STOCKS

News


3 వారాల్లో లాభాలందించే 12 స్టాక్స్‌

Monday 27th August 2018
Markets_main1535358266.png-19683

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పరుగులు పెడుతున్నాయి. కొత్త గరిష్ట స్థాయిలను అధిగమిస్తూ ముందుకు కదులుతున్నాయి. ఇలాంటి సమయంలో పలు బ్రోకరేజ్‌ సంస్థలకు చెందిన అనలిస్ట్‌లు వచ్చే మూడు వారాల కాలంలో లాభాలు అందించే 12 స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం..

అనలిస్ట్‌: ప్రభుదాస్‌ లీలాధర్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ వైశాలి పరేఖ్‌

స్టాక్‌: భెల్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.90
స్టాప్‌ లాస్‌: రూ.74
భెల్‌ స్టాక్‌ డైలీ చార్ట్‌లో హైయర్‌ బాటమ్‌ను ఏర్పరచింది. 50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ వద్ద సపోర్ట్‌ తీసుకుంది. ఇది 72 వద్ద ఉంది. ఆర్‌ఎస్‌ఐ కూడా పైకి కదులుతోంది. చార్ట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉంది. రానున్న రోజుల్లో స్టాక్‌ ధర రూ.88-90 స్థాయికి పెరగొచ్చు. వ్యాల్యుమ్స్‌ కూడా బాగున్నాయి. అందువల్ల స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

స్టాక్‌: క్యాడిలా హెల్త్‌కేర్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.440
స్టాప్‌ లాస్‌: రూ.380
క్యాడిలా స్టాక్‌ డైలీ చార్ట్‌లో రూ.332 సమీపంలో డబుల్‌ బాటమ్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. ఇటీవల రూ.385 స్థాయి వరకు పెరిగింది. ఇదే 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ కావడం గమనార్హం. రానున్న రోజుల్లో స్టాక్స్‌లో అప్‌ట్రెండ్‌ ఉంటుంది. ఆర్‌ఎస్‌ఐ పైకి కదలాడం, వ్యాల్యుమ్స్‌ స్థిరంగా ఆకర్షణీయంగా ఉండటం వల్ల స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

అనలిస్ట్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ గజేంద్ర ప్రభు

స్టాక్‌: ఇండియా సిమెంట్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.134
స్టాప్‌ లాస్‌: రూ.114
ఈ స్టాక్‌ గత వారంలో వీక్లి చార్ట్‌లో హ్యామర్‌ క్యాండిల్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. స్టాక్‌లో అప్‌ట్రెండ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్‌ ధర 21, 50 రోజుల ఈఎంఏ మూవింగ్‌ యావరేజ్‌లకు పైస్థాయిలో ఉంది. ఇది బుల్స్‌కు మరింత బలాన్ని చేకూర్చుతోంది.

స్టాక్‌: టాటా కెమికల్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.800
స్టాప్‌ లాస్‌: రూ.690
ఈ స్టాక్‌ గత వారంలో వీక్లి చార్ట్‌లో ఇన్‌గల్ఫింగ్‌ బుల్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. బుల్లిష్‌ సిగ్నల్‌ను ఇది ద్రువీకరిస్తోంది. రూ.648 వద్ద డబుల్‌ బాటమ్‌ను ఏర్పరచింది. స్టాక్‌ ధర ఇక్కడి నుంచి పెరుగుతూ వస్తోంది. రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చు.

అనలిస్ట్‌: ఎంఎస్‌టీఏ సీఎంటీ మిలాన్‌ వైష్ణవ్‌

స్టాక్‌: హిందాల్కో
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.250
స్టాప్‌ లాస్‌: రూ.200
గతేడాది చివరి త్రైమాసికంలో ఈ స్టాక్‌ రూ.280-284 స్థాయిలో కదలాడింది. అయితే తర్వాత క్షీణించింది. స్టాక్‌కు రూ.195-210 స్థాయిలో మంచి మద్దతు లభించింది. ఆర్‌ఎస్‌ఐ స్థిరంగా ఉంది. హైయర్‌ బాటమ్‌ను ఏర్పరచింది. ఎంసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌ను సూచిస్తోంది. సిగ్నల్‌ లైన్‌కు పైన ట్రేడవుతోంది. బుల్లిష్‌ సిగ్నల్‌ను సూచిస్తోంది. అయితే రూ.200 స్థాయికి పడిపోతే అది నెగటివ్‌గా భావించాలి. 

స్టాక్‌: టీవీఎస్‌ మోటార్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.620
స్టాప్‌ లాస్‌: రూ.520
కరెక్టివ్‌ మూవ్‌ ముగిసిపోయినట్లేనని ఈ స్టాక్‌ సంకేతాలిస్తోంది. ట్రెండ్‌ రివర్సల్‌ను సూచిస్తోంది. రూ.795 స్థాయి వద్ద నుంచి స్టాక్‌ పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ధర రూ.520 దిగువకు వెలితే నెగటివ్‌గా భావించాలి.

