STOCKS

News


ఈ పది స్టాక్స్‌ బఫెట్‌కు నచ్చుతాయ్‌!?

Wednesday 24th April 2019
Markets_main1556046003.png-25299

లాభాలు పోగేసుకోవాలంటే కచ్చితంగా సరైన స్టాక్స్‌ ఎంపికతోనే సాధ్యపడుతుంది. ఈ విషయంలో ప్రపంచ ప్రముఖ ఇన్వెస్టర్‌, బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ సిద్ధ హస్తుడు. వారెన్‌ బఫెట్‌ అన్ని కాలాల్లోనూ విజయవంతమైన ఇన్వెస్టర్‌గా ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే. బెంజమిన్‌ గ్రాహమ్‌కు బఫెట్‌ మాజీ విద్యార్థి కూడా. యాజమాన్యం నాణ్యత, కంపెనీ వృద్ధి అవకాశాలను చూసి ఆయన ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. వీటిల్లోనూ సరసమైన ధరల వద్ద ట్రేడ్‌ అయ్యే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. బఫెట్‌ సూత్రాలు ఇతర ఇన్వెస్టర్లకు సైతం రాబడులను తెచ్చిపెట్టేవేనని విశ్లేషకులు భావిస్తుంటారు. మార్కెట్‌ స్మిత్‌ గణాంకాల ప్రకారం అధిక మాస్టర్‌ స్కోర్‌, ఆర్‌ఎస్‌ రేటింగ్‌ స్టాక్స్‌ కలిగిన కంపెనీల వివరాలను గమనిస్తే... 

 

బఫెట్‌ పాటించే విలువలకు ఈ స్టాక్స్‌ సరితూగేవే. మార్కెట్‌ స్మిత్‌ రూపొందించిన వడపోతే మాస్టర్‌ స్కోర్‌. అంటే అధిక వృద్ధి అవకాశాలను, షేరు ధర పనితీరును ఇది సూచిస్తుంది. బఫెట్‌ అనుసరించే ఎర్నింగ్స్‌ వృద్ధి, షేర్ల వ్యాల్యూమ్‌, పరిశ్రమ బలాలు అన్నీ కూడా మాస్టర్‌ స్కోర్‌లో ప్రతిఫలిస్తాయి. రిలేటివ్‌ స్ర్టెంత్‌ రేటింగ్‌ (ఆర్‌ఎస్‌ రేటింగ్‌) అన్నది మార్కెట్లో టాప్‌ పనితీరును ప్రదర్శించే కంపెనీలను గుర్తించే టెక్నికల్‌ టూల్‌.

 

కంపెనీ                      మాస్టర్‌స్కోర్‌             ఆర్‌ఎస్‌ రేటింగ్‌
పోషక్‌                       74                          85
హానీవెల్‌ ఆటోమేషన్‌    70                          88
హెచ్‌డీఎఫ్‌సీ               69                          76
కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌     69                          81
ఆస్ట్రల్‌పాలీ                 68                           89
శ్రీసిమెంట్స్‌                68                           90
టీటీకే ప్రెస్టీజ్‌               66                           91
బెర్జర్‌ పెయింట్స్‌          63                           80
శ్రేయాన్స్‌ ఇండస్ట్రీస్‌      62                           71
గ్రైండ్‌వెల్‌                   62                           85



You may be interested

బుల్‌ రన్‌ ఈ రంగంలోనే...!

Wednesday 24th April 2019

పెరుగుతున్న దేశ ప్రజల తలసరి ఆదాయం, పెరుగుతున్న యువ జనాభా ఇవన్నీ వినియోగానికి ఊతమిచ్చేవే. మరి ఈ వినియోగ రంగమే పెట్టుబడులకు మంచి అవకాశాలున్న రంగంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రంగం కచ్చితంగా ర్యాలీ చేస్తుందని, ఇందులో మంచి బెట్స్‌ ఏవన్నది ఎంపిక చేసుకోవడం ఇన్వెస్టర్ల చేతుల్లో ఉందంటున్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాల చర్యలు, మొబైల్‌, ఇంటర్నెట్‌ వినియోగం వేగంగా విస్తరిస్తుండడం వంటి అంశాలు సైతం దేశ వినియోగ

ధోని జోరు.. సీఎస్‌కే షేరు హుషారు..

Tuesday 23rd April 2019

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీకి, ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి చెప్పక్కర్లేదు. ఈ టీమ్‌ ప్రతి సీజన్‌లో టాప్‌ పొజిషన్లలోనే ఉంటుంది. ఐపీఎల్‌లో బాగా విజయవంతమైన ఫ్రాంచైజీగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను పేర్కొంటారు. ప్రస్తుత సీజన్‌లో కూడా సీఎస్‌కే బాగా రాణిస్తోంది. జట్టు సారధి ధోని నాయకత్వంలో సీఎస్‌కే కోట్ల మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇదంతా క్రికెట్‌ స్టేడియంలో సంగతి. అయితే ధోనీ కారణంగా సీఎస్‌కే ట్రేడింగ్‌

Most from this category