STOCKS

News


12,000 దివాలా కేసులు దాఖలు

Tuesday 26th March 2019
Markets_main1553583032.png-24799

12,000 దివాలా కేసులు దాఖలు
-4,500 కేసులు పరిష్కారం
-రూ.2 లక్షల కోట్లు రికవరీ 
-కంపెనీ వ్యవహారాల కార్యదర్శి శ్రీనివాస్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: దివాలా చట్టం అమలు, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 12,000 కేసులు దాఖలయ్యాయని కంపెనీ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌  తెలిపారు. వీటిల్లో రూ.2 లక్షల కోట్ల సొమ్ములతో ముడిపడిన 4,500 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. 1500 కేసులను విచారించనున్నారని, మరో 6,000 కేసులు విచారణ కోసం వరుసలో వేచి ఉన్నాయని వివరించారు. కేసుల పరిష్కారానికి ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌(ఐబీసీ) చివరి అవకాశమని పేర్కొన్నారు. దివాళా కేసుల పరిష్కారానికి ఎన్‌సీఎల్‌టీ సాహసోపేతంగా వ్యవహరిస్తోందని వివరించారు. సీఐఐ, బ్రిటిష్‌ హై కమిషన్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 
రికవరీలో మంచి ఫలితాలు...
పెద్ద కేసులు పరిష్కారం కావడానికి 270కి మించిన రోజులు పడుతోందని, కొన్ని కేసులకు దీనికి రెట్టింపు సమయం కూడా పట్టొచ్చని, అయితే రికవరీ విషయంలో మంచి ఫలితాలే వస్తున్నాయని వివరించారు. ఎస్సార్‌ కేసు విషయంలో రూ.42,000 కోట్లు రికవరీ అయ్యాయని తెలిపారు. ఐబీసీ అమల్లోకి రాకముందు పెద్ద కేసుల పరిష్కారానికి నాలుగు నుంచి ఐదేళ్లు పట్టేదని, ఇప్పుడు ఒకటి, రెండేళ్లలోనే కేసులు పరిష్కారమవుతున్నాయని వివరించారు. అంతర్జాతీయ దివాలా (క్రాస్‌ బోర్డర్‌ ఇన్‌సాల్వెన్సీ) ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే దీనిని పార్లమెంట్‌ ఆమోదించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 
సీఒసీ కీలక పాత్ర....
దివాలా ​‍ప్రక్రియలో రుణ దాతల కమిటీ(సీఓసీ)ది కీలకమైన బాధ్యత అని ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ)చైర్మన్‌ ఎమ్‌.ఎస్‌. సాహూ వ్యాఖ్యానించారు. కంపెనీ మనుగడ సాగిస్తుందో, లేదో గుర్తించడం, తగిన రిజల్యూషన్‌ ప్లాన్‌ను రూపొందించడం వంటి కీలక బాధ్యతలను సీఓసీ నిర్వర్తించాల్సి ఉంటుందని వివరించారు. You may be interested

డబ్ల్యూఈఎఫ్‌ ఇంధన పరివర్తన సూచీలో 76

Tuesday 26th March 2019

రెండు స్థానాలు మెరుగుపడిన భారత్‌ టాప్‌-3లో స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, నార్వే న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించే అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్‌ ఈ ఏడాది రెండు స్థానాలు పైకి ఎగబాకి 76కు చేరుకుంది. ఇందన భద్రత, పర్యావరణ స్థిరత్వం, ఇంధన అందుబాటు వంటి అంశాలను ఏ విధంగా సమతుల్యం చేసుకుంటున్నాయన్న దాని ఆధారంగా 115 దేశాలకు ఈ ర్యాంకులను డబ్ల్యూఈఎఫ్‌ కేటాయిస్తుంటుంది. ఈ జాబితాలో స్వీడన్‌ మరోసారి అగ్ర

ఆర్థికమంత్రితో ఆర్‌బీఐ చీఫ్‌ భేటీ

Tuesday 26th March 2019

- ఏప్రిల్‌ 2 నుంచీ పాలసీ సమీక్ష నేపథ్యం న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ సోమవారం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఏప్రిల్‌ 2 నుంచి 4వ తేదీ వరకూ జరగనున్న రానున్న ఆర్థిక సంవత్సరం (2019-2020) మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష తత్సబంధ అంశాలపై వీరిరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. ‘‘ఇది ఒక మర్యాదపూర్వక సమావేశం. ద్రవ్య విధాన సమీక్ష

Most from this category