STOCKS

News


ఏప్రిల్‌ సీరిస్‌లో 12వేల పాయింట్లు పక్కా!

Friday 29th March 2019
Markets_main1553854209.png-24864

నిఫ్టీపై నిపుణుల అంచనా
గత సీరిస్‌ మొత్తం నిఫ్టీ హయ్యర్‌ హై, హయ్యర్‌ లో ఏర్పరుస్తూ ముందుకు కొనసాగింది. చివరకు సీరిస్‌ను దాదాపు 7 శాతం పైచిలుకు లాభంతో ముగించింది. ఏప్రిల్‌ సీరిస్‌లోకి దాదాపు 66.73 శాతం రోలోవర్లు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 21 శాతం మేర పెరిగింది. దీన్ని బట్టి మార్చిలో లాంగ్స్‌ తీసుకున్న సంస్థాగత ఇన్వెస్టర్లు ఏప్రిల్‌లో కూడా తమ లాంగ్‌ పొజిషన్లను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. గత సీరిస్‌లో 25 వరుస సెషన్లలో ఎఫ్‌ఐఐలు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. వీరు నెలమొత్తం మీద దాదాపు 47 వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారు. ఇదే సమయంలో డీఐఐలు నికర అమ్మకందారులుగా మారి 13.5 వేల కోట్ల రూపాయల అమ్మకాలు సాగించారు. ప్రస్తుతం ఏప్రిల్‌ సీరిస్‌లో 12వేల కాల్‌, 11వేల పుట్‌ వద్ద అధిక ఓఐ కనిపిస్తోంది. దీన్నిబట్టి ఏప్రిల్‌ సీరిస్‌లో నిఫ్టీ 12వేల పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చని, దిగువన 11వేల పాయింట్ల వద్ద మద్దతు పొందుతుందని నిపుణుల అంచనా. మరోవైపు మార్చి సీరిస్‌లో బ్యాంకు నిఫ్టీ అనూహ్య పాజిటివ్‌ ప్రదర్శన చూపింది. ఈ సీరిస్‌లో బ్యాంకు నిఫ్టీ 13.5 శాతం దూసుకుపోయింది. మూడేళ్లలో ఇదే నెలవారీ గరిష్ఠ పెరుగుదల. ఏప్రిల్‌ సీరిస్‌లోకి బ్యాంకు నిఫ్టీ రోలోవర్లు 72.24 శాతం పెరిగాయి. ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 92 శాతం పెరిగింది. దీన్నిబట్టి బ్యాంకు నిఫ్టీ సైతం ఏప్రిల్‌సీరిస్‌లో మరింత ర్యాలీ జరపవచ్చని అంచనా. 31,500 పాయింట్ల వరకు బ్యాంకు నిఫ్టీ పరుగులండవచ్చు. 
- రెప్కో హోమ్స్‌, ఓరియంటల్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, జస్ట్‌డయిల్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, డీఎల్‌ఎఫ్‌, డీసీబీ బ్యాంక్‌, జుబిలాంట్‌ ఫుడ్‌, హెచ్‌డీఎఫ్‌సీల్లో లాంగ్‌ పొజిషన్ల రోలోవర్‌ కనిపించింది.
- మదర్‌సన్‌సుమి, బిర్లాసాఫ్ట్‌, వొడాఫోన్‌ ఐడియా, టెక్‌ మహీంద్రా, డాబర్‌లో షార్ట్‌ పొజిషన్ల రోలోవర్లు నమోదయ్యాయి. 



You may be interested

11600 పైన ముగిసిన నిఫ్టీ

Friday 29th March 2019

127 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌  రాణించిన మెటల్‌, అటో, ఫార్మా షేర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజైన శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభంతో ముగిసింది. అంతర్జాతీయంగా పరిమాణాలు, దేశీయ సానుకూల సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా ఏప్రిల్‌ డెరివేటివ్ సిరీస్‌ను సూచీలు భారీ లాభాలతో ప్రారంభించినట్లైంది. ఇంట్రాడేలో అటో, మెటల్‌, ఫార్మా షేర్లు లాభపడటంతో సెన్సెక్స్‌ 127 పాయింట్లు లాభంతో 38,673 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల

5 బ్యాంకులకు రూ. 21,428 కోట్ల మూలధనం

Friday 29th March 2019

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న రూ. 21,428 కోట్ల అదనపు మూలధనానికి ప్రతిగా ప్రిఫరెన్షియల్ షేర్లను కేటాయించేందుకు అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. తమ షేర్‌హోల్డర్ల నుంచి అనుమతులు పొందాయి. ఆయా బ్యాంకులు గురువారం ఈ విషయం తెలిపాయి. అదనపు మూలధనం అందుకుంటున్న వాటిల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్

Most from this category