STOCKS

News


లాంగ్‌టర్మ్‌ కోసం పది సిఫార్సులు

Wednesday 19th September 2018
Markets_main1537338937.png-20376

వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో మంచి రాబడినిచ్చే బలమైన స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రికమండేషన్లు- 
1. డా. రెడ్డీస్‌ ల్యాబ్‌: తొలి త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించింది. నిర్వాహక సామర్ధ్య మెరుగుదలకు చేపట్టిన చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. రాబోయే కాలంలో బయోసిమిలర్స్‌పై ఎక్కువ శ్రద్ధ పెడతామని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ నుంచి కొత్తగా 20 ఉత్పత్తుల లాంచింగ్‌ ఉండవచ్చు. కంపెనీ వ్యాపారం వర్ధమాన మార్కెట్లలో ఈ ఏడాది 16 శాతం వృద్ది సాధిస్తుందని అంచనా. రష్యాలో ఫార్మా పుంజుకోవడం కలిసిరానుంది.
2. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌: కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ వస్తోంది. బలమైన నెట్‌వర్క్‌, బహుళ  ఛానెళ్లు, భారీ ఆడియన్స్‌.. కంపెనీకి మూల బలాలు. తాజా ఫలితాల్లో ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయంలో బలమైన వృద్ధి నమోదయింది. భవిష్యత్‌లో మరింత విస్తరించేందుకు మేనేజ్‌మెంట్‌ సన్నాహాలు చేస్తోంది.
3. బజాజ్‌ ఆటో: కంపెనీకి వైవిధ్యభరితమైన పోర్టుఫోలియో ఉంది. వివిధ మార్కెట్లలో విస్తరణకు పలు చర్యలు తీసుకుంటోంది. పండుగ సీజన్‌ ఆరంభం కావడంతో ద్విచక్రవాహనాల మార్కెట్‌ ఊపందుకోనుంది. రెవెన్యూ, ఎబిటాల్లో మంచి వృద్ది సాధిస్తామని కంపెనీ చెబుతోంది. కొత్త ఏడాది మూలధన వ్యయాలు 300 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో 19 లక్షల యూనిట్లను ఎగుమతి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
4. యూపీఎల్‌: బ్రాండ్‌ నిర్మాణం, కస్టమర్లను చేరుకోవడంపై అధిక శ్రద్ధ వహించడం ద్వారా మార్కెట్‌ వాటాను పెంచుకుంటోంది. తాజాగా ఎరిస్టా లైఫ్‌సైన్సెస్‌ కొనుగోలుతో దిగ్గజ కంపెనీగా అవతరించింది. కొత్త ఉత్పత్తులు, సాంకేతికతపై మేనేజ్‌మెంట్‌ ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. కొత్త ఉత్పత్తుల ఫలాలు త్వరలో కనిపిస్తాయి.
5. ఇండియా హోటల్స్‌ కంపెనీ: సొంత హోటళ్లు, లీజ్‌కు తీసుకున్న హోటళ్లతో క్రమానుగత వృద్ది సాధిస్తోంది. వచ్చే ఐదేళ్ల కోసం ఐదు వేల కోట్ల రూపాయల మూలధన వ్యయాన్ని చేయనుంది. హోటల్‌ పరిశ్రమలో ఏఆర్‌ఆర్‌(యావరేజ్‌ రూమ్‌ రేట్‌) క్రమంగా పెరుగుతోంది. డిమాండ్‌ సప్లై పెరగడంతో పరిశ్రమ పరుగులు తీయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండేషన్లు- 
1. మహానగర్‌ గ్యాస్‌: వ్యాపారంలో ఎదురులేని హోదా అనుభవిస్తోంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. ద్రవరూప ఇంధనాలతో పోలిస్తే సీఎన్‌జీ, పీఎన్‌జీల హవా క్రమంగా పెరగడం కంపెనీకి కలిసివచ్చే అంశం. ఎప్పటికప్పుడు వ్యాపారాన్ని వ్యవస్థీకరించుకుంటోంది. 
2. యాక్సిస్‌ బ్యాంక్‌: బ్యాంకుకు సంబంధించిన బాధలన్నీ క్రమంగా సమసిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉంది. బ్యాంకు కొత్త సీఈఓ వ్యాపారాన్ని ఉరకలెత్తించే ప్రణాళికలు రూపకల్పన చేస్తారని నిపుణులు భావిస్తున్నారు. 
3. రీకో ఆటో: ఎఫ్‌సీసీ నుంచి విడిపడిన అనంతరం వ్యూహాలను మార్చుకుంది. కంపెనీకి రూ. 4800 కోట్ల విలువైన ఆర్డర్‌ బుక్‌ ఉంది. ఎప్పటికప్పుడు సామర్ధ్య విస్తరణ చేపడుతోంది. త్వరలో మరో మూడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. రీరేటింగ్‌ ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
4. ఇంజనీర్స్‌ ఇండియా: హైడ్రోకార్బన్‌, పెట్రోకెమికల్స్‌రంగంలో మూలధన వ్యయాలు పెరగడం కంపెనీకి కలిసివచ్చే అంశం. కంపెనీకి రుణభారం లేదు. దీంతో పాటు దాదాపు 7 వేల కోట్ల రూపాయల విలువైన ఆర్డర్స్‌ కంపెనీ వద్ద ఉన్నాయి. మిగులు నిధులు రూ. 2500 కోట్లున్నాయి. త్వరలో బైబ్యాక్‌, లేదా ప్రత్యేక డివిడెండ్‌ ప్రకటించవచ్చు.
5. సన్‌ఫార్మా: యూఎస్‌లో భారీ పెట్టుబడులున్న భారతీయ ఫార్మా కంపెనీల్లో సన్‌ఫార్మా ఎన్నదగినది. కొత్త ఔషధుల లాంచింగ్‌తో ఓపీఎంలో మెరుగుదల వస్తుందని అంచనా. ప్రస్తుతం యూఎస్‌లో కంపెనీకి 422 అప్రూవ్డ్‌ ఉత్పత్తులు ఉండగా మరో 139 ఉత్పుత్తులు అనుమతుల కోసం వేచి ఉన్నాయి. 

