STOCKS

News


నెలరోజుల కోసం 10 సిఫార్సులు

Monday 3rd December 2018
Markets_main1543827233.png-22594

ముంబై: గతనెలలో నిఫ్టీ మూడు శాతం మేర లాభపడింది. నవంబర్‌ 30 ముగింపుతో ఈసూచీ 200-రోజుల సగటు కదలికల స్థాయి అయిన 10,800 పాయింట్ల ఎగువకు చేరింది. సెన్సెక్స్‌ 36,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ డిసెంబర్‌ సిరీస్‌ రోలోవర్స్‌ మూడు నెలల సగటుకు మించి నమోదయ్యాయి. ఈ అంశం ఆధారంగా సూచీలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఆర్బీఐ సమావేశం, ఎన్నికల సమయం కావడం వల్ల ఒడిదుడుకులు అధికస్థాయిలోనే ఉండేందుకు అవకాశాలు ఉన్నట్లు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. నిఫ్టీ ర్యాలీ 11,000–11,150 పాయింట్ల వరకు ఉండేందుకు అవకాశం ఉందని ఏంజెల్ బ్రోకింగ్ చీఫ్ టెక్నికల్ అండ్‌ డెరివేటీవ్‌ అనలిస్ట్ సమీర్ చవాన్.. ఇలా జరగని పక్షంలో 10,782–10,757 పాయింట్ల శ్రేణి కీలక మద్దతు స్థాయిగా పనిచేస్తుందన్నారు. ఇక వచ్చే నెలరోజుల్లో 4 నుంచి 10 శాతం రాబడిని అందించగలిగిన 10 షేర్లను పలు బ్రోకింగ్‌ సంస్థలు సిఫార్సుచేస్తున్నాయి. ఏ బ్రోకరేజ్‌ సంస్థలు ఏ ఏ షేర్లను సిఫార్సుచేస్తున్నాయన్న విషయానికి వస్తే..

ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సు
ఫెడరల్ బ్యాంక్ | ప్రస్తుత ధర: రూ.85.30 | టార్గెట్ ధర: రూ.94 | స్టాప్ లాస్‌: రూ.80 | రాబడి అంచనా: 10 శాతం
డైలీ చార్టులో ఈ షేరు 200-రోజుల సగటు కదలికల స్థాయి రూ.85.85 వద్ద ఉంది. వీక్లీ చార్టులో సిమ్మెట్రిక్‌ ట్రయాంగిల్‌ పాట్రన్‌ ఏర్పడింది. ఇక్కడ నుంచి బ్రేకవుట్‌ సాధించిన ఈ షేరు రూ.94 వరకు వెళ్లవచ్చని అంచనా.

5నాన్స్‌ డాట్‌ కామ్‌ సీఈఓ దినేష్ రోహిరా సిఫార్సు
వీ-గార్డ్ ఇండస్ట్రీస్ | టార్గెట్ ధర: రూ.221 | స్టాప్ లాస్‌: రూ.195 | రాబడి అంచనా: 5 శాతం
గడిచిన ఐదు రోజుల ట్రేడింగ్‌లో 200-రోజుల సగటు కదలికల స్థాయి రూ.202 ఎగువకు చేరింది. అంతకుముందు మూడు నెలలపాటు ఈస్థాయికి దిగువనే ఉంది. వీక్లీ చార్టులో అత్యధిక వాల్యూమ్స్‌తో షేరు బుల్లిష్‌ క్యాండిల్‌ స్టిక్‌ పాట్రన్‌ను ఏర్పరిచింది. 

చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ సిఫార్సులు
బాటా ఇండియా | ప్రస్తుత ధర: రూ.1,039 | టార్గెట్ ధర: రూ.1,115 | స్టాప్ లాస్‌: రూ.990 | రాబడి అంచనా: 7 శాతం
కీలక కన్సాలిడేషన్‌ స్థాయి నుంచి బ్రేకవుట్‌ సాధించి రూ.1,115 వద్ద నూతన జీవితకాల గరిష్టస్థాయి నమోదు దిశగా కదలాడుతోంది.

సీమెన్స్ | ప్రస్తుత ధర: రూ. 949 | టార్గెట్ ధర: రూ.990 | స్టాప్ లాస్‌: రూ.897 | రాబడి అంచనా: 4 శాతం
అత్యధిక వాల్యూమ్స్‌తో రూ.900 స్థాయి నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ఇక్కడ నుంచి రూ.990 చేరుకునే అవకాశం ఉందని అంచనావేశారు.

బ్రిటానియా ఇండస్ట్రీస్ | ప్రస్తుత ధర: రూ.3,159 | టార్గెట్ ధర: రూ.3,300 | స్టాప్ లాస్‌: రూ.3,037 | రాబడి అంచనా: 4 శాతం
8-రోజుల మైనర్‌ కన్సాలిడేషన్‌ నుంచి అధిక వాల్యూమ్స్‌తో బ్రేకవుట్‌ సాధించింది. రూ.3,037 స్టాప్‌లాస్‌ నిర్వహిస్తూ షేరును కొనుగోలుచేయవచ్చని సూచించారు.

