STOCKS

News


నెలలో 11% రాబడినిచ్చే స్టాక్స్‌!!

Monday 24th December 2018
Markets_main1545638649.png-23201

స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు వచ్చే నెల రోజుల్లో 11 శాతం దాకా రాబడిని అందించే పది స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం.. 

అనలిస్ట్‌: 5నాన్స్‌.కామ్‌ ఫౌండర్‌, సీఈవో దినేశ్‌ రొహిరా

గృహ్‌ ఫైనాన్స్‌: ఈ స్టాక్‌ గత కొన్ని సెషన్లుగా పాజిటివ్‌ ట్రెండ్‌లో ట్రేడ్‌ అవుతూ వస్తోంది. ఇటీవల రూ.298 వద్ద 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ను బ్రేక్‌ఔట్‌ చేసింది. ఈ షేరు గత రెండు నెలల కాలంలో రూ.340 నుంచి రూ.240-250 స్థాయికి కరెక‌్షన్‌ అయ్యింది. అయితే రూ.280 వద్ద మద్దతు తీసుకొని వెంటనే బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. తర్వాత అప్‌ట్రెండ్‌లో ఉంటూ వస్తోంది. వీక్లి చార్ట్‌లో లాంగ్‌ బుల్లిష్‌ క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. మోమెంటమ్‌ ఇండికేటర్‌ పాజిటివ్‌గా ఉంది. ఆర్‌ఎస్‌ఐ 57 స్థాయి వద్ద ఉంది. ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ను ఏర్పరచవచ్చు. రూ.347 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనొచ్చు. స్టాప్‌లాస్‌ రూ.305. దాదాపు 5 శాతం రాబడి పొందొచ్చు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌: ఆరు నెలల ప్రైస్‌ చార్ట్‌ను గమనిస్తే.. ఈ స్టాక్‌ నెగటివ్‌ అంచనాలతోనే ట్రేడవుతోంది.  గత నెల కాలంగా రికవరీ కనిపిస్తున్నా కూడా 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌కు పైగా నిలదొక్కుకోలేకపోయింది. కిందకు పడిపోయింది. తర్వాత మళ్లీ పైకి కదలడానికి ప్రయత్నించినా కూడా ఫలితం దక్కలేదు. వీక్లి, డైలీ చార్ట్‌లో బేరిష్‌ క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ను ఏర్పరచవచ్చు. ఆర్‌ఎస్‌ఐ నెగటివ్‌ డైవర్జెన్సీని సూచిస్తోంది. ఈ స్టాక్‌ను రూ.430 టార్గెట్‌ ప్రైస్‌తో విక్రయించొచ్చు. స్టాప్‌లాస్‌ రూ.470.

గ్రాఫైట్‌ ఇండియా: అక్టోబర్‌ కరెక‌్షన్‌ తర్వాత రిబౌండ్‌ అయిన ఈ స్టాక్‌ గత నెల రోజులుగా నెగటివ్‌ అంచనాలతో ట్రేడవుతోంది. 200 మూవింగ్‌ యావరేజ్‌ రూ.844పైన నిలబడలేకపోయింది. స్టాక్‌పై ఒత్తిడి నెలకొంది. వీక్లి చార్ట్‌లో బేరిష్‌ క్యాండిల్‌స్టిక్‌ను ఏర్పరచింది. ఆర్‌ఎస్‌ఐ డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. ఎంఏసీడీ కూడా సిగ్నల్‌లైన్‌ దిగువున ట్రేడ్‌ అవుతోంది. ఈ స్టాక్‌ను రూ.770 టార్గెట్‌ ప్రైస్‌తో విక్రయించొచ్చు. స్టాప్‌లాస్‌ రూ.830. 

అనలిస్ట్‌: సెం‍ట్రమ్‌ బ్రోకింగ్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ అనలిస్ట్‌ జై పురోహిత్‌

అదానీ పోర్ట్స్‌: నవంబర్‌ ర్యాలీ తర్వాత ఈ స్టాక్‌ పడిపోతూ వస్తోంది. అయితే శుక్రవారం మూడు వారాల కన్సాలిడేషన్‌ స్థాయి నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. అయితే స్టాక్‌ ఈ బ్రేక్‌ఔట్‌ స్థాయికి పైన నిలబడలేకపోయింది. అధిక వ్యాల్యూమ్స్‌తో పడిపోయింది. ఇది నెగటివ్‌ సంకేతం. ఆర్‌ఎస్‌ఐ నెగటివ్‌ ట్రెండ్‌ సూచిస్తోంది. అందువల్ల స్టాక్‌ ధర రానున్న రోజుల్లో రూ.335- 330 స్థాయికి పడిపోవచ్చు. రూ.370 స్థాయి వైపునకు పెరిగితే.. ట్రేడర్లు షార్ట్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.383.

పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌: గత ఐదు వారాలుగా ఈ స్టాక్‌ పెరుగుతూ వస్తోంది. గత వారంలో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. మళ్లీ కిందకు వచ్చింది. ఆర్‌ఎస్‌ఐ నెగటివ్‌ డైవర్జెన్సీని సూచిస్తోంది. రానున్న రోజుల్లో ఈ స్టాక్‌ రూ.1060-1040 స్థాయికి రావొచ్చు. అందువల్ల రూ.1165-1170 శ్రేణిలో షార్ట్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.1213

టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌: ఈ ఏడాది ఆ స్టాక్‌ రూ.111 నుంచి రూ.325 వరకు ర్యాలీ చేసింది. అయితే తర్వాత స్టాక్‌ ధర 52 వారాల గరిష్ట స్థాయి నుంచి దాదాపు 40 శాతం క్షీణించింది. పైన పేర్కొన్న ర్యాలీలో 61.8 శాతం రిట్రెస్‌మెంట్‌ స్థాయి వద్ద మద్దతు తీసుకుంది. గత కొన్ని రోజులుగా స్టాక్‌ ధర రిబౌండ్‌ అవుతూ వస్తోంది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ డైవర్జెన్సీని సూచిస్తోంది. స్టాక్ ధర రూ.235- 240 స్థాయికి పెరగొచ్చు. స్టాప్‌లాస్‌ రూ.205. 

