STOCKS

News


ఆషామాషీ ర్యాలీ కాదు!

Saturday 30th March 2019
Markets_main1553935295.png-24879

బ్యాంకు నిఫ్టీ మద్దతుతో నిఫ్టీ సైతం మంచి ర్యాలీ జరిపిందని, ఇది ఆషామాషీ ర్యాలీ కాదని ప్రముఖ ఇన్వెస్టర్‌ కునాల్‌ బోత్రా చెప్పారు. నిఫ్టీకి 11400- 11500 పాయింట్ల వద్ద బలమైన మద్దతుందన్నారు. ఈ దఫా పీఎస్‌యూ బ్యాంకులు సైతం భారీగా ర్యాలీ జరపడమే బ్యాంకు నిఫ్టీలో అంత పెద్ద ర్యాలీకి అవకాశమిచ్చిందన్నారు. గతంలో కూడా పీఎస్‌యూ బ్యాంకులు మంచి ర్యాలీ జరిపాయని, కానీ అవేమీ ఎక్కువకాలం నిలబడలేదని తెలిపారు. దీంతో పలు పీఎస్‌యూలు ఎప్పటికప్పుడు కొత్త కనిష్ఠాలు నమోదు చేస్తూ వచ్చాయన్నారు. కానీ ఈ దఫా ట్రెండ్‌లో బలమైన మార్పు కనిపిస్తోందన్నారు. పీఎస్‌బీ స్టాకులు హయ్యర్‌హై ఏర్పరుస్తూ మరింత పెరుగుదల ముందున్నదని సంకేతాలు ఇస్తున్నాయని చెప్పారు. ఇకపై ఇంతవరకు ర్యాలీలో పాలుపంచుకోని రంగాలు క్రమంగా పరుగందుకుంటాయన్నారు. 
పీఎస్‌యూ బ్యాంకుల్లో ఎస్‌బీఐ, యూనియన్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై బుల్లిష్‌గా ఉన్నట్లు ఆయన చెప్పారు. 
- యూబీఐ రెండు నెలల్లో దాదాపు 50 శాతం పరుగుతీసిందని, కానీ ఈ రెండు నెలల్లో వాల్యూంలు చూస్తుంటే అసలు ర్యాలీ ఇకముందు ఉండేలా కనిపిస్తోందని చెప్పారు. స్వల్పకాలానికి 102- 105 రూపాయలను, మిడ్‌టర్మ్‌కు 115-120 రూపాయలను చేరవచ్చన్నారు. 
- ఎస్‌బీఐ పదేళ్ల రేంజ్‌(2009- 2019)ని ఛేదించి బయటపడేందుకు సిద్దంగా ఉందన్నారు. రూ. 320 స్థాయిని బ్రేక్‌ చేస్తే కొత్త గరిష్ఠాలకు ఖాయమన్నారు. 



You may be interested

చిన్న పొదుపులపై వడ్డీరేట్లు యథాతథం

Saturday 30th March 2019

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రస్తుతం లభిస్తున్న వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, సుకన్య సంమృద్ధి యోజనసహా అన్ని పొదుపు పథకాలపై ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో యథాపూర్వ వడ్డీరేట్లు కొనసాగుతాయని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా మూడు నెలలకు ఒకసారి పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సమీక్షించి ఆయా రేట్ల కొనసాగింపు లేదా మార్పులపై కేంద్రం

పరిశోధన పత్రాల ప్రచురణ ఫ్రీ!

Saturday 30th March 2019

– రీసెర్చ్‌ స్కాలర్స్‌కు వేదిక రూబటోసిస్‌ పబ్లికేషన్‌ – ఫార్మా, మెడికల్, ఇంజనీరింగ్‌లో 50 జర్నల్స్‌ పబ్లిష్‌ – అన్నీ ఐఎస్‌బీఎన్, ఐఎస్‌ఎస్‌ఎన్, క్రాస్‌రెఫ్‌ అనుమతి పొందినవే హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రీసెర్చ్‌ స్కాలర్స్‌ పరిశోధన పత్రాలను ప్రచురణ చేయాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. విద్యార్థి దశలో అంత మొత్తం వెచ్చించడం కష్టమే! విద్యార్థిగా ఆ కష్టాలను అనుభవించారు కాబట్టే విష్ణు వర్ధన్‌ రెడ్డి, సయ్యద్‌ సల్మాన్‌లు.. తమ లాగా ఇతర విద్యార్థులకు ఇబ్బంది పడకూడదని

Most from this category