STOCKS

News


పన్నెండు వేల పాయింట్లు పక్కా?!

Friday 31st August 2018
Markets_main1535695617.png-19829

నిఫ్టీపై సెంట్రమ్‌ బ్రోకింగ్‌ అంచనా
జూలై సీరిస్‌లో మంచి బౌన్స్‌బ్యాక్‌ అనంతరం సూచీలు ఆగస్టులో తమ జోరు కొనసాగించాయి. ఆగస్టు సీరిస్‌లో నిఫ్టీ దాదాపు 4.5 శాతం లాభపడింది. ఇకముందు కూడా ఇదే ఊపు కనపిస్తుందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ అంచనా వేసో​‍్తంది. నిఫ్టీ త్వరలో 12వేల పాయింట్లను చేరవచ్చని అభిప్రాయపడింది. జూలై, ఆగస్టు సీరిస్‌ల్లో ఏర్పడిన లాంగ్స్‌ సెప్టెంబర్‌కు రోలోవర్‌ అయ్యాయని తెలిపింది. సెప్టెంబర్‌ సీరిస్‌లో రోలోవర్లు 68.37 శాతంగా నమోదయ్యాయి. మూడునెలల సరాసరి 66.81 శాతం కన్నా ఇది అధికం. అదేవిదంగా రోలోవర్ల ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ నెలతో పోలిస్తే 11.45 శాతం పెరిగిందని తెలిపింది. ఈ దఫా ర్యాలీలో ఎఫ్‌ఐఐలు సైతం భాగస్వామ్యం వహించాయి. విదేశీ మదుపరులు కొత్త లాంగ్స్‌పొజిషన్లు తీసుకున్నట్లు గణాంకాలు చూపుతున్నాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఆప్షన్‌ డేటా చూస్తే 10800 పాయింట్ల వద్ద, 12000 పాయింట్ల వద్ద కాల్స్‌ రైటింగ్‌ ఎక్కువగా జరిగింది. అదే సమయంలో 11400- 11700 పాయింట్ల వద్ద పుట్స్‌ ఎక్కువగా పోగయ్యాయి. ఆగస్టు సీరిస్‌లో పుట్‌ రైటర్ల హవా కొనసాగింది. ఇదే జోరు సెప్టెంబర్‌లో కూడా ఉండేలా ఉందని ఆప్షన్‌ డేటా సూచిస్తోంది. సెప్టెంబర్ సీరిస్‌ మొత్తం మీద నిఫ్టీ 11500- 12000 పాయింట్ల మధ్యలో కదలాడవచ్చని అంచనా. గత రెండు సీరిస్‌ల్లో నిఫ్టీ దాదాపు వెయ్యి పాయింట్లు లాభపడినందున ఒక చిన్న కరెక‌్షన్‌ లేదా కన్సాలిడేషన్‌ రావచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. అయినా డెరివేటివ్స్‌ డేటాలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని పేర్కొంది. బ్యాంకు నిఫ్టీలో లాంగ్‌పొజిషన్ల అన్‌వైండింగ్‌ ఎక్కువగా కనిపించింది. దీంతో సెప్టెంబర్‌ సీరిస్‌లోకి రోలోవర్లు సరాసరి కన్నా తక్కువగా నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో కొత్త లాంగ్‌ బిల్డప్‌ను బట్టి బ్యాంకు నిఫ్టీ కదలికలుంటాయి. ప్రస్తుతానికి బ్యాంకు నిఫ్టీ 27700- 28400 పాయింట్ల మధ్య కదలాడవచ్చు. సెప్టెంబర్‌ సీరిస్‌లో మెటల్‌, ఫార్మా షేర్ల జోరు కొనసాగవచ్చు. స్ట్రైడ్స్‌ ఫార్మా, యూబీఎల్‌, అపోలో హాస్పిటల్‌, అజంతా ఫార్మా, దివిస్‌ ల్యాబ్‌, పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఆర్‌కామ్‌ షేర్లలో ఎక్కువ లాంగ్‌ రోలోవర్లు కనిపిస్తున్నాయి. రెప్కో హోమ్‌, అపోలో టైర్స్‌, ఉజ్జీవన్‌, హెచ్‌పీసీఎల్‌, ఎంఆర్‌ఎఫ్‌, బీపీసీఎల్‌ కౌంటర్లలో ఎక్కువగా షార్టు రోలోవర్‌ నమోదయింది. You may be interested

8వారాల కనిష్టానికి యస్‌ బ్యాంకు

Friday 31st August 2018

యస్‌ బ్యాంక్‌ షేరు శుక్రవారం 7శాతం వరకూ నష్టపోయి 8వారాల కనిష్టానికి చేరుకుంది. బ్యాంకు సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాణా కపూర్‌ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆర్‌బీఐ అనుమతులిచ్చినట్లు యస్‌ బ్యాంకు గురువారం మార్కెట్‌ ముగింపు అనంతరం స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. అయితే విశ్లేషకులు మాత్రం సీవోఈ పునర్నిమాయకం చుట్టూ వివాదాలున్నట్లు సందేహం వ్యక్తపరుస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంకు షేరు 5శాతం నష్టంతో

వాణిజ్య యుద్ధభయాలతో పెరిగిన పసిడి

Friday 31st August 2018

వాణిజ్యయుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో  శుక్రవారం పసిడి ధర పెరిగింది. నేడు ఆసియా మార్కెట్‌లో భారత కాలమాన ప్రకారం ఉదయం 10:00లకు ఔన్స్‌ పసిడి 6.10 డాలర్లు లాభపడి 1,210.90 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం ట్రేడింగ్‌లో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో పసిడి నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. చైనా దిగుమతులపై టారీఫ్‌లు సెప్టెంబర్‌ 5నుంచి అమల్లోకి వస్తున్న టారిఫ్‌లపై వెనక్కి తగ్గేదిలేదంటూ అమెరికా

Most from this category