అనలిస్ట్‌: ఆనంద్‌రాఠి అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఈక్విటీ రీసెర్చ్‌) జయ్‌ ఆనంద్‌ ఠక్కర్‌

స్టాక్‌: పెడిలైట్‌ ఇండస్ట్రీస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,210
స్టాప్‌ లాస్‌: రూ.1,120
ఇది డౌన్‌ట్రెండ్‌ లైన్‌ రెసిస్టెన్స్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. అప్‌ట్రెండ్‌ వైపు కదులుతోంది. డైలీ, వీక్లి చార్ట్స్‌లో ఎంఏసీడీ బై మోడ్‌లో ఉంది. కొనుగోలు చేయవచ్చు. 

స్టాక్‌: యాక్సిస్‌ బ్యాంక్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.664
స్టాప్‌ లాస్‌: రూ.620
యాక్సిస్‌ బ్యాంక్‌ మంత్లీ చార్ట్‌లో సిమెట్రికల్‌ ట్రైయాంగులర్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. అలాగే ఎంఏసీడీ బై క్రాసోవర్‌ను ఏర్పరచింది. మధ్యకాలంలో ఇది బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. 

స్టాక్‌: లుపిన్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.945
స్టాప్‌ లాస్‌: రూ.864
లుపిన్‌ డైలీ చార్టస్‌లో ఇన్‌వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. హైయర్‌ టాప్స్‌ అండ్‌ బాటమ్స్‌ను ఏర్పరుస్తోంది. స్వల్ప కాలం నుంచి మధ్యస్థ కాలానికి ఇది పాజిటివ్‌ అంశం. 

అనలిస్ట్‌: చార్ట్‌వ్యూఇండియా చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజ్హర్‌ మహమ్మద్‌

స్టాక్‌: పవర్‌ గ్రిడ్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.207
స్టాప్‌ లాస్‌: రూ.184
ఈ స్టాక్‌ గత కొంత కాలంగా కరెక‌్షన్‌కు గురౌతూ వస్తోంది. గతేడాది ఆగస్ట్‌లోని రూ.226 గరిష్ట ధర నుంచి పడుతూ వచ్చింది. తర్వాత జూలైలో రూ.174 వద్ద డ్యూరబుల్‌ బాటమ్‌ ఏర్పరచింది. ఇక్కడి నుంచి మళ్లీ రూ.194 వరకు పెరిగింది. ఊ.184 వద్ద షార్ట్‌టర్మ్‌ బాటమ్‌ను ఏర్పరచింది. ట్రెండ్‌ మరితే ఇక్కడి నుంచి స్టాక్‌ బాగా పెరగొచ్చు. పొజిషనల్‌ ట్రేడర్లు రూ.184 స్టాప్‌లాస్‌తో రూ.207 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

స్టాక్‌: కమ్మిన్స్‌ ఇండియా
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.798
స్టాప్‌ లాస్‌: రూ.735
ఈ స్టాక్‌ 2015 ఆగస్ట్‌లో రూ.1,247 గరిష్ట స్థాయిని తాకింది. అయితే తర్వాతి నుంచి అండర్‌ పర్ఫార్మ్‌ చూస్తూ వస్తోంది. గత నెలలో రూ.613 వద్ద బాటమ్‌ ఔట్‌ అయినట్లు కనిపించింది. అక్కడి నుంచి పెరుగుతూ వస్తోంది. ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చు. రూ.735 స్టాప్‌లాస్‌తో రూ.798 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనొచ్చు

స్టాక్‌: భెల్‌
రేటింగ్‌:కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌:రూ.97
స్టాప్‌లాస్‌: రూ.75
ఈ స్టాక్‌ 100 రోజుల మూవింగ్‌ యావరేజ్‌కు పైన అధిక వ్యాల్యుమ్స్‌తో బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. స్టాక్‌ రూ.77కుపైన స్థిరపడితే రూ.99 వరకు పెరగొచ్చు.



You may be interested

టాటా మోటర్స్‌ షేరును ఏం చేద్దాం?

Monday 27th August 2018

పాజిటివ్‌ అంటున్న మెజార్టీ నిపుణులు గతేడాది కాలంలో టాటా గ్రూప్‌నకు చెందిన రెండు బడా కంపెనీలు టీసీఎస్‌, టాటా మోటర్స్‌ షేరు ఉత్తర, దక్షిణ దిశల్లో పయనించాయి. టీసీఎస్‌ మంచి ర్యాలీతో ఆల్‌టైమ్‌ హైని చేరగా, టాటా మోటర్స్‌ ఏడాది గరిష్ఠాల నుంచి 45 శాతం ఢమాల్‌మంది. ఈ నేపథ్యంలో టాటామోటర్స్‌ షేరును కొనాలా? ఉన్న షేర్లను హోల్డ్‌ చేయాలా? అమ్మేసుకోవాలా? అని రిటైల్‌ ఇన్వెస్టర్లు డైలమాలో ఉఉన్నారు. టాటా మోటర్స్‌

బ్యాంకింగ్‌ షేర్ల పరుగులు

Monday 27th August 2018

నిప్టీ-50లో టాప్‌గెయినర్లుగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ షేర్లు ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాకింగ్‌ షేర్ల ర్యాలీ సోమవారం సూచీలను పరుగులు పెట్టిస్తుంది. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకు ఇండెక్స్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌లు 2నుంచి 3శాతానికి పైగా ర్యాలీచేశాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ఎస్‌బీఐ(3.15శాతం), ఐసీఐసీఐ బ్యాంకు(3.09శాతం) లాభపడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్ల విభాగంలో చోటు దక్కించుకున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు

Most from this category