STOCKS

News


ఈ ఏడాది బాగా చితక్కొట్టుడు ఈ షేర్లకే...

Wednesday 10th October 2018
Markets_main1539110597.png-20985

స్టాక్‌ మార్కెట్లకు 2018 బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే భారీ అస్థిరతలకు తోడు బలమైన బ్లూచిప్‌ షేర్లకు కూడా వరుసపెట్టి బాదుడు తప్పలేదు. పేరున్న కంపెనీల మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఎన్నో కారణాలతో ఇన్వెస్టర్ల సంపదను భారీగా కాలరాసేసిన షేర్ల వివరాలు (రూ.5 వేల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ కంటే ఎక్కువ ఉండి నష్టపోయినవి) చూస్తే... 

 

పీఎన్‌బీ: 2017 డిసెంబర్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.41,599 కోట్లు. ప్రస్తుతం రూ.17,294 కోట్లు. ప్రస్తుత ధర రూ.62.65. ఈ ఏడాది నష్టం 63 శాతం. 
సుజ్లాన్‌ ఎనర్జీ: 2017 డిసెంబర్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.8,267 కోట్లు. ప్రస్తుత మార్కెట్‌ క్యాప్‌ రూ.2,840 కోట్లు. స్టాక్‌ ధర రూ.5.34. ఈ ఏడాది నష్టం 65 శాతం
వొడాఫోన్‌ ఐడియా: ప్రస్తుత మార్కెట్‌ క్యాప్‌ రూ.30,093 కోట్లు. స్టాక్‌ ధర రూ.34.45. ఈ ఏడాదిలో నష్టం 68.9 శాతం. 
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:  2017 డిసెంబర్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.10,017 కోట్లు. ప్రస్తుత మార్కెట్‌క్యాప్‌ రూ.3,055 కోట్లు. ప్రస్తుత స్టాక్‌ ధర రూ.11.05. ఈ ఏడాది నష్టం రూ.69 శాతం.
శ్రేయి ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌:  2017 డిసెంబర్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.5,023 కోట్లు. ప్రస్తుత మార్కెట్‌ క్యాప్‌ 1,627 కోట్లు. స్టాక్‌ ధర రూ.32.35. ఈ ఏడాది నష్టం రూ.68 శాతం
జైప్రకాష్‌ అసోసియేట్స్‌:  2017 డిసెంబర్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.6,324 కోట్లు. ప్రస్తుతం రూ.1,525 కోట్లు. స్టాక్‌ ధర రూ.6.27. ఈ ఏడాది నష్టం 76 శాతం
జైప్రకాష్‌ పవర్‌వెంచర్స్‌:  2017 డిసెంబర్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.5,708 కోట్లు. ప్రస్తుతం రూ.1,247 కోట్లు. స్టాక్‌ ధర రూ.2.08. ఈ ఏడాది నష్టం రూ.78 శాతం. 
జెట్‌ ఎయిర్‌వేస్‌:  2017 డిసెంబర్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.9,443 కోట్లు. ప్రస్తుత మార్కెట్‌ క్యాప్‌ రూ.1,993 కోట్లు. స్టాక్‌ ధర రూ.175.50. ఈ ఏడాది నష్టాలు రూ.79 శాతం. 
పీసీ జ్యుయలర్‌:  2017 డిసెంబర్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.18,006 కోట్లు. ప్రస్తుతం రూ.2,231 కోట్లు. స్టాక్‌ ధర రూ.56.55. ఈ ఏడాది నష్టం రూ.88 శాతం. 
వక్రంగీ:  2017 డిసెంబర్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.44,576 కోట్లు. ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.3,478 కోట్లు. స్టాక్‌ ధర రూ.32.85. ఈ ఏడాది నష్టాలు 92 శాతం.



You may be interested

ఎన్‌పీఎస్‌ మరింత ఆకర్షణీయం 

Wednesday 10th October 2018

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ఇటీవలి చేసిన పలు మార్పులతో మంచి ఆకర్షణీణయమైన రిటైర్మెంట్‌ సాధనంగా మారిపోయింది. చందాదారులకు మరింత అనుకూలంగా ఉండేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏ పలు చర్యలు తీసుకుంది.    అస్సెట్‌ అలోకేషన్‌ అస్సెట్‌ అలోకేషన్‌లో మార్పులు చేయడం జరిగింది. గతంలో యాక్టివ్‌ చాయిస్‌ ఆప్షన్‌ (అంటే ఇన్వెస్టర్లు ఈక్విటీ, డెట్‌లో ఎంత మేర పెట్టుబడులన్నది సొంతంగా నిర్ణయించుకునేది)లో ఈక్విటీలకు గరిష్ట కేటాయింపు 50 శాతమే ఉండేది. కానీ, అక్టోబర్‌ 1 నుంచి ఇది

టీసీఎస్‌ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Tuesday 9th October 2018

భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌ తన క్యు2 ఫలితాలను గురువారం ప్రకటించనుంది. దీంతో దేశీయ కార్పొరేట్‌ ప్రపంచంలో ఫలితాల సందడి షురూ కానుంది. భారీగా పతనమైన మార్కెట్లకు ఫలితాలు కొత్త ఆశలు ఇస్తాయని ఇన్వెస్టర్లు ఆశగా ఉన్నారు. టీసీఎస్‌ ఫలితాల విషయానికి వస్తే రూపీ క్షీణతతో కంపెనీ ఎబిటా మార్జిన్లు భారీగా మెరుగుపడి ఉంటాయని మెజార్టీ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి.  కంపెనీ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు.. - ఐడీబీఐ క్యాపిటల్‌: టీసీఎస్‌ నికరలాభంలో

Most from this category