STOCKS

News


10 లార్జ్‌క్యాప్‌ సిఫార్సులు.. 40% వరకు రాబడి..!

Tuesday 20th November 2018
Markets_main1542697434.png-22222

ముంబై: ఆగస్టులో నమోదైన జీవితకాల గరిష్టస్థాయి నుంచి చూస్తే.. సూచీలు ఇప్పటికీ 9 శాతం నష్టాల్లో ఉన్నాయి. తాజా కరెక్షన్‌లో అనేక నాణ్యమైన షేర్లు 52-వారాల గరిష్టస్థాయి దిగువకు పడిపోయాయి. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తరహా షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆకర్షణీయ లాభాలను పొందవచ్చని మోతిలాల్ ఓస్వాల్ సూచిస్తోంది. నాణ్యమైన షేర్ల జాబితాలోని 10 లార్జ్‌క్యాప్‌ షేర్లు 52-వారాల గరిష్టస్థాయి నుంచి 27 శాతం పడిపోగా.. వీటిలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా 9-40 శాతం వరకు లాభాలను సొంతం చేసుకోవచ్చని విశ్లేషించింది. ఆర్ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, హిందాల్కో షేర్లలో 40 శాతం లాభాల వరకు ఆస్కారం ఉందని సూచిస్తోంది. ఈ షేర్లను సూచించాడానికి గల కారణాలను విశ్లేషించిన ఈ సంస్థ.. ‘నిఫ్టీ కంపెనీల క్యూ2 ఫలితాలు ఆదాయాలు అనలిస్టుల అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. 73 కంపెనీల ఎర్నింగ్స్‌లో 3 శాతం కోత ఉండగా, 38 కంపెనీలలో 3 శాతం అప్‌గ్రేడ్‌ నమోదైంది. ఆశాజనక వృద్ధి రేటు, కార్పొరేట్ బ్యాంకుల ఆస్తి నాణ్యత మెరుగుపడుతుండడం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ.. ఆటో, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలలో ఎర్నింగ్స్‌ తెరపైకి వచ్చింది. దీంతో ఎర్నింగ్స్‌ ట్రెండ్‌ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నాణ్యమైన షేర్లు కిందకు పడిపోయినప్పుడు కొనుగోలు చేసుకుంటూ వెళ్లడం తగిన నిర్ణయమే అవుతుంది.’ అని వ్యాఖ్యానించింది. సిఫార్సుచేసిన 10 కంపెనీల ఈపీఎస్‌ అంచనాలు.. 2019, 2020 ఆర్థిక సంవత్సరాలలో అధికంగా ఉన్నట్లు విశ్లేషించింది. ఈ బ్రోకింగ్‌ సంస్థ సూచనలకు బలాన్ని చేకూరుస్తున్న, ప్రతికూలంగా ఉన్న మరికొన్ని విశ్లేషణలను ఒకసారి పరిశీలిస్తే..

కేవలం కొన్ని షేర్ల ర్యాలీ కారణంగానే లార్జ్‌క్యాప్‌ సూచీలు అధికస్థాయిలో ఉన్నాయి. మార్కెట్‌ బ్రెడ్త్‌ ఇప్పటికీ బలహీనంగానే ఉంది. బ్రోడర్‌ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉందని ఎడిల్‌వీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు. మార్కెట్‌ పతనంలో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు అత్యధికంగా నష్టపోతాయని విశ్లేషించిన ఆయన.. లార్జ్‌క్యాప్‌లలో అవకాశాలను చూడడం బెటరని సూచించారు.

భారత మార్కెట్‌ వాల్యుయేషన్స్‌ అధికంగానే ఉన్నాయి. గత చరిత్ర, బాండ్‌ ఈల్డ్‌తో చూస్తే.. తాజా పతనం తరువాత కూడా ఇదే పరిస్థితి ఉంది. నిఫ్టీ-50 సూచీ నికర లాభం వృద్ధి 2019, 2020 ఆర్థిక సంవత్సరాలలో 15, 26 శాతంగా అంచనావేసినట్లు కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. ఫైనాన్షియల్స్‌, ఎనర్జీ, మెటల్స్‌, మైనింగ్, పవర్‌ యుటిలిటీ రంగాలలో రంగ షేర్లలో విలువ ప్రస్తుతం ఆకర్షణీయంగానే ఉన్నప్పటికీ.. ప్రపంచ ద్రవ్య పరిస్థితుల్లో కఠినత్వం, బాండ్‌ ఈల్డ్‌ పెరుగుదల వంటి చర్యలతో వీటిలో రిస్క్‌ ఉండనుందని విశ్లేషించింది.

లార్జ్‌క్యాప్స్‌లో రిస్క్‌-రిటర్న్‌ పోర్టిఫోలియో బెటర్‌గా ఉందని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ వివేక్‌ రంజన్‌ మిశ్రా అన్నారు. ఇన్వెస్టర్లు పలు క్వాలిటీ షేర్లకు మాత్రమే పరిమితమై ఉండడం మంచిదని సూచించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో మార్కెట్‌ ఒడిదుడుకులు ఇంకొంత కాలం తప్పదని, వచ్చే ఏడాది చివరినాటికి సెన్సెక్స్‌ 45,000 పాయింట్లకు చేరకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. 


 You may be interested

మెటల్‌ షేర్ల పతనం

Tuesday 20th November 2018

మార్కెట్‌ పతనంలో భాగంగా మంగళవారం మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రపంచట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో అత్యధికంగా 2శాతం నష్టపోయింది.  మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు(3,395.35)తో పోలిస్తే 2శాతం నష్టంతో రూ.3,329.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 11 షేర్లు

ఫినొలెక్స్‌ కేబుల్స్‌పై పాజిటివ్‌

Tuesday 20th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఫినొలెక్స్‌ కేబుల్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఫినొలెక్స్‌ కేబుల్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.476 టార్గెట్‌ ప్రైస్‌: రూ.598 ఆనంద్‌రాఠి.. ఫినొలెక్స్‌ కేబుల్స్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.598గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత క్యూ2లో నిరుత్సాహ ఫలితాలను ప్రకటించిందని తెలిపింది. పీఏటీ వార్షికంగా 7 శాతం తగ్గిందని పేర్కొంది. రెవెన్యూ వృద్ధిలో వార్షికంగా పురోగతి లేదని

Most from this category