STOCKS

News


నిండా ముంచేసిన ఐపీవోలు

Friday 12th October 2018
Markets_main1539368229.png-21096

సెకండరీ మార్కెట్‌లో నష్టాలు ఇన్వెస్టర్లకు సుపరిచితమే. కానీ, ఇటీవలి కాలంలో ప్రైమరీ మార్కెట్‌లో భాగమైన ఐపీవోలు కూడా ఇన్వెస్టర్లను లబోదిబోమనేలా చేస్తున్నాయి. నష్టాలతో నిండా ముంచేస్తున్నాయి. 2017 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఐపీవోల్లో రూ.1,000 కోట్లకు పైగా ఇష్యూ సైజు కలిగిన వాటిని పరిశీలిస్తే... అధిక శాతం లాభాల నుంచి నష్టాల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. రూ.1,000 కోట్లకు పైగా ఇష్యూ సైజుతో ఐపీవోకు వచ్చి మార్కెట్లో లిస్ట్‌ అయిన కంపెనీలు 20 వరకు ఉన్నాయి. ఇందులో 12 కంపెనీలు ఇష్యూ ధర నుంచి చూస్తే 2 నుంచి 50 శాతం వరకు తక్కువలో ట్రేడ్‌ అవుతున్నాయి. మిగిలినవి సానుకూల రాబడులతో ట్రేడ్‌ అవుతున్నాయి. 

 

న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ 2017 నవంబర్‌ 12న లిస్ట్‌ కాగా ఐపీవో ఇష్యూ ధర రూ.800. కానీ ప్రస్తుత స్టాక్‌ ధర రూ.204.25. ఈ మధ్య కాలంలో ఒక షేరుకు మరో షేరును బోనస్‌గా ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే ఇష్యూ ధరలో సగం మేర ఈ స్టాక్‌ ధర పతనమైంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిలో సగం కోల్పోయారు. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆర్‌ఈ సైతం ఇష్యూ ధర రూ.912తో పోలిస్తే (ఇది కూడా బోనస్‌ ఇచ్చింది) 32 శాతం నష్టపోయింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ షేరు, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ స్టాక్స్‌ ఇష్యూ ధరలతో పోలిస్తే 50 శాతం నష్టపోయినవే. ఇంకా కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, హాల్‌, రిలయన్స్‌ నిప్పన్‌ ఏఎంసీ, ఎస్‌బీఐ లైఫ్‌ తదితర కంపెనీలన్నీ ఇష్యూ ధర కంటే దిగువనే ట్రేడ్‌ అవుతున్నాయి. ‘‘ఐపీవో మార్కెట్‌ పనితీరు సెకండరీ మార్కెట్‌కు అనుగుణంగానే ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌ బుల్లిష్‌గా ఉంటే చాలా మంది ఇన్వెస్టర్లను ఐపీవో మార్కెట్‌ ఆకర్షిస్తుంది’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సీఐవో వీకే విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మిగిలి ఉన్న కాలంలో ఐపీవోల సందడి పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు ఉన్నందున, కంపెనీలు తమ ఐపీవోలను జనవరి-మార్చి క్వార్టర్‌లో తీసుకొచ్చే అవకాశం ఉందని ఈఅండ్‌వై పేర్కొంది. 

 

చమురు ధరలు, రూపాయి పతనం సహా ఎన్నో ప్రతికూల అంశాలు మన మార్కెట్లను కరెక్షన్‌ బాట పట్టించాయి. ఈ నేపథ్యంలో ఐపీవోలకు దూరంగా ఉండాలని అనలిస్టులు సూచిస్తున్నాయి. అలాగే, లిస్ట్‌ అయిన మొదటి రెండు రోజుల్లోనూ కొనకుండా ఉండాలని సూచిస్తున్నారు. కొనే ముందు ఆ స్టాక్‌ స్థిరపడే వరకు వేచి చూడాలంటున్నారు. లిస్టింగ్‌ మొదట్లో అమ్మకాల ఒత్తిడి ఉంటుందని, అది సర్దుమణిగే వరకు ఓపిక వహించాలని సూచిస్తున్నారు. ఇండియన్‌ ఎనర్జీ ఎక్సేంజ్‌ ఆకర్షణీయ ధరల వద్ద ఉందని, ఈ కంపెనీకి ఎంతో సామర్థ్యం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, రిలయన్స్‌ నిప్పన్‌ ఏఎంసీ విషయంలో వాటి ప్రమోటర్లు ఎదుర్కొంటున్న అంశాల పట్ల మార్కెట్లు అధికంగా స్పందించాయన్నారు.You may be interested

గ్యాస్‌ పంపిణీ కంపెనీలకు బంగారు భవిష్యత్తు!

Friday 12th October 2018

మార్కెట్లు పడుతుంటే... కంపెనీ ఎంత గొప్పదన్న అంశాన్ని ఇన్వెస్టర్లు చూడరు. అమ్మడమే ఎక్కువ మంది చేసే పని. అందుకే బుల్‌ మార్కెట్‌తో పోలిస్తే బేర్‌ మార్కెట్లో మంచి పెట్టుబడి అవకాశాలు అందివస్తాయంటారు. ఆ విధంగా చూస్తే వ్యాపార పరంగా మంచి భవిష్యత్తు ఉన్న సహజవాయువు పంపిణీ కంపెనీలు ఇంద్రప్రస్థ గ్యాస్‌, మహానగర్‌ గ్యాస్‌ పెట్టుబడికి ఆకర్షణీయమైన ధరలకు దిగొచ్చాయి. మహానగర్‌ గ్యాస్‌ 43 శాతం, ఇంద్రప్రస్థ గ్యాస్‌ 35 శాతం

భారీ లాభంతో ముగింపు

Friday 12th October 2018

10,450 పాయింట్ల పైకి నిఫ్టీ 732 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ ముంబై:- రూపాయి రికవరీతో పాటు ముడిచమురు ధరలు చల్లారడంతో శుక్రవారం మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. గత రెండు రోజులుగా ప్రపంచమార్కెట్లో నెలకొన్న అమ్మకాలు తగ్గడంతో దేశీయ సూచీలు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ముఖ్యంగా మెటల్‌, బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మిడష్‌సెషన్‌ సమయానికి సూచీలు క్రితం ట్రేడింగ్‌లో కోల్పోయిన లాభాలను పూడ్చుకోగలిగాయి. అనంతరం యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు

Most from this category