బ్రోకింగ్‌ సంస్థ: ఎస్‌ఎంఎస్‌ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌

హెచ్‌పీసీఎల్‌: ఈ స్టాక్‌ డిసెంబర్‌ 21న రూ.250 వద్ద క్లోజయ్యింది. అక్టోబర్‌ 5న 52 వారాల కనిష్ట స్థాయి రూ.163ని, జనవరి 15న రూ.435 గరిష్ట స్థాయిని తాకింది. 200 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ రూ.276 వద్ద ఉంది. ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి నుంచి ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా ఏడాది కనిష్ట స్థాయిని పడిపోయింది. స్టాక్‌ ధరతో పాటు వ్యాల్యూమ్స్‌ కూడా పెరుగుతున్నాయి. అంటే స్టాక్‌ను ఎక్కువగా కొంటున్నారు. ఈ స్టాక్‌ను రూ.245-247 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. ధర రూ.270-275 స్థాయికి పెరగొచ్చు. స్టాప్‌లాస్‌ రూ.230.    

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌: ఈ స్టాక్‌ డిసెంబర్‌ 21న రూ.1154 వద్ద క్లోజయ్యింది. అక్టోబర్‌ 9న 52 వారాల కనిష్ట స్థాయి రూ.691ని, ఏప్రిల్‌ 20న 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. 200 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ రూ.1050 వద్ద ఉంది. వీక్లి చార్ట్‌లో ఈ స్టాక్‌ ఇన్వర్టెడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌ ఏర్పర్పిచింది. ఇది బుల్లిష ట్రెండ్‌ను సూచిస్తోంది. ఈ స్టాక్‌ను రూ.1135-1145 శ్రేణిలో కొనొచ్చు. స్టాక్‌ ధర రూ.1230-1250 స్థాయికి పెరగొచ్చు. స్టాప్‌లాస్‌ రూ.1060. 

బ్రోకింగ్‌ సంస్థ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌

బజాజ్‌ ఫైనాన్స్‌: వీక్లి క్లోజింగ్‌ ప్రకారం చూస్తే బజాజ్‌ ఫైనాన్స్‌ 4 శాతం లాభంతో ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ కేవలం 1 శాతం మేర లాభపడింది. అంటే ఇండెక్స్‌తో పోలిస్తే స్టాక్‌ ఔట్‌పర్ఫార్మ్‌ చేసింది. స్టాక్‌ ధర 21 అండ్‌ 50 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌కు పైన కన్సాలిడేట్‌ అయ్యింది. అలాగే లాంగ్‌టర్మ్‌ 200 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ రూ.2274కు పైనే ఉంది. ఈ స్టాక్‌ను రూ.2750 టార్గెట్‌ ప్రైస్‌తో కొనొచ్చు. స్టాప్‌లాస్‌ రూ.2450. 

ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌: నిఫ్టీలో ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ ఔట్‌పర్ఫార్మర్‌గా ఉంది. గత వారంలో 2 శాతానికి పైగా లాభంతో క్లోజయ్యింది. అదే సమయంలో నిఫ్టీ 0.45 శాతం నెగటివ్‌ రిటర్న్‌తో ముగిసింది. రూ.304 స్థాయిలో ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా స్టాక్‌ రూ.240 స్థాయికి పడిపోయింది. రూ.200 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ వద్ద మద్దతు తీసుకొని పైకి పెరిగింది. స్టాక్‌ను రూ.280 టార్గెట్‌ ప్రైస్‌తో కొనొచ్చు. స్టాప్‌లాస్‌ రూ.245.  You may be interested

ఐటీ స్టాక్స్‌ అప్‌

Monday 24th December 2018

2శాతం ర్యాలీ చేసిన ఇన్ఫీ, టీసీఎస్‌ షేర్లు మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., సోమవారం ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు లాభాల బాట పట్టాయి. ఐటీ రంగంలో ఈ నెలలో కూడా ఉద్యోగ నియామకాల సృష్టి పెరగడంతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి నష్టాల ప్రారంభం ఐటీ షేర్ల ర్యాలీకి కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1శాతం పెరిగింది. ఐటీ రంగంలో వరుసగా 8నెలలో ఉద్యోగ

రియల్టీ షేర్ల నేలచూపులు

Monday 24th December 2018

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ట్రేడింగ్‌లో రియల్టీ రంగ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2.50శాతం నష్టపోయింది. ఈ రంగంలో ప్రధాన కంపెనీ షేర్లైన డీఎల్‌ఎఫ్‌ అత్యధికంగా 4.50శాతం నష్టపోయింది. అలాగే ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, శోభ లిమిటెడ్‌ షేర్లు 3శాతం పతనమవడంతో పాటు, ఫోనిక్స్‌ లిమిటెడ్, సన్‌టెక్‌, ఓబెరాయ్‌ లిమిటెడ్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. మరోవైపు ఇదే రంగానికి చెందిన

Most from this category