STOCKS

News


ఒడిదుడుకుల మార్కెట్‌లో 10 సేఫ్‌ బెట్స్‌..!

Wednesday 11th July 2018
Markets_main1531297670.png-18203

ముంబై: డివిడెండ్‌ ఈల్డ్‌ పరంగా ఆకర్షణీయంగా ఉన్న కంపెనీలు ఒడిదుడుకుల మార్కెట్‌లో సురక్షిత బెట్స్‌గా నిలుస్తాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా డివిడెండ్‌ చెల్లిస్తున్న కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా రిస్క్‌ను పూర్తిగా తగ్గించవచ్చని చెబుతున్న వీరు.. ఇటువంటి వాటిలో మల్టీబ్యాగర్లు సైతం ఉండేందుకు అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఫండమెంటల్‌ పరంగా చూస్తే.. ఆర్జించిన లాభాలను ఇన్వెస్టర్లకు డివిడెండ్‌ రూపంలో నిలకడగా చెల్లింపులు చేస్తున్న కంపెనీల షేర్లు సాధారణంగా తక్కువ ఒడిదుడుకుల మధ్య ట్రేడవుతాయని వివరించిన కోటక్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ మేనేజర్ హరీష్ కృష్ణన్.. ఈ తరహా కంపెనీల లాభాలు అప్పుడప్పుడు తగ్గిపోయిన సమయంలో కూడా డివిడెండ్‌ను ఇస్తూనే ఉంటాయని వివరించారు. అంతిమంగా కంపెనీ సంపద సృష్టి ఏవిధంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేసేది డివిడెండ్‌ ట్రాక్‌ రికార్డు మాత్రమే అని సూచించిన ఆయన ఫండమెంటల్‌ పరంగా ఇది చాలా ముఖ్యమైన విషయమని వివరించారు. కంపెనీ యాజమాన్యం ఆర్జించిన లాభాలను షేర్‌ హోల్డర్లకు పంచుతుందా లేదంటే విలువ పెంచి నూతన అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం పెట్టుబడులను పెంచుతుందా అనేది చాలా ముఖ్యమని అన్నారు. డివిడెండ్‌ పేఅవుట్‌తో పాటు కంపెనీ వృద్ధి కోసం పెట్టుబడులను పెంచుతున్న షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్న దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు.. ఇన్వెస్టర్ల రిస్క్‌-రివార్డు రేషియో ఆధారంగా తమ పోర్ట్‌ఫోలియోలో డివిడెండ్‌ క్రమంగా చెల్లిస్తున్న షేర్లను 20-60 వరకు నిర్వహించవచ్చని చెబుతున్నారు. 

డివిడెండ్‌ ఈల్డ్‌ ఎక్కువగా ఉండి, రెండంకెల రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ కలిగిన 10 సేఫ్‌ బెట్స్‌ను ఐడీబీఐ క్యాపిటల్‌ సిఫార్సు చేసింది. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌, కోల్‌ ఇండియా, అసీల్యా కాలే సొల్యూషన్స్, కాస్ట్రోల్ ఇండియా, ప్రోక్టర్ అండ్ గాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్, ఇన్ఫోసిస్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ కార్ప్, హిందూస్తాన్ జింక్, హీరో మోటో కార్ప్ షేర్లు అధిక డివిడెండ్‌ ఈల్డ్‌ కలిగి ఉన్నట్లు తెలిపింది.

