STOCKS

News


ఈ 10 షేర్లు తారాజువ్వలు..!

Monday 5th November 2018
Markets_main1541414200.png-21727

గతవారం మార్కెట్‌ ట్రేడింగ్‌లో బుల్స్‌ పట్టు ఒక్కసారిగా పెరిగింది. సెన్సెక్స్‌ 1,662 పాయింట్లు (5 శాతం) పెరిగి 35,011 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 523 పాయింట్లు (5 శాతం) పెరిగి 10,553 పాయిం‍ట్లకు చేరుకుంది. మొదటి వారంలో స్మార్ట్‌ రికవరీని సాధించిన సూచీలు.. ఈ నెలలో ఇదే స్థాయి జోరును ప్రదర్శించవచ్చని, దీపావళి సందర్భంగా 10 షేర్లు మంచి రాబడిని అందించగలవని పలువురు దలాల్‌ స్ట్రీట్‌ పండితులు సూచిస్తున్నారు. 10,700-10,840 స్థాయిలో నిఫ్టీ ఉండవచ్చని, ఒకవేళ పడిపోతే 10,290 వద్దకు చేరుకోవచ్చనే అంచనాల ఆధారంగా ఈ షేర్లను సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే 15-21 సెషన్లలో ఈ షేర్లలో పెట్టుబడి ద్వారా మంచి రాబడిని పొందవచ్చని అంటున్నారు. ఆ 10 షేర్లు ఏవంటే..

టాటా స్టీల్ | కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.605 | స్టాప్‌లాస్‌: రూ.552
మెటల్‌ ఇండెక్స్‌, మార్కెట్‌ ప్రయాణానికి వ్యతిరేకంగా షేరు కొనసాగింది. రిలేటీవ్‌ స్ట్రెంత్‌ లైన్‌ ఆధారంగా చూస్తే ఈ షేరు మార్కెట్‌ను అవుట్‌పెర్ఫార్మ్‌ చేయనుందని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్ టెక్నికల్ అనలిస్ట్ మిలన్ వైష్ణవ్ విశ్లేషించారు. 50-రోజుల సగటు కదలికలను ఆర్‌ఎస్‌ లైన్‌ అధిగమించడం ద్వారా ఈ మేర రాబడి అంచనాను సూచిస్తుందన్నారు.

హిందాల్కో | కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.259 | స్టాప్‌లాస్‌: రూ.227
అధిక వాల్యూమ్స్‌తో ఈ షేరు రూ.230-210 స్థాయి ట్రేడింగ్‌ జోన్‌ను అధిగమించిందని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ అన్నారు.  రూ.230 దాటినందున రూ.260 వరకు వెళ్లవచ్చని సూచించారు. పొజిషనల్‌ ట్రేడర్లు రూ.227 దగ్గర స్టాప్‌లాస్‌ నిర్వహిస్తూ.. రూ 259 టార్గెట్‌తో కొనుగోలుచేయవచ్చని సూచించారు.

డీసీబీ బ్యాంక్ | కొనొచ్చు | టార్గెట్ ధర: రూ. 170 | స్టాప్‌లాస్‌: రూ. 152
రూ.140 వద్ద డబుల్‌ బోటమ్‌ను నమోదుచేసిన ఈ షేరు షార్ట్‌-టెర్మ్‌ ర్యాలీలో ఉంది. రూ.173 వరకు ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని మజర్‌ మహ్మద్‌ సూచించారు. పొజిషనల్‌ ట్రేడర్లు రూ.152 వద్ద స్టాప్‌లాస్‌ నిర్వహిస్తూ షేరును వచ్చే 15-21 సెషన్ల కోసం కొనుగోలుచేయవచ్చని సూచించారు.

సెయిల్ | కొనొచ్చు | టార్గెట్ ధర: రూ. 77 | స్టాప్‌లాస్‌: రూ.66
రూ.61 దగ్గర డబుల్‌ బోటమ్‌ను నమోదుచేసిన ఈ షేరు షార్ట్‌-టెర్మ్‌ ర్యాలీలో ఉంది. రూ.67 ఎగువన నిలబడ గలిగితే రూ.77 వరకు ఈ ర్యాలీ కొనసాగించే అవకాశం ఉందని మజర్‌ మహ్మద్‌ సూచించారు. 