 You may be interested

బన్సల్‌ కేసులో ఇన్ఫీకి ఎదురుదెబ్బ

Wednesday 19th September 2018

మాజీ సీఎఫ్‌వోకి పరిహారం ఇవ్వాల్సిందేనని ఆర్బిట్రేషన్‌ ఉత్తర్వులు న్యూఢిల్లీ: మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) రాజీవ్ ‍బన్సల్‌కి పరిహారం వివాదంపై ఆర్బిట్రేషన్ కేసులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు రూ. 12.17 కోట్ల బకాయిని వడ్డీతో పాటు చెల్లించాల్సిందేనని ఆర్బిట్రేషన్ పానెల్ స్పష్టం చేసింది. బన్సల్‌ ఇప్పటికే తీసుకున్న రూ. 5.2 కోట్ల మొత్తాన్ని వాపసు చేయాలన్న సంస్థ అభ్యర్ధనను పానెల్ తిరస్కరించిందని బీఎస్‌ఈకి ఇన్ఫీ తెలియజేసింది. దీనిపై

టెలికం నుంచి ఆర్‌కామ్ నిష్క్రమణ

Wednesday 19th September 2018

ఇక రియల్టీ వ్యాపారంపైనే దృష్టి ఏజీఎంలో చైర్మన్ అనిల్‌ అంబానీ వెల్లడి ముంబై: ఒకప్పుడు టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) మొత్తానికి ఆ వ్యాపారం నుంచే పూర్తిగా వైదొలగనుంది. ఇకపై భవిష్యత్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. మంగళవారం జరిగిన ఆర్‌కామ్‌ 14వ వార్షిక సాధారణ సమావేశంలో .. రిలయన్స్‌ గ్రూప్‌ (అడాగ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అన్నింటికన్నా ముందుగా ఆర్‌కామ్‌కు

Most from this category