అప్‌మూవ్ కొనసాగాలంటే 10985 దాటాల్సిందే!
By D Sayee Pramodh

గతవారం నిఫ్టీ ఆరంభంలో అదరగొట్టి చివరకు స్వల్ప లాభంతో సరిపెట్టుకుంది. గతంలో జరిగిన పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్ధాయి వద్ద నిఫ్టీ ప్రస్తుతం బలమైన నిరోధం ఎదుర్కొంటోంది. స్వల్పకాలిక ట్రెండ్, టెక్నికల్ అంశాలు మాత్రం బుల్లిష్నెస్నే సూచిస్తున్నాయి. అందువల్ల మరోమారు నిరోధాన్ని దాటే ప్రయత్నాలు జరగవచ్చని నిపుణుల అంచనా. తాజాగా చార్టుల్లో జీఎంఎంఏ ఇండికేటర్ ‘కొనొచ్చు’ సంకేతాలు ఇచ్చింది. బుల్స్‌కు ఇంకా బలం తగ్గలేదనేందుకు ఇదే సంకేతమని నిపుణులు చెబుతున్నారు. వీక్లీ, మంత్లీ చార్టులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. వీటిలో హయ్యర్‌హై, హయ్యర్లో ఏర్పరుస్తూ వస్తోంది. ప్రస్తుతం వీఐఎక్స్ సూచీ 16కు దిగువన ఉంది. నిఫ్టీ తన 20, 50, 200 రోజుల డీఎంఏ స్థాయిలున్న 10840- 10860 రేంజ్‌కు పైనే కదలాడుతోంది. అందువల్ల దిగువన బలమైన మద్దతు కూడగట్టుకున్నట్లు భావించవచ్చు. దిగువన ఈ మద్దతు స్థాయిలకు వచ్చినప్పుడల్లా కొనుగోళ్లను పరిశీలించవచ్చని నిపుణుల సూచన. పైన 10985 స్థాయిని బలంగా దాటితేనే మరింత అప్‌మూవ్ ఉంటుంది. దీన్ని దాటగలిగితే 11100, 11200 పాయింట్ల వరకు పయనించవచ్చు. బ్యాంకు నిఫ్టీ 27585 పాయింట్లు దాటితేనే బ్రేకవుట్‌గా భావించాలి. బ్రేకవుట్ సాధిస్తే 27900 పాయింట్ల వరకు ర్యాలీ ఉండొచ్చు.
You may be interested
1300 డాలర్ల పైన పసిడి పటిష్టమే
Monday 11th February 2019పసిడిపై నిపుణుల అంచనా.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్- న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్- నైమెక్స్‌లో పసిడి ధర పటిష్టంగానే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఔన్స్ ధర 1,300 డాలర్లపైన కొనసాగినంతకాలం పసిడిది బులిష్ ధోరణిగానే పరిగణించాల్సి ఉంటుందన్నది వారి విశ్లేషణ. శుక్రవారంతో ముగిసిన వారంలో ధర ఒక దశలో 1,307 డాలర్లకు పడినా, అటుపై తిరిగి 1,318 డాలర్లకు చేరడం గమనార్హం. అయితే వారంవారీగా చూస్తే ఇది 4 డాలర్లు తక్కువ. 1,325
ఆర్థిక ఒత్తిడిని ఎలా జయించాలి
Monday 11th February 2019ఆర్థిక ఒత్తిడిని జయించాలంటే..! ఆర్థిక సమస్యలు ఎక్కువైతే ఆరోగ్యానికీ ముప్పు ఖర్చుల విషయంలో పక్కాగా వ్యవహరించాలి కనీస అవసరాలకే ప్రథమ ప్రాధాన్యం తర్వాత లక్ష్యాల కోసం పెట్టుబడులు మిగిలితేనే విచక్షణారహిత వినియోగం ఇందుకోసం ప్రతీ ఒక్కరికీ బడ్జెట్ అవసరం ఇప్పుడు ఎవరినోటవిన్నా వినిపిస్తున్న మాట.. ఒత్తిడి. జీవనశైలిలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులే దీనికి ప్రధాన కారణమంటూ సర్వేలు ఊదరగొడుతున్నాయి. ఇక మన దేశానికొస్తే... ప్రతీ పది మందిలో ఒక్కరు మినహా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లకు ఆర్థిక అంశాలే మూలమని సిగ్నా 360