STOCKS

News


బ్రోకరేజ్‌లు టార్గెట్‌ ధరలు పెంచిన టాప్‌టెన్‌ స్టాక్స్‌

Friday 8th February 2019
Markets_main1549605428.png-24083

క్యు3 ఫలితాల అనంతరం బ్రోకరేజ్‌లు కొన్ని స్టాకులపై బాగా పాజిటివ్‌గా మారాయి. కొన్నింటి టార్గెట్‌ ధరలను పెంచాయి. అలాంటి టాప్‌టెన్‌ స్టాక్స్‌ వివరాలు...
1. ఐజీఎల్‌: డాయిష్‌ బ్యాంకు టార్గెట్‌ను రూ. 315 నుంచి 330కి పెంచింది. వచ్చే రెండేళ్ల ఎర్నింగ్స్‌ అంచనాలను 3 శాతం పెంచింది. ఈపీఎస్‌ వచ్చే రెండేళ్ల పాటు 18 శాతం చక్రీయ వార్షిక వృద్ది సాధిస్తుందని అంచనా వేసింది. కొత్త ప్రాంతాలకు విస్తరించడం ద్వారా రెవెన్యూ పెంచుకుంటోందని తెలిపింది.
2. టెక్‌ మహీంద్రా: క్రెడిట్‌ సూసీ టార్గెట్‌ను రూ. 925 నుంచి 950కి పెంచింది. చాలా త్రైమాసికాల అనంతరం కంపెనీ టెలికం విభాగం మంచి ఫలితాలు సాధించింది. ఎంటర్‌ప్రైజెస్‌ విభాగంలో కూడా 4 శాతం వృద్ధి నమోదయింది. వాల్యూషన్లు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి.
3. మారికో: క్రెడిట్‌ సూసీ టార్గెట్‌ను రూ. 380 నుంచి 400కు పెంచింది. క్యు3లో బలమైన ఫలితాలు సాధించింది. రాబోయే సంవత్సరంలో మార్జిన్‌ విస్తరణ అధికంగా ఉంటుందని అంచనా. పారాషూట్‌ బ్రాండ్‌ విస్తృత ఆదరణ నమోదు చేస్తోంది.
4. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌: సీఎల్‌ఎస్‌ఏ సంస్థ టార్గెట్‌ను రూ. 240 నుంచి 265కి పెంచింది. పాంటలూన్స్‌ స్టోర్‌సేల్స్‌ విక్రయాలు బాగున్నాయి. మార్జిన్లు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఇన్నర్‌వేర్‌ వ్యాపారం వేగంగా వృద్ధిచెందుతోంది. 
5. టైటాన్‌: క్రెడిట్‌సూసీ టార్గెట్‌ను రూ. 935 నుంచి 1175కు పెంచింది. ఫలితాల అనంతరం ఎర్నింగ్స్‌ అంచనాలను 3-10 శాతానికి పెంచింది. పెళ్లిళ్ల సీజన్‌తో కంపెనీకి మరింత కలిసివస్తుందని అంచనా. బంగారం ధరల పెరుగుదల కూడా పాజిటివ్‌ అంశమని తెలిపింది. 
6. ఎస్‌బీఐ: సీఎల్‌ఎస్‌ఏ టార్గెట్‌ను రూ. 370 నుంచి 380కి పెంచింది. పీఎస్‌యూబ్యాంకుల్లో ఎంచుకోవాల్సిన స్టాకని తెలిపింది. క్యు3లో లాభాలు అంచనాలను మించాయి. స్లిపేజ్‌లు తగ్గడం అత్యంత పాజిటివ్‌ అంశమని పేర్కొంది.
7. డా.రెడ్డీస్‌ల్యాబ్‌: సీఎల్‌ఎస్‌ఏ టార్గె్‌ట్‌ను రూ. 2850 నుంచి 3200కు పెంచింది. వ్యయనియంత్రణా చర్యలు ఫలితాలనిస్తున్నాయి. యూఎస్‌ వ్యాపారంలో రికవరీ నమోదవుతోంది. రాబోయే సంవత్సరాల ఈపీఎస్‌ అంచనాలను 2-9 శాతానికి పెంచింది.
8. ఐసీఐసీఐ బ్యాంక్‌: మాక్క్వైరీ టార్గెట్‌ను రూ. 416 నుంచి 460కు పెంచింది. ఆస్తుల నాణ్యతపరంగా మంచి వృద్ది నమోదయింది. ఇతర పారామీటర్లు స్థిరంగా ఉన్నాయి. వడ్డీవ్యయాలు తగ్గేవేళ ఎంచుకోవాల్సిన స్టాకని వ్యాఖ్యానించింది. 
9. ఏసియన్‌ పెయింట్స్‌: మాక్క్వైరీ టార్గెట్‌ను రూ. 1180 నుంచి 1580కు పెంచింది. ఈపీఎస్‌ అంచనాలను 7-16 శాతానికి పెంచింది. వాల్యూం వృద్ధి గణనీయంగా మెరుగైంది. ఉత్పాదకాల వ్యయాలు తగ్గడం, ఉత్పత్తుల ధరలు పెరగడం జంట పాజిటివ్‌ అంశాలు.  
10. హావెల్స్‌ ఇండియా: సీఎల్‌ఎస్‌ఏ టార్గెట్‌ను రూ. 720 నుంచి 775కు పెంచింది. అన్ని విభాగాల్లో రెవెన్యూ వృద్ధి అంచనాలను మించింది. ఏసీ ఇండస్ట్రీల్లో లార్జ్‌ ఛానెల్‌ ఉత్పత్తులు పేరుకపోవడం స్వల్పకాలానికి ఆందోళన కలిగించే అంశం. ఇతర విభాగాల ఉత్పత్తుల విక్రయాలు గాడిన పడ్డాయి. You may be interested

ప్రపంచ బ్యాంక్‌ కొత్త ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మాల్పాస్‌!

Friday 8th February 2019

వాషింగ్టన్‌: ప్రపంచబ్యాంక్‌ కొత్త అధ్యక్షునిగా ప్రముఖ ఆర్థికవేత్త డేవిడ్‌ మాల్పాస్‌ పేరును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించారు. 189 సభ్యదేశాలు సభ్యులుగా ఉన్న  ప్రపంచబ్యాంక్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల ఆమోదంతో ఆయన ఈ బాధ్యతలను చేపట్టగలుగుతారు. ఇది దాదాపు లాంఛనప్రాయమే అయినా, పలు దేశాలు తమ అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించడానికి మార్చి 14 వరకూ బోర్డ్‌ సమయం ఇచ్చింది. ట్రంప్‌ ప్రభుత్వంలో ప్రస్తుతం మాల్పాస్‌ ఆర్థిక శాఖకు సంబంధించి

అంతర్జాతీయ ఐపీ సూచీలో భారత్‌కు 36వ స్థానం

Friday 8th February 2019

8 స్థానాలు పురోగతి న్యూఢిల్లీ: అంతర్జాతీయ మోథోసంపత్తి హక్కుల (ఐపీ) సూచీలో భారత్‌ తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచుకుంది. 2018లో ఈ సూచీ 44 వద్ద ఉండగా, తాజాగా ఇది 8 స్థానాలు మెరుగుపడి 36కు చేరింది. 50 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై విశ్లేషణ ఆధారంగా ఈ సూచీ రూపొందింది. ఈ సూచీలో అమెరికా, బ్రిటన్‌, స్వీడన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు మొదటి తొలి ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. 45 ప్రమాణాల

Most from this category