STOCKS

News


ఎఫ్‌పీఐలు భారీగా కొనుగోలు చేసిన షేర్లు

Friday 30th November 2018
Markets_main1543518381.png-22496

ఎఫ్‌పీఐలు గత రెండు నెలల్లో మన ఈక్విటీ మార్కెట్లలో రూ.30,000 కోట్లకు పైగా అమ్మేశారు. అయితే, దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు నికర కొనుగోలు దారులుగా ఉండడంతో స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోకుండా ఆదుకున్నట్టయింది. ముఖ్యంగా ఎఫ్‌పీఐలు సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికరంగా రూ.10,200 కోట్ల విలువైన అమ్మకాలు జరిపారు. ఆటోమొబైల్స్‌, ఐటీ, మెటల్స్‌, మైనింగ్‌ రంగాల్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు ఎక్కువగా చోటు చేసుకున్నట్టు కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో మన దేశ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.19,000 కోట్లమేర నికరంగా పెట్టుబడులు పెట్టారని తన నివేదికలో పేర్కొంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఎక్కువగా బ్యాంకులు, మెటల్స్‌, మైనింగ్‌, డైవర్సిఫైడ్‌ ఫైనాన్షియల్స్‌లో ఇన్వెస్ట్‌ చేశాయి. 

 

పెద్ద ఎత్తున పెట్టుబడులు
ఎఫ్‌పీఐలు భారీగా పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా ఉన్నాయి. వీరి పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించిన కంపెనీలను గమనించినట్టయితే... ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ టాప్‌లో ఉంది. జూన్‌ క్వార్టర్లో ఈ కంపెనీలో ఎఫ్‌పీఐల వాటా 10.2 శాతమే ఉంటే, సెప్టెంబర్‌ త్రైమాసికానికి 20.6 శాతానికి చేరింది. ఏకంగా 10.4 శాతం మేర పెరిగింది. ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీలో ఎఫ్‌పీఐల వాటా జూన్‌ త్రైమాసికంలో ఉన్న 6.1 శాతం నుంచి 14.6 శాతానికి చేరింది. మహానగర్‌ గ్యాస్‌లో 12.7 శాతం నుంచి 19 శాతానికి, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌లో 15.1 శాతం నుంచి 19.6 శాతానికి, నారాయణ హృదయాలయలో 11.5 శాతం నుంచి 15.5 శాతానికి, కావేరీ సీడ్స్‌లో 15.2 శాతం నుంచి 19 శాతానికి, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌లో 40.3 శాతం నుంచి 43.9 శాతానికి, ఐసీఐసీఐ లాంబార్డ్‌లో 7.2 శాతం నుంచి 10.7 శాతానికి, మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌లో 5 శాతం నుంచి 7.7 శాతానికి, రిలయన్స్‌ క్యాపిటల్‌లో 17.5 శాతం నుంచి 20 శాతానికి ఎఫ్‌పీఐల వాటా పెరిగింది. 

 

భారీగా అమ్మకాలు
ఇక ఎఫ్‌పీఐలు పెద్ద ఎత్తున వాటాలు తగ్గించుకున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో వొడాఫోన్‌ మొదటి స్థానంలో నిలిచింది. జూన్‌ త్రైమాసికంలో ఈ కంపెనీలో ఎఫ్‌పీఐల వాటా 26 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌ క్వార్టర్లో 12.3 శాతానికి తగ్గిపోయింది. పీసీ జ్యూయలర్‌లో 19.1 శాతం నుంచి 13.6 శాతానికి, పీఎన్‌బీలో 8.5 శాతం నుంచి 3.7 శాతానికి ఎఫ్‌పీఐల వాటా తగ్గింది. ఇంకా మన్‌పసంద్‌ బెవరేజెస్‌, వక్రంగీ, అపోలో హాస్పిటల్స్‌, యస్‌ బ్యాంకు, భారత్‌ ఫైనాన్షియల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, డిష్‌ టీవీల్లోనూ ఎఫ్‌పీఐల వాటా కొంత మేర తగ్గడం గమనార్హం. 



You may be interested

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 30th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 32 పాయింట్ల లాభంతో 10,947 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,855 పాయింట్లతో పోలిస్తే 92 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా మిశ్రమంగానే ట్రేడవుతున్నాయి.

యస్‌ బ్యాంకు చైర్మన్‌ కానున్న రాణా కపూర్‌?

Friday 30th November 2018

ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగంలో నాలుగో అతిపెద్ద సంస్థ ‘యస్‌ బ్యాంకు’ కొంత కాలంగా ఎదుర్కొంటున్న కష్టాలు అతి త్వరలోనే సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ బ్యాంకును స్థాపించినప్పటి నుంచి దాని అభివృద్ధిలో అత్యంత ముఖ్య పాత్ర పోషించిన రాణా కపూర్‌ను ఎండీ, సీఈవోగా మరో మూడేళ్ల పాటు కొనసాగేందుకు ఆర్‌బీఐ అనుమతించకపోవడం, జనవరి 31తో దిగిపోవాలని ఆదేశించడం తెలిసిందే. రాణాకపూర్‌ బయటకు వెళ్లిపోతే బ్యాంకు వృద్ధి ఏమవుతుందోనంటూ భవిష్యత్తుపై

Most from this category