ఏడాదికోసం టాప్‌టెన్ సిఫార్సులు
By D Sayee Pramodh

వచ్చే 12నెలల కాలానికి 30 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను జేఎం ఫైనాన్షియల్స్, షేర్‌ఖాన్ రికమండ్ చేస్తున్నాయి..
1. అపోలోటైర్స్: కొనొచ్చు. టార్గెట్ రూ. 305. దేశీయ ట్రక్, బస్ టైర్ల విభాగంలో బలంగా ఉంది. చైనా టైర్లపై విధించిన సుంకం కారణంగా కంపెనీ విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. దీనికితోడు హంగరీ ప్లాంట్ కార్యకలాపాలు పునర్వ్యవస్థీకరించడంతో యూరప్ వ్యాపారం మరింత జోరందుకోనుంది. ఈ ప్లాంట్‌తో ఎబిటా మార్జిన్లలో బ్రేక్ ఈవెన్వస్తుందని అంచనా. దేశీయంగా రీప్లేస్మెంట్ విభాగంలో డిమాండ్ పెరగడం కంపెనీకి ప్రయోజనకారి.
2. ఎంఅండ్ఎం ఫైనాన్షియల్స్: కొనొచ్చు. టార్గెట్ రూ. 625. సకాల వర్షాలు, పెరిగిన సాగు బడ్జెట్, జోరందుకోనున్న వ్యవసాయాదాయం... కంపెనీ ఆర్ఓఈని మెరుగుపరచనున్నాయి. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్లో 20 శాతం వృద్దిని కంపెనీ అంచనా వేస్తోంది. కంపెనీ వచ్చే రెండేళ్ల పాటు ఎర్నింగ్స్‌లో 43 శాతం చక్రీయ వార్షిక వృద్ధి సాధించగలదని భావిస్తోంది. లోన్‌గ్రోత్ పుంజుకోవడం కలిసివస్తుంది.
3. నవీన్ ఫ్లోరిన్: కొనొచ్చు. టార్గెట్ రూ. 900. ఫార్మా, అగ్రికెమికల్స్లో ఫ్లోరిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్లోరిన్ రిసెర్చ్ రంగంలో కంపెనీకి ఐదు దశాబ్దాల అనుభవం ఉంది. ప్రపంచంలో ఈ తరహా అనుభవం, ఉత్పత్తి ప్లాంట్లు ఉన్న కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇటీవలే కంపెనీ పిరమల్‌తో ఒక జేవీ కుదుర్చుకుంది. దీంతో సామర్ధ్య వినియోగం మరింత పెరగనుంది. దీనికితోడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీఆర్ఏఎంఎస్ ప్లాంట్‌పై కంపెనీ విశేషంగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్లాంట్ వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తుంది.
4. ఓబెరాయ్ రియల్టీ: కొనొచ్చు. టార్గెట్ రూ. 550. గోరేగావ్, బోరివాలి ప్రాజెక్టుల్లో క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. కానీ ములుంద్ ప్రాజెక్ట్‌లో విక్రయాలు మందకొడిగా ఉన్నాయి. థానే మైక్రోమార్కెట్లోకి కంపెనీ ప్రవేశించడం కలిసివచ్చే అంశం. క్రమంగా ఈ రంగంలో డిమాండ్ పెరగడం కంపెనీ విక్రయాల్లో జోరు పెంచుతుందని అంచనా. కంపెనీ బాలెన్స్ షీట్ బలంగా ఉంది.
5. శోభా డెవలపర్స్: కొనొచ్చు. టార్గెట్ రూ. 600. బెంగళూర్ మార్కెట్లో స్థిరపడడం, గుర్గావ్, కొచిల్లో డిమాండ్ పెరగడంతో కంపెనీ ఉత్సాహంగాఉంది. మరిన్ని కొత్త లాంచింగ్‌లతో ప్రస్తుత మెరుగుదల కొనసాగిస్తుంది. ఇటీవలే సరసమైన గృహనిర్మాణ విభాగంలోకి కాలుపెట్టింది. ఈ రంగంలో దూసుకుపోయేందుకు విస్తృత అవకాశాలున్నాయి.
