STOCKS

News


3 వారాల్లో లాభాలందించే 10 స్టాక్స్‌

Monday 19th November 2018
Markets_main1542622136.png-22189

బ్రోకరజ్‌ సంస్థలు వచ్చే మూడు వారాల్లో లాభాలను అందించగలిగే 10 స్టాక్స్‌ను సిఫార్సు చేశాయి. సిఫార్సుల వివరాలు....

ఆనంద్‌రాఠి
అపోలో హాస్పిటల్‌: ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.1,350. స్టాప్‌ లాస్‌ రూ.1,190. టెక్నికల్‌గా చూస్తే ఈ స్టాక్‌ ఇన్‌వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. వేవ్‌-4 పూర్తయ్యింది. వేవ్‌-5 ప్రారంభం కావొచ్చు. 

కెనరా బ్యాంక్‌: ఈ స్టాక్‌ గత వారపు నిరోధ స్థాయి నుంచి బ్రేక్‌ఔట్‌ అయ్యింది. డైలీ ఇండికేటర్లు బై మోడ్‌ను సూచిస్తున్నాయి. రానున్న రోజుల్లో స్టాక్‌లో అప్‌ట్రెండ్‌ ఉండొచ్చు. రూ.295 టార్గెట్‌ ప్రైస్‌తో రూ.249 స్టాప్‌లాస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 

ఎవరెడీ ఇండస్ట్రీస్‌: ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.243. స్టాప్‌ లాస్‌ రూ.189. సమీప కాలంలో స్టాక్‌లో అప్‌ట్రెండ్‌ ఉండొచ్చు.

బీఎన్‌పీ పారిబా
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: గత కొన్ని వారాలుగా ఈ స్టాక్‌ రికవరీ మోడ్‌లో ఉంది. గత కొన్ని సెషన్లుగా కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. డైలీ మూవింగ్‌ యావరేజ్‌ వద్ద సపోర్ట్‌ తీసుకుంది. అక్కడి నుంచి పైకి పెరగొచ్చు. శుక్రవారం రోజు కన్సాలిడేట్‌ రేంజ్‌ నుంచి పైకి బ్రేక్‌ఔట్‌ అయ్యింది. డైలీ ఇండికేటర్స్‌ బై సిగ్నల్‌ను సూచిస్తున్నాయి. రూ.130 టార్గెట్‌ ప్రైస్‌తో రూ.130 స్టాప్‌లాస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 

విజయ బ్యాంక్‌: రూ.50 టార్గెట్‌ ప్రైస్‌తో రూ.41 స్టాప్‌లాస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. గత కొన్ని సెషన్లుగా తన సహ బ్యాంకులతో పోలిస్తే అండర్‌పర్ఫార్మ్‌ చేస్తూ వస్తోంది. రానున్న సెషన్లలో వేగంగా రికవరీ అవ్వొచ్చు. డైలీ ఇండికేటర్లు బుల్లిష్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచాయి. అప్‌సైడ్‌కు ఛాన్స్‌ ఉంది. 

జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌
హాత్‌వే కేబుల్‌: గత కొన్ని వారాలుగా ఈ స్టాక్‌ కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. ఎటువైపేనా ప్రైస్‌ మూమెంట్‌ ఉండొచ్చు. అయితే టెక్నికల్‌గా చూస్తే అస్‌సైడ్‌కు ఛాన్స్‌ ఉంది. అప్పర్‌ బొలింగర్‌ బాండ్‌కు పైన స్టాక్‌ ధర ముగిసింది. స్టాక్‌లో ఒడిదుడుకులతోపాటు ధర కూడా పెరగొచ్చు. ఆర్‌ఎస్‌ఐ బుల్లిష్‌గా ఉంది. పీపీవో కూడా పాజిటివ్‌గానే కనిపిస్తోంది. స్టాక్‌ ధరలో అప్‌సైడ్‌కు ఎక్కువగా అవకాశముంది. రూ.38 టార్గెట్‌ ప్రైస్‌తో రూ.27 స్టాప్‌లాస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 

ఇండియన్‌ హోటల్స్‌: రూ.160 టార్గెట్‌ ప్రైస్‌తో రూ.120 స్టాప్‌లాస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. గత కొన్ని రోజులుగా ఈ స్టాక్‌ కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. స్టాక్‌ ధర డైలీ చార్ట్‌లో అప్పర్‌ బొలింగర్‌ బాండ్‌ బయటకు కదలింది. టెక్నికల్‌గా చూస్తే అప్‌ట్రెండ్‌ కనిపిస్తోంది. పీపీవో పాజిటివ్‌గానే ఉంది. ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌ను ఏర్పరచింది. ఆర్‌ఎస్‌ఐ బుల్లిష్‌ సిగ్నల్‌ ఇస్తోంది. రానున్న రోజుల్లో స్టాక్‌లో అప్‌ట్రెండ్‌ ఉండొచ్చు. 