మారుతి సుజుకి | కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.7700 | స్టాప్‌లాస్‌: రూ.6800
రూ.6500 కనిష్టస్థాయిని తాకిన ఈ షేరు అక్కడ నుంచి షార్ప్‌ రికవరీని సాధించింది. అధిక వాల్యూమ్స్‌తో న్యారో ట్రేడింగ్‌ రేంజ్‌ను దాటే ప్రయత్నంలో ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ సుభాష్ గంగాధరన్ విశ్లేషించారు.

ఎక్సెల్ క్రాప్ కేర్ | కొనొచ్చు | టార్గెట్ ధర: రూ .4,650 | స్టాప్‌లాస్‌: రూ. 3,600
శుక్రవారం అధిక వాల్యూమ్స్‌తో ఈ షేరు ఒక్కసారిగా పెరిగింది. దీంతో 5 వారాల గరిష్ట స్థాయి ముగింపును నమోదుచేసింది. 14-రోజుల ఆర్‌ఎస్‌ఐ వంటి మూమెంటమ్‌ ఇండికేటర్స్‌ షేరు ధర పెరుగుతుందని సూచిస్తున్నాయని సుభాష్ అన్నారు.

సీజీ పవర్ | కొనొచ్చు | టార్గెట్ ధర: రూ 43 | స్టాప్‌లాస్‌: రూ. 35.50
ఈ షేరు ఐదు వారాల పతనపు నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు కనిపిస్తోంది. ఇక్కడ నుంచి బౌన్స్‌బ్యాక్‌ లేదంటే, పూర్తి రీట్రేస్‌మెంట్‌కు అవకాశం ఉందని ఆనంద్ రాఠీ స్టాక్ బ్రోకర్స్‌, ఏవీపీ ఈక్విటీ రీసెర్చ్‌ అనలిస్ట్‌ జయ్‌ తక్కర్ విశ్లేషించారు. 

హెచ్‌డీఎఫ్‌సీ | కొనొచ్చు | టార్గెట్ ధర: రూ. 1910-1930 | స్టాప్‌లాస్‌: 1739
వీక్లీ చార్టు ఆధారంగా చూస్తే.. రూ.1,740 వద్ద బ్రేకవుట్‌ సాధించినట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ హెడ్‌ టెక్నికల్ అండ్‌ డెరివేటివ్ అనలిస్ట్ రాజేష్ పాల్వియా విశ్లేషించారు. 

స్టెరిలైట్ టెక్నాలజీస్ | కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.390-400 | స్టాప్‌లాస్‌: రూ. 354
వీక్లీ చార్టు ఆధారంగా రూ.370-270 కన్సాలిడేటెడ్‌ రేంజ్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించినట్లు రాజేష్ వివరించారు. ఇందుకు అధిక వాల్యూమ్స్‌ జతైనట్లు తెలిపారు. రూ.390-400 స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు.

రేమండ్ | కొనొచ్చు | టార్గెట్ ధర: రూ. 790-805 | స్టాప్‌లాస్‌: రూ. 729
వీక్లీ చార్టు ఆధారంగా రూ.693 రేంజ్‌ నుంచి అధిక వాల్యూమ్స్‌తో బ్రేకవుట్‌ సాధించినట్లు రాజేష్ విశ్లేషించారు. దిగువస్థాయిలో రౌండింగ్‌ బోటమ్‌ పాట్రన్‌ను ఏర్పాటుచేసినందున పాజిటీవ్‌గా ఉండేందుకు అవకాశం ఉందన్నారు.

ఇవి కేవలం మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.


 You may be interested

35వేల దిగువకు సెన్సెక్స్‌

Monday 5th November 2018

ఆర్థిక, ఔషధ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, అటో షేర్ల పతనంతో మార్కెట్‌ సోమవారం నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 61 పాయింట్ల కోల్పోయి 34,951 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల నష్టపోయి 10,528 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రభుత్వరంగబ్యాంక్‌, రియల్టీ, మెటల్‌, ఐటీ రంగాలకు చెంది సూచీలు లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండో విడుత మూలధన సాయం కింద రూ.54వేల కోట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే

ఎస్‌బీఐ లాభం రూ.945 కోట్లు

Monday 5th November 2018

దేశీ దిగ్గజ బ్యాంక్‌ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌బీఐ) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ స్టాండలోన్‌ నికర లాభం 40 శాతం క్షీణతతో రూ.945 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.1,581 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్యూ1లో బ్యాంక్‌ ఏకంగా రూ.4,875 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.

Most from this category