STOCKS

News


త్వరలో బుల్‌ మార్కెట్‌కు శుభం కార్డు!

Friday 5th April 2019
Markets_main1554449942.png-24987

జిమ్‌ ఓ నీల్‌
అమెరికా నిరుద్యోగ గణాంకాలు 49 ఏళ్ల కనిష్ఠాలకు చేరిన నేపథ్యంలో యూఎస్‌ ఫెడరల్‌ త్వరలో రేట్ల పెంపు దిశగా ధోరణి మార్చుకోవచ్చని, అదే జరిగితే స్టాక్‌ మార్కెట్లో వచ్చిన పదేళ్ల (2009-2019) ర్యాలీ ముగింపునకు వస్తుందని గోల్డ్‌మన్‌ సాక్స్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ మాజీ చైర్మన్‌ జిమ్‌ ఓ నిల్‌ చెప్పారు. విధాన నిర్ణయ పాలసీని కఠినతరం చేస్తామన్న చిన్న సంకేతం ఫెడ్‌ నుంచి వచ్చినా బాండ్‌, స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతాయన్నారు. ఈ ఏడాది చివరకు ఫెడ్‌ తన విధానాన్ని మార్చుకోవచ్చని అంచనా వేశారు. దీంతో మనం చూస్తున్న పదేళ్ల బుల్‌ మార్కెట్‌ ముగింపులోకి అడుగుపెడుతుందన్నారు. ఇందుకు తగ్గట్లే గత ఆరేడు నెలల్లో ఈక్విటీలు తీవ్ర కదలికలను నమోదు చేశాయని, ఇలాంటి కదలికలు గత పదేళ్లలో కానరాలేదని చెప్పారు.

యూఎస్‌, చైనా వాణిజ్య యుద్ధం విత్త మార్కెట్లలో కల్లోలానికి కారణమైందని, అంతర్జాతీయ వృద్దిపై అస్థిరతకు దారితీసిందని తెలిపారు. ఈ దశాబ్దంలో ఎకానమీలో పాజిటివ్‌ ధృక్పధం ఏర్పడేందుకు అమెరికా, చైనా అనే రెండు సూపర్‌ పవర్లు కారణమని, అలాంటి పవర్ల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడితే ఎకానమీ తట్టుకోదని చెప్పారు. అలాగే ఈ రెండింటి మధ్య ఏదైన సానుకూల ఒప్పందం జరిగితే అది మార్కెట్లకు, ఎకానమీకి అతిపెద్ద పాజిటివ్‌ అంశమవుతుందన్నారు. అంతర్జాతీయ సూక్ష్మ ఆర్థికాంశాలు క్రమంగా స్థిరీకరణ దిశగా పయనిస్తున్నాయని, అందువల్ల ఎకానమీలకు రిలీఫ్‌ వస్తుందని అంచనా వేశారు. You may be interested

లాభాల ముగింపు

Friday 5th April 2019

వరుస రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌పడింది. ఈ వారం ప్రధమార్థంలో సూచీలు రికార్డుస్థాయిలకు చేరిన తర్వాత లాభాల స్వీకరణతో గత రెండు రోజులుగా క్షీణతను చవిచూసి, తిరిగి వారాంతంలో లాభాల్లో ముగిసాయి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 177 పాయింట్ల లాభంతో 38,862 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 68 పాయింట్లు జంప్‌చేసి 11,666 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. వారాంతంకావడంతో రోజంతా సూచీలు స్వల్పశ్రేణలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. చివరకు టాటా స్టీల్‌,

జూన్‌లో మరో రేట్‌కట్‌?!

Friday 5th April 2019

దిగ్గజాల అంచనా వచ్చే సమీక్షా సమావేశంలో మరోమారు ఆర్‌బీఐ ఇంకో పావుశాతం రేట్లను తగ్గించే ఛాన్సులున్నాయని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. ఆర్‌బీఐ ధోరణి మరో రేట్‌కట్‌కు అనుకూలంగా ఉందని, ఇందుకు ద్రవ్యోల్బణం దిగిరావడం వీలు కల్పిస్తోందని సీఎల్‌ఎస్‌ఏ ఒక నివేదికలో అభిప్రాయపడింది. వచ్చే నెలల్లో 25- 50 శాతం వరకు ఆర్‌బీఐ రేట్లను తగ్గించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ఫైనాన్షియల్స్‌ ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని పేర్కొంది. ఐసీఐసీఐ,

Most from this category