6. టీవీఎస్ మోటర్స్: కొనొచ్చు. టార్గెట్ రూ. 725. కొత్త భాగస్వామి బీఎండబ్ల్యు త్వరలో ప్రీమియం బైకులను లాంచ్ చేయనుంది. దీంతో ఈ విభాగంలో కంపెనీ స్థానం మరింత స్థిరపడుతుంది. కంపెనీకి ఉన్న విస్తృత నెట్వర్క్, కొత్త లాంచింగ్‌లు మరింత మార్కెట్ వాటా కొల్లగొట్టేందుకు దోహదం చేస్తాయి. వచ్చే రెండేళ్ల పాటు ఎర్నింగ్స్‌లో 39 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉండవచ్చు.
7. హెచ్డీఎఫ్సీ బ్యాంక్: కొనొచ్చు. టార్గెట్ రూ. 2470. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల విభాగాల్లో మంచి వృద్ధి నమోదు చేస్తూ వస్తోంది. ఇదే జోరు ముందుముందుకూడా కొనసాగుతుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో బలంగా ఉంది.
8. వీగార్డ్ ఇండస్ట్రీస్: కొనొచ్చు. టార్గెట్ రూ. 220. ఏసీలు, వంటింటి సామాగ్రి విభాగంలో మంచి వృద్దిని సాధిస్తోంది. ప్రచారాన్ని ఉధృతం చేయడం, ప్రచార వ్యయాలను పెంచడం ద్వారా వేగంగా చొచ్చుకుపోతోంది. గ్రాస్ మార్జిన్లలో వంద బీపీఎస్ పెరుగుదలను అంచనా వేస్తోంది. ఎర్నింగ్స్‌లో 24 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉండవచ్చు.
9. టీసీఎస్: కొనొచ్చు. టార్గెట్ రూ. 2200. స్థిర కరెన్సీ రెవెన్యూ, ఎబిటా మార్జిన్లలో అంచనాలను మించిన ఫలితాలు చూపింది. డిజిటల్ బిజినెస్ క్రమంగా వృద్ధికి కీలకంగా మారుతోంది. బీఎఫ్ఎస్ఐ విభాగంలో సైతం రెవెన్యూ క్రమానుగతంగా వృద్ధి సాధించే సంకేతాలు ఇస్తున్నాయి.
10. జీఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్: కొనొచ్చు. టార్గెట్ రూ. 680. మాస్, అర్బన్ ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌తో దూసుకుపోతోంది. ఇటీవలి బలహీనతను ముగించి తిరిగి అప్‌మూవ్‌కు రెడీగా ఉంది. మీడియా రంగంలో నిర్మానాత్మక షేరు. వచ్చే రెండేళ్ల పాటు ఎర్నింగ్స్‌లో 30 శాతం చక్రీయవార్షిక వృద్ధి ఉంటుందని అంచనా.
You may be interested
తగ్గిన పసిడి..!
Friday 13th July 2018ముంబై:- డాలర్ స్థిరమైన ర్యాలీ కారణంగా శుక్రవారం పసిడి ధర తగ్గింది. అమెరికా గురువారం విడుదల చేసిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు సానుకూలంగా ఉండటంతో పాటు, అమెరికా - చైనా వాణిజ్య యద్ధ భయాల నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యంతో డాలర్ బలపడింది. డాలర్ ఇండెక్స్ గురువారం ఆసియా ట్రేడింగ్‌లో 94.93 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. డాలర్ స్థిరమైన ర్యాలీతో ప్రస్తుతం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 2.20
శుక్రవారం వార్తల్లోని షేర్లు
Friday 13th July 2018వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు ఫోర్టీస్ హెల్త్‌కేర్:- అనేక పరిమాణాల అనంతరం మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బిడ్డింగ్‌కు ఆమోదం తెలిపింది. తాజాగా బిడ్డింగ్ ద్వారా ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ సంస్థ ఫోర్టీస్ హెల్త్‌కేర్‌లో రూ.4వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్:- ప్రతి షేరు ధర రూ.1100ల చొప్పున మొత్తం 3.63 కోట్ల ఈక్విటీ షేర్ల బై బ్యాక్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్