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్ & డెరివేటివ్స్ అనలిస్ట్ హెడ్‌ రాజేష్‌ పాల్వియా సిఫార్సులు
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ | ప్రస్తుత ధర: రూ.2,724 | టార్గెట్ ధర: రూ.2,830 | స్టాప్ లాస్‌: రూ.2,572 | రాబడి అంచనా: 4 శాతం
డైలీ చార్టులో అసెన్డింగ్‌ ట్రయాంగిల్‌ పాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ఇది స్వల్పకాల అప్‌సైడ్‌ ట్రెండ్‌ రివర్సల్‌ సంకేతంగా వివరించారు.

అజంతా ఫార్మా | ప్రస్తుత ధర: రూ.1,180 | టార్గెట్ ధర రూ.1,255 | స్టాప్ లాస్‌: రూ.1,113 | రాబడి అంచనా: 6 శాతం
డైలీ చార్టులో కప్‌ అండ్‌ సాసర్‌ పాట్రన్‌ ఏర్పాటుచేసింది. ఈ పాట్రన్‌ను స్వల్పకాల అప్‌సైడ్‌ ట్రెండ్‌ రివర్సల్‌ సంకేతంగా వివరించారు.

ఎస్కార్ట్స్‌ | ప్రస్తుత ధర: రూ.707.95 | టార్గెట్ ధర రూ.754 | స్టాప్ లాస్‌: రూ.673 | రాబడి అంచనా: 6 శాతం
వీక్లీ చార్టులో 4 వారాల కన్సాలిడేషన్‌ శ్రేణి నుంచి బ్రేకవుట్‌ సాధించింది. 20-రోజులు, 50-రోజుల ఎస్‌ఎంఏకు ఎగువన ట్రేడవుతోంది.

బజాజ్ ఫైనాన్స్ | ప్రస్తుత ధర: రూ.2,531.35 | టార్గెట్ ధర: రూ.2,650 | స్టాప్ లాస్‌: రూ.2,410 | రాబడి అంచనా: 4 శాతం
వీక్లీ చార్టులో రూ.2,475-2,230 ధరల శ్రేణి నుంచి బ్రేకవుట్‌ సాధించింది. 20-రోజులు, 50-రోజుల ఎస్‌ఎంఏకు ఎగువన ట్రేడవుతోంది.

ఏంజెల్ బ్రోకింగ్ చీఫ్ అనలిస్ట్-టెక్నికల్ & డెరివేటివ్స్ సమీర్ చవాన్ సిఫార్సు
టొరెంట్ ఫార్మా | ప్రస్తుత ధర: రూ.1,773 | టార్గెట్ ధర: రూ.1,845 | స్టాప్ లాస్‌: రూ.1,748 | రాబడి అంచనా: 4 శాతం
గతనెల చివరిరోజున దాదాపు అన్ని ఫార్మా రంగ షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. తాజా ముగింపు రూ.1,747 వద్ద ఉన్న నిరోధాన్ని అధిగమించింది. డైలీ, వీక్లీ చార్టుల పరంగా షేరు బలంగా ఉంది.

ఇవి కేవలం అనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.



You may be interested

అశోక్‌ లేలాండ్‌, ఎం అండ్‌ ఎం డౌన్‌...మారుతి, టాటా మోటార్స్‌ అప్‌

Monday 3rd December 2018

దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు నవంబర్‌లో అంతంత మాత్రంగానే నమోదుకావడంతో ఆయాకంపెనీల షేర్లు సోమవారం మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి.   ఈ నెలలో మారుతి, అశోక్‌ లేలాండ్‌, టాటామోటర్స్‌ వాహన విక్రయాలు క్షీణించగా, ఎండ్‌అండ్‌ఎం అమ్మకాలు పెరిగాయి. పరిశ్రమలో ద్రవ్యత్వలోటు, రిటైల్‌ ఫైనాన్స్‌ తగ్గుముఖం పట్టడం, స్థూల ఆర్థిఖ వ్యవస్థ అంతంత మాత్రంగా నమోదుకావడం తదితర కారణాలు వాహన విక్రయాలపై ప్రభావాన్ని చూపాయని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు

మెటల్‌ షేర్ల మెరుపులు

Monday 3rd December 2018

అమెరికా - చైనాల మధ్య కుదిరిన వాణిజ్య యుద్ధ సంధి మెటల్‌ షేర్లకు కలిసొస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా మెటల్స్‌ ఉత్పత్తిదారుగా పేరొందిన చైనాపై అమెరికా టారీఫ్‌లను సడలించడంతో అంతర్జాతీయంగా మెటల్‌ ధరలు లాభాల బాట పట్టాయి. ధరల పెరుగుదలతో ఈ రంగానికి చెంది షేర్లు కూడా ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతానికి పైగా లాభపడింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(3,163.75)తో

Most from this category