీల

Most from this category