చార్ట్‌వ్యూఇండియా
బ్రిటానియా: ఆరు సెషన్లలోని మైనర్‌ కన్సాలిడేట్‌ జోన్‌ నుంచి స్టాక్‌ బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. షార్ట్‌ టర్మ్‌ అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. ఇన్వర్టెడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అవ్వాలని ప్రయత్నిస్తోంది. పొజిషనల్‌ ట్రేడర్లు ఈ స్టాక్‌ను రూ.6,300 టార్గెట్‌ ప్రైస్‌తో, రూ.5,780 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయవచ్చు.

వెంకీస్‌ ఇండియా: షార్ట్‌ టర్మ్‌ చార్ట్స్‌లో ఈ స్టాక్‌ అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. బలమైన గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌తో అధిక వ్యాల్యూమ్స్‌తో ర్యాలీ చేసింది. గత ఆరు సెషన్ల నష్టాలను కవర్‌ చేసింది. వీక్లి చార్ట్‌లో హ్యామర్‌ను ఏర్పరచింది. పొజిషనల్‌ ట్రేడర్లు రూ.2,814 టార్గెట్‌ ప్రైస్‌తో రూ.2,300 స్టాప్‌లాస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

విజయ బ్యాంక్‌: ఈ స్టాక్‌ ఇటీవల రూ.66 స్థాయి నుంచి పడిపోయింది. రూ.40 స్థాయిలో కన్సాలిడేట్‌ అవ్వొచ్చు. పుల్‌బ్యాక్‌కు ఛాన్స్‌ ఉంది. రూ.49కి సులభంగా చేరొచ్చు. పొజిషనల్‌ ట్రేడర్లు రూ.40 స్టాప్‌లాస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.   



You may be interested

10750 పైన నిఫ్టీ ముగింపు

Monday 19th November 2018

300 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్‌ సానుకూల అంతర్జాతీయ సంకేతాలు మరోసారి దేశీయ మార్కెట్‌ను ముందుండి నడిపించాయి. ఫలితంగా మార్కెట్‌ వరుసగా 3రోజూ లాభాల్లో ముగిసింది.  ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, ఐరోపా మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్లు లాభాల ట్రేడింగ్‌ సూచీలకు కలిసొచ్చాయి. ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌, ఫార్మా, అటో, రియల్టీ రంగ షేర్ల కొనుగోళ్ల మద్దతు లభించింది. పలితంగా సెన్సెక్స్‌ 300 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 10750 పాయింట్ల మార్కును

ఎన్‌ఎండీసీకి జేపీ మోర్గాన్‌ బై రేటింగ్‌

Monday 19th November 2018

దొనిమలై మైనింగ్‌ ప్లాంట్‌ ఐరన్‌ ఓర్‌ అమ్మకాలపై కర్ణాటక ప్రభుత్వం అధిక పన్నును విధించినప్పటికి ఎన్‌ఎండీసీ షేరుకు ప్రముఖ రేటింగ్‌ సంస్థ జేపీమోర్గాన్‌ బై రేటింగ్‌ను కేటాయించింది. ఎన్‌ఎండీసీ సంస్థ దొనిమలై మైనింగ్‌ నుంచి ఏడాదికి 6మిలియన్‌ టన్నుల ఖనిజం ఉత్పత్తవుతుంది. అయితే ఈ మైనింగ్‌ లైసెన్సు పొడిగింపునకు ఎన్‌ఎండీసీపై కర్నాటక ప్రభుత్వం...ఫీజుపై 80 శాతం ప్రీమియం విధించింది.  ఈ ప్రీమియం చెల్లింపునకు ఎన్‌ఎండీసీ ఇప్పటివరకూ అంగీకారం తెలపలేదు. ప్రీమియం చెల్లించకపోతే

Most from this category