News


పరుగా? పతనమా?..

Monday 11th March 2019
Markets_main1552294286.png-24531

11200 పాయింట్లు డిసైడ్‌ చేస్తుంది
విశాల్‌ బి మాల్కన్‌ అంచనా
ప్రస్తుతం  నిఫ్టీ అత్యంత కీలక సంధి స్థాయి వద్ద ఉందని మాల్కన్స్‌ వ్యూ అధిపతి విశాల్‌ మాల్కన్‌ చెబుతున్నారు. 11,200 పాయింట్ల వద్ద నిఫ్టీ కదలికలు రాబోయే రోజుల్లో పతనమా, పరుగులా? తేల్చేస్తాయన్నారు. ఈ స్థాయిని ఈ వారంలో దాటడం అత్యంత కీలకమని చెప్పారు. ఈ వారంలో 11200 పాయింట్లను దాటడాన్ని బట్టి రాబోయే రెండు వారాల కదలికలుంటాయని చెప్పారు. ఈ స్థాయిని దాటితే ర్యాలీ ఉంటుందని, దాటలేకపోతే మరో మారు అధోముఖం చూస్తాయని తెలిపారు. 11200 పాయింట్లపైన కొత్త లాంగ్స్‌ తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. 
వివిధ రంగాలపై అభిప్రాయాలు..
1. బ్యాంకింగ్‌: బ్యాంకు నిఫ్టీ చార్టుల్లో బలంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రధాన సూచీ కన్నా బ్యాంకు నిఫ్టీ మంచి మెరుగుదల చూపవచ్చు. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకులు, అందులో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీలు పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించిందని చెప్పారు.
2. ఐటీ: నిఫ్టీఐటీ సూచీ చార్టుల్లో ఆర్‌ఎస్‌ఐ సాపేక్ష మార్పు చూపింది. ఇప్పటివరకు అప్‌సైడ్‌ ఉన్న కదలికలు ముగించి నేల చూపులు మొదలెట్టింది. దీంతో ప్రధాన మార్కెట్‌కు వ్యతిరేకంగా ఐటీ స్టాకుల కదలికలుండవచ్చని అంచనా. 
3. మెటల్‌: జేఎస్‌పీఎల్‌, సెయిల్‌ షేర్లు ప్రస్తుతం కొనుగోళ్లకు ఆకర్షణీయంగా ఉన్నాయి.
4. ఆటో: మారుతీ సుజుకీ, బజాజ్‌ ఆటోలు పాజిటివ్‌ బ్రేకవుట్‌ చూపేందుకు సిద్ధంగా ఉన్నాయి. అశోక్‌ లేలాండ్‌ సైతం ఆకర్షణీయంగానే ఉంది. 

 



You may be interested

ఆల్‌టైంహైకి చేరువలో ఐసీఐసీఐ

Monday 11th March 2019

ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ సోమవారం జీవితకాల గరిష్టానికి చేరువలో ట్రేడ్‌ అవుతోంది. నేడు బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.370.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంజనీరింగ్‌, నిర్మాణ సంస పుంజ్‌ లాయిడ్‌ సంస్థ రూ.853.83 కోట్ల బకాయిలను చెల్లించటంలో విఫలమడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. జస్టిస్‌ ఎంఎం కుమార్‌ సారథ్యంలోని ఇద్దరు సభ్యులతో కూడిన జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ప్రిన్సిపల్‌ బెంచ్‌..

ప్రభుత్వరంగ షేర్ల ర్యాలీ

Monday 11th March 2019

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. బీఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ దాదాపు 3శాతం ర్యాలీ చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఒడిదుడుకుల కారణంగా అత్యధికంగా ప్రభుత్వ రంగ పెట్రో మార్కెటింగ్‌ షేర్లు ఎక్కువగా లాభపడుతున్నాయి. యస్‌బీఐ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు, ఇంధన రంగ షేర్లు సైతం ర్యాలీ చేస్తున్నాయి. హెచ్‌పీఎస్‌ఎల్‌, యస్‌బీఐ, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా,

Most from this category