కేవలం డివిడెండ్‌ ఈల్డ్‌ ఎక్కువగా ఉన్న అన్ని షేర్లు ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పలేమని సూచించిన ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ విశ్లేషకులు అతిష్ మట్లావాలా.. ఇటువంటి షేర్లలో పెట్టుబడులు పెట్టేముందు కంపెనీ భవిష్యత్తును విశ్లేషించి పెట్టుబడి కొనసాగించాలని సూచించారు. భవిష్యత్తు లేక పడిపోతున్న షేర్లు ఎంతటి డివిడెండ్‌ ఇచ్చినా ప్రయోజనం ఉండదని వివరించారు. ఇక్కడ క్రమం తప్పకుండా డివిడెండ్‌ ఇవ్వడం అనేదే ముఖ్యం తప్పించి ఒక్కసారిగా భారీ మొత్తంలో డివిడెండ్‌ ఇవ్వడం అనేది ముఖ్యమైన విషయం కాదన్నారు. డివిడెండ్‌ ఈల్డ్‌నే ప్రమాణికంగా షేర్లను కొనుగోలు చేసేవారు.. ఫిక్సిడ్‌ డిపాజిట్లలో వచ్చేదాని కంటే కనీసం సగానికి తగ్గకుండా వచ్చేలా ఉండాలని కనీసం 3 శాతం రాబడి ఇచ్చే షేర్లను చూడవచ్చని సూచించారు. 

కంపెనీలు డివిడెండ్‌ ఈల్డ్‌ పెంచితే ఆయా కంపెనీల ప్రైస్‌ టూ ఎర్నింగ్న్‌ ఆ మేరకు ప్రతికూలంగా ఉంటాయని ఏంజెల్ బ్రోకింగ్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జైకిషన్ పార్మార్ విశ్లేషించారు. కంపెనీకి భవిష్యత్తు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే విషయాన్ని అధిక డివిడెండ్‌ సూచిస్తుందని, డివిడెండ్‌ అనేది నగదు చెల్లింపులు అయినందున ఆ మేరకు కంపెనీ విలువ తగ్గుతుందన్నారు. విలువ అంటే ఇక్కడ కంపెనీ నెట్‌వర్త్‌, మార్కెట్‌ విలువ అని వివరించిన ఆయన అధిక డివిడెండ్‌ కంపెనీ వాల్యూయేషన్స్‌ను పెంచడంలో ప్రతికూలంగా ఉంటుందన్నారు. ఇందుచేతనే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తక్కువ వాల్యూయేషన్స్‌తో ఉంటున్నాయన్నారు.



You may be interested

పంద్రాగస్టు లోపే మరో ఆల్‌టైమ్‌ హై???

Wednesday 11th July 2018

పరిస్థితులన్నీ సానుకూలంగా కనిపిస్తున్నాయి.. మార్కెట్‌ పండితుల అంచనా రెండు మూడునెలల పతనం, కన్సాలిడేషన్‌ అనంతరం సూచీలు మరోమారు సత్తా చాటుతున్నాయి. నిఫ్టీ 10900 పాయింట్ల పైకి, సెన్సెక్స్‌ 36వేల పాయింట్ల పైకి చేరాయి. బుల్స్‌ పట్టు డీస్ట్రీట్‌పై బిగుస్తోన్న సూచనలు స్పష్టమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు ఆగస్టు లోపే మరో ఆల్‌టైమ్‌ హైని తాకుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల్లోనే ఈ ఫీట్‌ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.

టీసీఎస్‌ టార్గెట్‌ ధర పెంచిన బ్రోకరేజ్‌లు

Wednesday 11th July 2018

క్యు1 ఎర్నింగ్స్‌పై పాజిటివ్‌ స్పందన అద్భుతమైన జూన్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం పలు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు టీసీఎస్‌పై మరింత పాజిటివ్‌గా మారాయి. వివిధ బ్రోకరేజ్‌లు టీసీఎస్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం, టార్గెట్‌ను పెంచడం చేశాయి. ఆ వివరాలు.. - మాక్క్వైరీ సంస్థ టీసీఎస్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి అవుట్‌పెర్ఫామ్‌కు పెంచింది. టార్గెట్‌ ధరను రూ. 2015గా నిర్ణయించింది. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగ మందగమనానికి మందువేసేందుకు కంపెనీ చర్యలు చేపడుతోందని, అవి ఫలితాలను ఇస్తున్నాయని

Most from this category